చాంచల్య | Chanchalya | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 23, 2023 · 18 MIN

చాంచల్య | Chanchalya | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Chanchalya' - New Telugu Story Written By Pandranki Subramani 'చాంచల్య' తెలుగు కథ రచన: పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బ్లోయింగ్ విండ్ సాఫ్టువేర్ కంపెనీ మియాపూర్ లో ఉన్న మియానీ కట్టడం ఐదవ అంతస్థులో ఉంది. కొత్త కట్టడం, కొత్త సాంకేతికపరమైన సోఫిస్టికేటడ్ హంగులతో ఫెళ్ళున చూపుల్ని తాకే అధునాతన తీరు తెన్నులతో కళ కళలాడుతూ ఉంటుంది. అటూ యిటూ ఇరువైపులా ఫ్రంట్ సపోర్టింగ్ ఆఫీసూ, బ్యాక్ సపోర్టింగు ఆఫీసూను-- ఎంతటి పని రద్దీలోనైనా సరే మోమున అలసట కనిపించని ఫ్రెష్ లుక్ తో ఫ్రెష్ ఫీల్ తో కనిపిస్తారు అక్కడి స్టాఫ్. డ్రెస్ కోడ్ కి తావులేకుండా తాజాగా అప్పటికప్పుడు కార్యాలయానికి వచ్చినట్టు డ్రెస్సప్పయి కనిపిస్తూరు. అలా ట్రిమ్ గా నీటుగా ఉండటం కార్పొరేట్ కంపెనీ నియమం.. పెర్మార్మెన్స్ రివ్యూలో ఒక భాగం. బయటనుండి లోపలకు ప్రవేశించే చాలా మందికి, ముఖ్యంగా జాబ్ లో కుదరడానికి ప్రయాసపడే యువతీ యువకులకి అక్కడి నూతనోత్సాహపు కార్పొరేట్ వాతావరణంతో మమేకం కావడానికి కుతూహళం చూపిస్తారు. అక్కడ ట్రేడింగ్ సాఫ్టువేర్ డెస్కు వద్ద సెటిల్ ఐన ఆరునెలల తరవాత ప్రకాశ్ నగరుకి చెందిన వరదరాజు ప్రక్క సీట్లో పనిచేస్తూన్న కోమలితో పరిచయం యేర్పడింది. యవ్వన ప్రాయ ప్రాంగణంలో డేషింగ్ పర్సనాలిటీస్ ని ద్విగుణీకృతం చేసుకునే ఇద్దరు అపోజిట్ జెండర్ కి చెందిన యువతీ యువకులు దగ్గర కావడం సహజమే కదా! సుమావాంఛకున్న సహజ గుణాంశం అదే కదా! చూపులూ చూపులూ లాక్ అయి, గాలానికి చేపలు తగుల్కున్నట్టు యేర్పడ్డ ఆ దగ్గరితనం మోహతరంగాలలో తేలి పోయేలా చేయడం కూడా సహజ పరిణామమే కదా! అపోజిట్ సెక్స్ శరీర వాసనలు ముఖ్యంగా ఈస్ట్రోజిన్ హార్మోనులు పరస్పరం ఒరసుకోవడంలో ఆశ్చర్యం యేముంది? ఇక కావలసింది ఒడుపుగా ఆనంద తీరాలను అందుకోవడమేగా మిగిలింది. ఇక పెద్దల సమక్షాన పెళ్లి చూపులకు లాంఛన ప్రాయంగా యేర్పాటు చేయడమేగా తరవాయి. అప్పుడు వరదరాజుకి తన కాలేజీ మేట్ మదన్ నుంచి ఫోను వచ్చింది. తను పంపించిన రెస్యూమ్ ని యెలాగో ఒకలా ఎమ్డీ కారిడర్ లోకి పుష్ చేయమని. ఎంతటి సాన్నిహిత్యం గల కాలేజీ మేటయినా వరదరాజు ఈ విషయంలో రెండడుగులు వెనక్కివేసాడు. ఎందుకంటే మదన్ పోకడ గురించి.. ముఖ్యంగా అతడి మనస్తత్వం గురించి అతడికి తెలుసు కాబట్టి. కాలేజీలో ఒకే బ్యాచ్ మేట్సయినా వరజరాజు సాధ్యమైనంత మేర మదన్ దరదాపుల నుండి తొలగి ఉండటానికి ప్రయత్నించేవాడు. కారణం- మదన్ కి దూకుడెక్కువ. అవసరం ఉన్నా లేకపోయినా అతడు అందిరితో.. ముఖ్యంగా అందమైన అమ్మాయిల చూపుల్లో పడటానికి ఉబలాట పడుతుంటాడు. జాలరిలా ఊడి బయటకు రానివ్వని ఫ్యాబ్రిక్ వల వేస్తుంటాడు. చురుకైన హావభావాలతో పాలల్లో నీళ్ళలా వాళ్లతో కలసిపోతుంటాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/iiBF3_p62lU

Episode metadata supplied by the publisher feed · Published Jul 23, 2023

Embed this episode

NOW PLAYING

చాంచల్య | Chanchalya | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 18:40

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 23, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!