చెడులో కూడా మంచి | Chedulo Kuda Manchi | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 12, 2022 · 13 MIN

చెడులో కూడా మంచి | Chedulo Kuda Manchi | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చెడులో కూడా మంచి రచన: యశోద పులుగుర్త (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రాధమ్మ కి ఎనిమిదవ సంవత్సరంలోనే పెళ్లిచేసేసారు ఆమె తల్లితండ్రులు.. పన్నెండేళ్ళకే కాపురానికి పంపేశారు.కట్నాలు ఇచ్చుకోలేక తమ కూతుళ్లను వయస్సు వ్యత్యాసం గానీ రెండో పెళ్లివాడనిగానీ ఆలోచించకుండా కట్టబెడ్తున్న రోజులవి.. రాధమ్మకూ, ఆమె భర్త పరమేశ్వరానికి ఇరవై సంవత్సరాల వ్యత్యాసం.. అత్తవారింటికి వచ్చిన రాధమ్మ ముగ్ధ.. ఇంకా పరిపక్వత రానివయస్సు, పాలుగారే బుగ్గలతో, బెదురుచూపులతో ఇంటి పెద్దకోడలిగా అత్తవారింట ఒదిగిపోయింది.. భర్త ఏ పని చేస్తాడో తెలియదు.. తను చూచాయగా విన్నది ఏమిటంటే వ్యవసాయం అని.. పొద్దుటే వెళ్లిపోయిన మనిషి అర్ధరాత్రి రావడం, ఎక్కడో అలసిన శరీరంతో ఏ కొట్టుగదిలోనో నిద్రపోతున్న రాధమ్మను బలవంతంగా బర బరా ఈడ్చుకుంటూ తనగదిలోకి తీసుకుపోయి ఆమె శరీరాన్ని పశువులా ఆక్రమించుకునేవాడు.. భర్తను చూడగానే చిగురుటాకులా వణికిపోయే రాధమ్మ పదునాలుగేళ్ల వయస్సులోనే తల్లి అయింది.. " ఇదా, పెళ్లంటే "? తన స్నేహితురాలు పూర్ణకు తనకంటే ముందరే పెళ్లి అయింది.. తానూ వెళ్లిందా పెళ్లికి.. ముత్యాలపల్లకీలో పూర్ణ ఎదురుగా అందాల రాకుమారుడు ఉరేగుతుంటే తన పెళ్లి కూడా అలాగే అంగరంగ వైభవంగా అవుతుందని కలలుగంది. భర్త తనతో ఒక్క మాట మాటలాడడు.. అతని రూపం ఎలా ఉంటుందో కూడా తనకి పూర్తిగా తెలియదు.. అర్ధరాత్రి అతని స్పర్శలో నలిగిపోవడం మాత్రమే తనకు తెలుసు.. తన పెళ్లికి పరమార్ధం ఇదా అనుకుంటూ దిండులో తలదాచుకుంటూ ఏడిచేది.. ఆ నిశీధి రాత్రులలో ఆమె మూగ ఆవేదనను వినేదెవరు?.. ఒకరోజు ఒంట్లో నలతగా ఉండి ఏడాది పసిపిల్ల వకుళని పక్కలో పెట్టుకుని నిద్రపోతోంది.. ఆకొన్న సింహలా తిరిగాడు పరమేశ్వరం.. " రాధా!" అని గర్జిస్తున్నట్లుగా పిలిచాడు.. ఒణికిపోతూ భయంతో ముడుచుకు పోయింది.. అతని పైశాచిక ప్రవర్తన రాధ కు భరింపరాని చీదర జుగుప్స కలిగేది.. మరో మగబిడ్డ కు జన్మనిచ్చింది.. పరమేశ్వరానికి ఉన్నట్టుండి విపరీతమైన జ్వరం దగ్గు వచ్చేది.. డాక్టర్ టి..బి.. అనిచెప్పాడు.. అతనికున్న చెడు వ్యసనాలు, సరైన వైద్యం చేయించుకోకపోవడంతోజబ్బు ముదిరిపోయి మూడునెలలో శాశ్వతంగా రాధమ్మ జీవితంనుండి వీడ్కోలు తీసుకున్నాడు.. పదహారు సంవత్సరాలకే రాధమ్మ నుదుట కుంకుమ చెరిగిపోయి ఇద్దరు పసిబిడ్డలతో పుట్టినింట చేరింది.. అప్పటికే రాధమ్మ తండ్రి చనిపోతే ఏ ఆధారంలేని తల్లి తన ఇద్దరి మగబిడ్డలతో అన్నగారి పంచన చేరింది.. రాధమ్మ కూడా మేనమామ పంచన చేరక తప్పలేదు.. అతను పెద్ద ఆస్తిపరుడు కాకపోయినా లౌక్యం తెలిసిన మనిషి.. సమాజంలోని దొంగ పెద్ద మనుషులకు ప్రతీక… మాయమాటలతో పబ్బం గడుపుకునేవాడు… అతని ప్రయోజనం కోసం ఇతరులకు కష్టపెట్టడానికి కూడా వెనుకాడడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/iA94nL4m4HM

Episode metadata supplied by the publisher feed · Published Nov 12, 2022

Embed this episode

NOW PLAYING

చెడులో కూడా మంచి | Chedulo Kuda Manchi | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 13:17

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 12, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!