EPISODE · Aug 4, 2023 · 10 MIN
చేదు నిజం | Chedu Nijam | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Chedu Nijam' - New Telugu Story Written By D V D Prasad 'చేదు నిజం' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: డి వి డి ప్రసాద్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కమలమ్మ మది అల్లకల్లోలంగా ఉంది. ఆలోచనలతో నిద్రపట్టక మంచం మీద దొర్లుతోంది. పదిరోజుల్లో తమ పరిస్థితి అంతా తారుమారైంది. కొడుకు, కోడలు, మనవడితో సుఖంగా కాలం గడుపుతున్న తమకు ఎంతటి విషమ పరీక్ష ఎదురైంది! పదిరోజుల క్రితం వరకూ తమపై అవాజ్యమైన ప్రేమ కనబరచిన ప్రతాప్కి ఉన్నట్లుండి ఏమైంది? కోడలు ప్రమీల కూడా బాగా ఆదరించేది, అభిమానించేది. ఇంటి చుట్టుపక్కలవాళ్ళందరూ వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళంటే అసలు నమ్మగలిగేవారు కాదు, అలా ఉండేది ఇద్దరిమధ్య అనుబంధం. మూడేళ్ళ మనవడు చింటూ తనని వదిలి ఒక్క క్షణం ఉండలేడే? అలాంటిది అకస్మాత్తుగా వాళ్ళలో ఇంతటి మార్పు ఎలా సంభవించింది? పదిరోజుల క్రితం ఉన్నట్లుండి తమ మకాం ఔట్హౌస్కి మార్చారు. భోజనం కూడా అక్కడికే వచ్చేది. మాట్లాడటం, పలకరించడం అటుంచి అసలు కనపడటమే మానేసారు కోడుకుకోడలు ఇద్దరూనూ. చింటూని కూడా దూరం పెట్టారు. రోజూ ఆప్యాయంగా తనకి, తన భర్తకీ అన్నీ అమర్చిపెట్టే కోడలు ప్రమీలలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతోందామె. నాలుగు రోజుల క్రితమైతే ప్రతాప్ స్నేహితుడు ప్రసాద్ వచ్చి ఇద్దర్నీ ఈ వృద్ధాశ్రమంలో చేర్చాడు. ఇక్కడకు వస్తున్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ కనపడలేదు. మనవడ్ని చూడకుండా తనెలా బ్రతకగలదు? తన ప్రాణంలో ప్రాణమైన ప్రతాప్ ఇంత కర్కశమైన నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు? ప్రమీల ఆ నిర్ణయానికి ఎలా మద్దతు పలికింది? ఇక ఎప్పటికీ తమ బ్రతుకింతేనా! ఇక్కడికొచ్చి నాలుగురోజులైనా ఇంతవరకూ ప్రతాప్ చూడటానికి కూడా రాలేదు. ఆలోచిస్తున్నకొద్దీ ఆమె మెదడు మొద్దుబారిపోతోంది. గుండెలు బరువెక్కుతున్నాయి. పక్కనే పడుకున్న రామచంద్రయ్య కంటిమీద కూడా కునుకు రావడంలేదు. భార్య కమలమ్మ అసహనంగా పక్కమీద దొర్లడం చూసి, అనునయంగా ఆమెతలపై చేయి వేసి నిమిరాడు. ఆమె ఎంతదాచుకున్నా ఆమె ముఖంలో దుఃఖ వీచికలు, కళ్ళల్లో ఉప్పొంగే కన్నీళ్ళు గమనించాడాయన. భార్య కళ్ళల్లో నీళ్ళు చూసి చలించిపోయాడు. ఆమెని అలాంటి స్థితిలో చూసిన రామచంద్రయ్యకి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "చింటూని చూడాలని ఉందా?" ఆమె వైపు జాలిగా చూస్తూ అడిగాడు. అవునన్నట్లు తల ఊపిందామె తన కళ్ళఉబికి వస్తున్న నీళ్ళు భర్తకి కళ్ళబడకుండా జాగ్రత్తపడటానికి ప్రయత్నిస్తూ. అయితే ఎంత ప్రయత్నించినా ఆమె దుఃఖం ఆగలేదు. అంతవరకూ అస్థిమితంగా ఉన్న ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. చేతులో ముఖం దాచుకొని రోదించసాగింది. "మనం ఏం పాపం చేసామండీ, భగవంతుడు మనకీ శిక్ష విధించాడు? అసలు వాళ్ళని చూడకుండా మనము బ్రతికి ఉండగలమా? చింటూని చూడకుండా అసలు బ్రతకగలమా? మననెంతో ప్రేమగా చూసుకునే అబ్బాయి, కోడలు ఇలా చేసారంటే నమ్మలేకుండా ఉన్నాను." అందామె గద్గద స్వరంతో. "నీకే కాదు నాకూ వాణ్ణి చూడాలని ఉంది. నాకూ అదే ఆశ్చర్యంగా ఉంది కమలా! ప్రతాప్ ఇలాంటి పని చేస్తాడని నేను కలలో కూడా ఊహించనైనా లేదు. కాలం ఎలాంటి వాళ్ళలోనైనా మార్పు తీసుకువస్తుంది. ఊరుకో! మనసు రాయి చేసుకో! జీవితాంతం నీకు నేను, నాకు నువ్వు తోడు అనుకో! మన రాత ఇలాగే ఉందని అనుకో! ఎక్కువ ఆలోచించుకొని ఉన్న రక్తపుపోటు పెంచుకొని ఆరోగ్యం పాడుచేసుకోకు." ఊరడించాడామెని. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/edOG3opOORs
Embed this episode
NOW PLAYING
చేదు నిజం | Chedu Nijam | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.