చీకటి వెలుగులు పార్ట్ 2 | Chikati Velugulu Part 2 | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 12, 2023 · 17 MIN

చీకటి వెలుగులు పార్ట్ 2 | Chikati Velugulu Part 2 | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Chikati Velugulu Part 2/2' - New Telugu Story Written By Allu Sairam 'చీకటి వెలుగులు పార్ట్ 2/2' పెద్ద కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: అల్లు సాయిరాం కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: ప్రకాష్ ఒక ఔత్సాహిక రచయిత. అయితే సరైన అవకాశాలు లేవని నిస్పృహలో ఉంటాడు. అతని తండ్రి, ప్రకాష్ ని చిత్రకారుడు శేఖర్ కి పరిచయం చేస్తాడు. కళ్ళు లేకపోయినా చక్కటి నఖ చిత్రాలు గీస్తున్న శేఖర్ గతం అడుగుతాడు ప్రకాష్. డిఫెన్స్ ఉద్యోగంలో చేరబోయే సమయంలో కళ్ళు పోగుట్టుకున్న విషయాన్ని వివరిస్తాడు శేఖర్. ఇక చీకటి వెలుగులు పార్ట్ 2 చదవండి. శేఖర్ కొనసాగిస్తూ "తర్వాత హాస్పిటల్లో డాక్టర్ నాన్నతో ఆ కర్రముక్క కంట్లో చాలాబలంగా గుచ్చుకుంది. ఒక కంటి ద్వారా రెండో కంటికి కూడా ఇన్ఫెక్షన్ మూలంగా సోకి పూర్తిగా కంటిచూపు పోయింది అని చెప్తుంటే, పెట్టుకున్న ఎన్నో ఆశలు నెరవేరకపోగా, పైగా తాను కొట్టిన కర్రముక్క వలన యిలా జరిగిందని, కొడుకు జీవితం చీకటి అయిపోతుందన్న విషయం జీర్ణించుకోలేని తండ్రి బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో, ఆ బాధలో ఆయన చేసిన ప్రయత్నాలు, ప్రార్ధనలు, దండాలు మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎంత ప్రార్థించినా, బతిమాలినా డాక్టర్ అవకాశం లేదని చెప్పేయడంతో, కొన్నిరోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి నన్ను యింటికి తీసుకువచ్చారు. సాధారణంగా సాగిపోతున్న మా జీవితసముద్రాల్లో ఊహించని అలజడి రేపిన అలల ధాటికి చితికిపోయిన తండ్రి హృదయం, యింటికి నన్ను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ ఎలా జరిగింది అని అడుగుతుంటే, సమాధానం చెప్పలేక, ఉద్దరిస్తాడు అనుకున్న కొడుకు ఉసూరుమంటూ మూల కూర్చునేటట్టు, నా చేతులతో నేనే చేసినాను. అంతా నా కర్మ! మళ్లీ బాబుకి చూపు వస్తుందంటే, నా చూపు వాడికివ్వనా! అని అంటూ తలుచుకుని తలకొట్టుకుంటూ కుమిలిపోయేవాడు! నా పరిస్దితి యింకా అధ్వాన్నం. పగలైనా, పడుకున్నా చీకటే! నేను పుట్టి పెరిగిన యింట్లో బతకడమే కష్టంగా అనిపించేది. తండ్రిగా నాన్న నా చిన్నప్పుడు చెయ్యిపట్టుకుని చేయించిన చిన్నచిన్న పనులు మళ్లీ చేయిస్తుంటే, నాకు రెండో జన్మలా అనిపించింది. పనులు మానుకుని నాన్న యింటి దగ్గర నన్ను చూసుకోవడానికి ఉండిపోయేవాడు!" అని భావోద్వేగంగా చెప్తూ, ప్రకాష్ నుంచి స్పందన లేకపోవడంతో "ప్రకాష్ గారు! ప్రకాష్ గారు!!" అని పిలిచాడు శేఖర్. "ఆఁ చెప్పండి! యిక్కడే ఉన్నాను. వింటున్నాను!" అని పొడిబారిన గొంతుతో అన్నాడు ప్రకాష్. "ఓఁ ఉన్నారా! ఎటువంటి శబ్దం లేకపోయేసరికి" అని శేఖర్ అంటుంటే "మీరే కదా, మధ్యలో ఏం అడగొద్దన్నారు! అయినా, తరువాత జరిగేది ఊహకి కుడా ఏం అందట్లేదులేండి!" అని అన్నాడు ప్రకాష్. "అయ్యోయ్యో! ఏమైనా అడగాలంటే అడగండి. పర్వాలేదు!" అని అన్నాడు శేఖర్. "మీకు పర్వాలేదు. కానీ, మాకు యిబ్బంది శేఖర్!" అని అన్నాడు జగన్నాథం అక్కడికి వస్తూ. "ఏమైంది గురువుగారు?" అని శేఖర్ కంగారుపడుతుంటే "ఏంలేదు శేఖర్! మాట్లాడండని అంటే, టైం రాత్రి పదిన్నర గంటల దాటుతున్నా యింకా మాట్లాడుకుంటున్నారు. యింటికి బయలుదేరు శేఖర్. రేపు ఉదయం మళ్ళీ రావాలి కదా! మిగతా సగం కథ రేపు మాట్లాడుకోండి!" అని జగన్నాధం నవ్వుతూ అంటే "సరే సార్!" అని అంటూ తన చేతిసంచి సర్దుకుని బయలుదేరుతున్నాడు శేఖర్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/e01P-fQeOPs

Episode metadata supplied by the publisher feed · Published Aug 12, 2023

Embed this episode

Ready to play

చీకటి వెలుగులు పార్ట్ 2 | Chikati Velugulu Part 2 | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com

0:00 17:33

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 17 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 12, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!