‘చిలుకంబడు దధికైవడి’  కథాసమీక్ష  - ఉణుదుర్తి సుధాకర్ గారు episode artwork

EPISODE · Mar 4, 2023 · 24 MIN

‘చిలుకంబడు దధికైవడి’ కథాసమీక్ష - ఉణుదుర్తి సుధాకర్ గారు

from Harshaneeyam

‘చిలుకంబడు దధికైవడి’ అనే కథకు మూలం, రచయిత జెయమోహన్ రాసిన  ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ, ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.  ఈ కథను ప్రముఖ కథా రచయిత శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు ఈ ఎపిసోడ్ లో సమీక్షిస్తారు. వారికి కృతజ్ఞతలు. ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన  ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ.  జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది. ‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన  వ్యక్తుల గురించి మనకు చెబుతూ   రచయిత రాసిన  కథలు. ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా  తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు.   ‘కంబ రామాయణం’  విస్తృతంగా అధ్యయనం చేసి, అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన  ఉపన్యాసాలతో  అపరిమితంగా ప్రభావితం చేసి, వారిని  సాహిత్యం వైపు మళ్ళించారు. తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన   ప్రొఫెసర్ జేసుదాసన్ 2002 వ సంవత్సరంలో మరణించారు. రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబ రామాయణం లోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ, వర్ణిస్తూ, తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది. *ఈ కథలో ప్రస్తావించబడ్డ పద్యాలు పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు తెనిగించిన  ‘కంబ రామాయణం’ లోనివి. ‘చిలుకంబడు దధికైవడి’  -“నువ్విక్కడుండి చేసేదేవుంది? బండెక్కు!”   అన్నాడు కుమార్, ప్రొఫెసర్ని సభకు తీసుక రావడానికి బయలుదేరుతూ.   “అరుణ కూడా వస్తానంది! ఆమె కోసం చూస్తున్నాను” అంటూ నసిగాను. “బావుంది.ఎదురెళ్ళి హారతి ఇస్తావా ఏంటి? భార్య, అంటే ‘ప్రేమ’ ఉండాలి కానీ ‘ఇంత’  అవసరం లేదేమో?” అంటూ వాన్  తలుపు తెరిచాడు కుమార్. “ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు, ప్రొఫెసర్ మాంఛి ఊపులో ఉంటాడు. అపుడు ఆయన మాట్లాడుతూంటే వినడం ఓ గొప్ప అనుభవం. నువ్వావకాశం కోల్పోడం నాకిష్టం లేదు. చూస్తావుగా? ” అన్నాడు బండి నడుపుతూ కుమార్.  “ వాళ్ళావిడ కూడా హల్లెలూయా అనుకుంటూ పక్కనే వుంటారేమో” అన్నా నేను. “లేదు…లేదు. ఆవిడ స్టీఫెన్ కార్లో వస్తున్నారు. వాన్లో ఎక్కితే కళ్ళు తిరుగుతాయంది. సరే అంబాసిడర్ లో రండి, దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పాను.  ప్రొఫెసర్ తో  మాట్లాడేటప్పుడు మటుకు -  సంభాషణని తెలివిగా కంబ రామాయణం మీదికి మళ్ళించే బాధ్యత నీదే! మధ్యలో పొరపాటున బైబిలని కానీ ప్రభువా! అని కానీ  అన్నావో… అంతా వేరే దార్లో కెళ్ళిపోతుంది.” నింపాదిగా చెప్పుకుపోతున్నాడు కుమార్.“ఇప్పుడు మూడేగా. సభ మొదలయ్యేది ఆరుగంటలకు కదా?” అన్నాను. “నన్నడిగితే ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటాను. కాలాలు, వాటికి సంబంధించిన పరిమితులు..  వీటన్నిటికీ అతీతుడు ఆయన. ఇది పొద్దునా, రాత్రా,  అనే  స్పృహ కొంచెం  కూడా ఉండదు. ఈ పాటికే ఊళ్ళో వుండే దిక్కుమాలిన సంతంతా ఆయన  చుట్టూ చేరి, పోచుకోలు కబుర్లలో దింపేసుంటారు. ఈ మహాత్ముడు చిన్న పిల్లాడిలా వాళ్ళకు తన చెవులు అప్పగించి, వింటూ ఉంటాడు. వెళ్ళగానే ఆయనకు స్నానం చేయించి, లాల్చీ, పంచె తగిలించి, తీసుకవెళ్ళాల్సి ఉంటుంది.”“స్నానం కూడా చేయించాలా?” నవ్వాను నేను. “అలానే ఉండబోయేట్టుంది!”కారు పున్నైవనం దగ్గర, కుడివైపుకు తిరిగింది.”సజిన్ కి  ఒక పని అంటగట్టి, నీ మీద గురి కుదరాలంటే, నువ్వీ పని పూర్తి చేయాలి!  అని చెప్పి మరీ వచ్చాను.” అన్నాడు కుమార్. “అతనికి ఈ రోజు కాలేజీ లేదా?”“ వుంది. కానీ నాకు అసలు విషయం అకస్మాత్తుగా  నిన్న రాత్రి  గుర్తుకొచ్చింది. మన వల్ల అయ్యే పని కాదు! అందుకని అప్పటికప్పుడు  అతనికి ఫోన్ చేసాను. పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా తయారై , మా ఇంటి దగ్గరికొచ్చేసాడు. మరీ అంత పెందరాడే వచ్చేసేటప్పటికీ, మా అక్కా వాళ్ళింటికి వేరే ఏదో   చిన్న పని మీద పంపించి, అది అయింతర్వాత  సభ  దగ్గరికి రమ్మన్నాను. అవడానికి అరవ పంతులు  అయినా, పనిమంతుడే, చూద్దాం! ఏం చేస్తాడో?”****************ఆయన ఇంటికి వెళ్లేసరికి మేము అనుకున్నట్టే, ప్రొఫెసర్ కేవలం పంచ మాత్రమే  కట్టుకుని, నింపాదిగా  వరండాలో కూచుని వున్నాడు. పాలిపోయిన తెలుపు, చిన్నపాటి ఆకారం ఆయనది. దేనికో పగలబడి నవ్వుతున్నాడు. ఒంటిమీద చొక్కా లేకుండా, ఉన్న ఒక నల్లటి మనిషి, ఆయనకెదురుగా ఉన్న స్థంభానికి అనుకుని నిలబడి  గొంతెత్తి అభినయిస్తున్నాడు, “రేయ్ ఉన్న చోటి నించీ కదలొద్దు,  నీటి పాము ఉంది పక్కనే! అనంగానే, ఆ పిల్లోడు నా మాట పూర్తిగా వినకుండా వెంటనే  కొబ్బరి చెట్టెక్కేసి, ‘అన్నా! అన్నా!’ అని ఆపకుండా  కేకలు పెట్టాడు. రేయ్! చూస్కో, పాములు కొబ్బరి చెట్లు తేలిగ్గా ఎక్కేస్తాయి అన్నా! వాడు ‘ఏసు ప్రభువా! ఏసు ప్రభువా! అని ఆపకుండా  అరిచెయ్యడం మొదలెట్టాడు.” మేము రావడం గమనించి మాటలాపేసాడు ఆ నల్లటి మనిషి.  “కుమారూ! నువ్వేమిటి? ఇలా వచ్చావు?” అన్నాడు ప్రొఫెసర్ మమ్మల్నిద్దర్నీ చూస్తూ. “పిల్లలెలా వున్నారు? వీడు చెప్పింది విన్నావా? పాము ఈత చెట్టు ఎక్కగలదట. కల్లు కూడా తీస్తుందేమో? హ్హ హ హ్హ” నవ్వాడాయన. “చెప్పానా! ఏవీ గుర్తు ఉండదు ఈయనకు!” నా చెవిలో గుసగుస లాడాడు కుమార్. “ఏం సార్! బయలుదేరడానికి తయారా?” అడిగాడు కొంచెం బిగ్గరగా  ఆయన్నుద్దేశించి కుమార్.  “అయ్యో! మర్చే పోయాను.” అన్నాడు హడావుడి పడుతూ ప్రొఫెసర్. “ ఈ రోజు ఆదివారం అని నాకు  గుర్తే లేదు. చూడు! చర్చి కెళ్ళే రోజులు గూడా మర్చిపోయే వయసు వచ్చేసింది.”“ఈ రోజు ఆదివారం కాదు!”అన్నాడు కుమార్ కొంచెం అసహనంగా. “ఆదివారం కాదా!”అడిగాడు  ప్రొఫెసర్ అనుమానంగా.  “ఓహ్ జ్ఞానరాజ్ కూతురు పెళ్ళి కదా!” అన్నాడు ఏదో నిర్థారించుకున్నట్టు, పేలవమైన స్వరంతో. “అది కూడా తప్పే. ఆ పెళ్ళి చైత్ర మాసంలో. ఇది మాఘ మాసం.” అన్నాడు కుమార్ కూచుంటూ. నేను గూడా అరుగు మీద తిష్ట వేసాను. ప్రొఫెసర్ నా వైపు ప్రేమగా చూసిన చూపుతో, నన్ను ఇంకెవరో అనుకుని  పొరబడ్తున్నారని నా కర్థం అయ్యింది. “పాస్టర్! మీరెప్పుడు వచ్చారు?” అడిగాడాయన నన్ను చూస్తూ.  వచ్చే నవ్వుని పెదాల దగ్గర ఆపాను. కుమార్ మధ్యలో కలగజేసుకుంటూ “ఈరోజు సాయంత్రం ‘కుమారి మండ్రమ్’ వాళ్ళ వార్షికోత్సవం. మీరు బయల్దేరాల్సింది, అక్కడికి”. ప్రొఫెసర్ మొహం ఒక్క వెలుగు వెలిగింది. “అదీ అసలు విషయం!” అని, విప్పారిన మొహంతో నవ్వుతూ, “డైసీ వెడుతూ వెడుతూ చెప్పింది. అయితే ఏం చెప్పిందో మర్చే పోయాను కుమారూ!” అన్నాడు. ఆయన కళ్ళు మళ్ళీ  నా వైపు తిరిగాయి. “ఇతను జెయమోహన్. రచయిత” అని ప్రొఫెసరుకి గుర్తు చేసాడు కుమార్. ఒక్కసారిగా దగ్గరికొచ్చి ప్రొఫెసర్  నా చేతులు ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. “అరే నిన్ననే, ‘మాదన్ మోక్షం’ చదివాను. కథంటే అలా ఉండాలి. అదో అద్భుతం! కుమారూ, నువ్వు చదివావా?”“చదివాను” అన్నాడు కుమార్. “మీరింకా స్నానం కూడా చెయ్యలేదు. ముందు మీరెళ్ళి స్నానం చెయ్యండి. అస్సలు సమయం లేదు”ప్రొఫెసర్ మనవరాలు తలుపు చాటు నించి,  తల బయటకు పెట్టి, చూసింది. “స్నానానికి వేణ్ణీళ్ళు ఉన్నాయామ్మా?” అడిగాడు కుమార్. “ఎవరూ చెప్పందే?” అందామ్మాయి. “ఆ సంగతి కొంచెం చూడమ్మా! తొందరగా బయలుదేరాలి.” ఆ అమ్మాయి లోపలికెళ్ళగానే, చొక్కా లేని ఆ నల్లటి మనిషి మళ్ళీ ప్రొఫెసర్ తో సంభాషణ  ప్రారంభించాడు. “అసలు తమాషా ఏందంటే, అది పామే కాదు, తెల్సా మీకు?”“మరి?” అడిగాడు ప్రొఫెసర్ ఆసక్తిగా. “రేయ్ పనేం లేదా! ఫో ఇక్కణ్ణించీ” కుమార్ ఆ మనిషిని అదిలించాడు. ‘వెడుతున్నా!’ అని ప్రొఫెసర్ కు చూపుల్తోనే చెప్పి వెంటనే పలాయనం చిత్తగించాడు అతను. “సభ ఎక్కడ జరుగుతోంది? కుమారూ!” అడిగాడు ప్రొఫెసర్. “అసిసి స్కూల్లో, మన జిల్లాకు చెందిన రచయితలు అందరూ  వొస్తున్నారు. పచ్చయిమలై అందరికీ సన్మానాలు ఏర్పాటు చేసాడు.”“దానికి, నేనెందుకు?” అన్నాడు కిసుక్కున నవ్వుతూ ప్రొఫెసర్. “అక్కడికొచ్చే రచయితల్లో దాదాపుగా అందరూ మీ శిష్యరికం చేసినవాళ్ళే. మీరే ఆ సభకి ముఖ్య అతిథి” అని అందించాను నేను. సమాధానంగా నవ్విన నవ్వుకి, పొరబోయింది ప్రొఫెసర్ కి. “చూడు కుమారూ! రచయితలను తయారు చేయడం అంటే మాటలు కాదు. గుర్తుపెట్టుకో!” అంటూ మళ్ళీ పగలబడి నవ్వాడాయన. ఇంక ఆయన్ని కంబన్ వైపు మళ్ళిద్దామని, ఏ పద్యం గురించి మాట్లాడాలో ముందు మననం చేసుకున్నాను. “నిన్న కంబ రామాయణంలో ఒక పద్యం చదువుతున్నప్పుడు,  మీరే గుర్తొచ్చారు” అన్నాను. ఒక్కసారిగా ఆయన ముఖాన్ని  ప్రశాంతత ఆవరించింది. “కంబ రామాయణమా? నిన్నే చదివావా? ఆ కావ్యాన్ని తాకే అదృష్టం కలగాలన్నా, ఆ మహాకవే  ప్రేరేపించాలి. మనం రామాయణం గురించి  మాట్లాడటం మొదలెట్టగానే ఆయన మన మధ్యకే వచ్చి కూర్చోడం నా కళ్ళకు కనపడుతోంది. కంబన్ మహాకవి చిరంజీవి. ఆయన మనలో ఒకడిగా ఈ భూమి మీద తిరగడం మానవాళి...

NOW PLAYING

‘చిలుకంబడు దధికైవడి’ కథాసమీక్ష - ఉణుదుర్తి సుధాకర్ గారు

0:00 24:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 24 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on March 4, 2023.

What is this episode about?

‘చిలుకంబడు దధికైవడి’ అనే కథకు మూలం, రచయిత జెయమోహన్ రాసిన  ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ, ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.  ఈ కథను ప్రముఖ కథా రచయిత శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు ఈ ఎపిసోడ్ లో సమీక్షిస్తారు....

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!