చిన్నాన్న | Chinnanna | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 4, 2023 · 9 MIN

చిన్నాన్న | Chinnanna | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చిన్నాన్న రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఏరా శేఖర్ బాగున్నావా?” పుస్తకం చదువుకుంటున్న నేను తల ఎత్తి చూసేసరికి ఎదురుగా చిన్నాన్న. వచ్చి నా పక్కనే కూర్చున్నాడు చిన్నాన్న. లోపలనుంచి నాన్నా, అమ్మా వచ్చారు. “ఏరా శివా, ఇదేనా రావడం?” నాన్న ఆప్యాయంగా చిన్నాన్న భుజం మీద చేయివేసి అడిగారు. “ఇప్పుడే వచ్చాను అన్నయ్యా. నీ ఆరోగ్యం ఎలావుంటోంది? వదినా, కులాసానా?” ఇద్దర్నీ ఒకేసారి అడిగాడు చిన్నాన్న. “ఆ ...మేం బాగానే ఉన్నాము.నువ్వు ఎలా ఉంటున్నావు? హైదరాబాద్ లో ఒక్కడివీ ఎందుకురా, మన ఊరు వచ్చేయ్. అందరం కలిసి ఉందాం” అన్నారు నాన్న. “అవును శివా. నీ గురించి మీ అన్నయ్య అస్తమానం బాధపడుతూ ఉంటారు. వాడు ఒక్కడూ ఎలా ఉంటున్నాడా?అని. ఇక్కడికి వచ్చేయ్ .నలుగురం కలిసిఉందాం” అంది అమ్మ. “అలాగే వదినా. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి.అవి పూర్తీ అవగానే మన ఊరు వచ్చేస్తాను. నా ఆఖరి గమ్యం మన ఊరే కదా” చిన్నగా నవ్వుతూ అన్నాడు చిన్నాన్న. “మీరు మాట్లాడుతూ ఉండండి. నేను టీ పట్టుకు వస్తాను” అని లోపలకు వెళ్ళింది అమ్మ. చిన్నాన్న కాఫీ తాగడు , టీ తాగుతాడు. బాగ్ లోంచి ఖరీదైన స్మార్ట్ ఫోన్ తీసి నాకిచ్చాడు చిన్నాన్న. ఆ ఫోన్ చూడగానే నా కళ్ళు ఆనందంతో మెరిశాయి. నా ఫ్రెండ్స్ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నాకే లేదు. నాన్నని కొనమని చాలా సార్లు అడిగాను, అలాగే అని వాయిదా వేస్తున్నారు నాన్న. వెంటనే ఫోన్ తీసుకుని “థాంక్స్ చిన్నాన్నా” అన్నాను. “మనలో మనకి థాంక్స్ ఏమిట్రా. బాగా చదువుకో శేఖర్ ” అన్నాడు చిన్నాన్న. నేను ఫోన్ పట్టుకుని నా గదిలోకి వెళ్ళిపోయాను. నాన్నా,చిన్నాన్నా వ్యవసాయం గురించి , ఊళ్ళో విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. నేను నా ఫోన్ లోని సిం కార్డు తీసి కొత్త ఫోన్ లో వేసి మా ఫ్రెండ్స్ తో మాట్లాడ సాగాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మధ్యాహ్నం భోజనాల దగ్గర చిన్నాన్న నా పక్కనే కూర్చున్నాడు. నేను భోజనం చేస్తున్నంతసేపు నాకేసే చాలా ప్రేమగా చూసాడు. చిన్నాన్న వచ్చిన ప్రతిసారీ నా పక్కనే కూర్చుంటాడు. మామూలగా అయితే నేనూ, నాన్నా పక్క పక్కనే కూర్చుంటాం. ఒకసారి నేను నాన్న పక్కన కూర్చోపోతే, అమ్మ “శేఖర్ , చిన్నాన్న పక్కన కూర్చో నాయనా” అంది. అప్పటినుంచీ నాకు అది అలవాటు అయిపోయింది.చిన్నాన్న ఆరోజు రాత్రి బస్సు కి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. చిన్నాన్న మా నాన్న కంటే ఎత్తుగా ఉంటాడు. అయిదు అడుగుల పది అంగుళాలు ఉంటాడు. చాలా అందగాడు. సినిమాలలో వేషాలు వేస్తూ ఉంటాడు. ఈ మధ్య టివి. సీరియల్సు లో తండ్రి పాత్రలు కూడా వేస్తున్నాడు. చాలా క్రితమే పిన్ని చనిపోయినా, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఒక్కడే హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఎందుకో సినిమా వాళ్ళు అంటే నాకు సదభిప్రాయం లేదు. అందులోనూ విలన్ వేషాలు వేసే వాళ్ళు అంటే, మరీ చెడ్డ అభిప్రాయం ఉంది. చిన్నాన్న తెచ్చే గిఫ్ట్ లు నాకు బాగా నచ్చటం వలన ఆయన పట్ల కొద్ది సాఫ్ట్ కార్నర్ ఉంది. ****** నేను బి.టెక్. మంచి మార్కులతో పాస్ కాగానే చిన్నాన్న మా ఊరు వచ్చి నాకు ఖరీదైన వాచీ, లాప్ టాప్ ఇచ్చారు. ఆరోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా, దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నారు. ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పోర కదలాడడం నేను గమనించాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/1rTs2cQ84l4

Episode metadata supplied by the publisher feed · Published Apr 4, 2023

Embed this episode

NOW PLAYING

చిన్నాన్న | Chinnanna | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com

0:00 9:09

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 4, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!