EPISODE · Nov 18, 2022 · 18 MIN
‘చిన్నదొర’ రియాలిటీ షో | Chinna Dora Reality Show | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ‘చిన్నదొర’ రియాలిటీ షో రచన, పఠనం : మల్లవరపు సీతారాం కుమార్ "మైకం టీవీ ఎండీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.. నేను వారి అసిస్టెంట్ సోనియాను మాట్లాడుతున్నాను..." ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే అవతలి వైపునుండి వినపడ్డ మాటలకి కిరణ్మయి ఉబ్బి తబ్బిబ్బయింది. ఆమె ఒక యువ రచయిత్రి. ఇటీవలే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి కథలు రాయడంతో పాటు, తానే డైరెక్ట్ చేసింది. ఒక కొత్త టీవీ ఛానల్ వాళ్ళు వాటిని ప్రసారం చేశారు. అనూహ్యంగా ఆ ఛానల్ టీఆర్ఫీ బాగా పెరిగింది. మరికొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి పెట్టమని కోరారు వాళ్ళు. కానీ ఆ ఛానల్ చూసే వాళ్ళు కొద్దిమందే. ఏదైనా ప్రముఖ టీవీ ఛానల్ లో అవకాశం వస్తే బాగుండునని ఎదురు చూస్తోంది. ఈ రోజు ఇలా మైకం టీవీ వారినుండి కాల్ రావడంతో ఆనందంతో నోట మాట రాలేదు కిరణ్మయికి. "హలో మేడం... లైన్ లోనే ఉన్నారా.." అంటూ అటు వైపు నుండి సోనియా అడగడంతో, ఈ లోకంలోకి వచ్చింది కిరణ్మయి. "అనుకోని సర్ప్రైజ్ కదా.. మాట రాలేదు. చెప్పండి. ఎప్పుడు కలవాలి? కలవడానికి వచ్చేటప్పుడు ఏవైనా షార్ట్ ఫిలిం కథలు తేవాలా?" అతృతతో అడిగింది కిరణ్మయి. ఆమె ఎగ్జైట్మెంట్ కి కారణం ఉంది. గత ఏడాది వరకు టాప్ పొజిషన్ లో ఉన్న ఛానల్ అది. సాగతీత సీరియల్స్ దెబ్బకి ఇటీవల కాస్త వెనకపడింది. బహుశా తన షార్ట్ ఫిలిమ్స్ తో తిరిగి పుంజుకోవాలని అనుకుంటున్నారేమో... "మా ఎండీ గారిని కలిశాక మరింత సర్ప్రైజ్ అవుతారు. ఖాళీ చేతులతో రండి చాలు. వీలయితే ఇప్పుడే కలవండి. మీ అడ్రస్ చెబితే కారు పంపిస్తాము" చెప్పింది సోనియా. తన అడ్రస్ చెప్పి ఆనందంతో ఫోన్ పెట్టేసింది కిరణ్మయి. వెంటనే ఆఫీస్ లో ఉన్న భర్తకు కాల్ చేసి తనకు వచ్చిన ఫోన్ గురించి చెప్పింది. "కంగ్రాట్స్ కిరణ్.. మంచి అవకాశం వచ్చింది. గో ఎహెడ్" అంటూ అభినందించాడు ఆమె భర్త ప్రవీణ్. హాల్లో టివి చూస్తున్న అత్తమామల దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పింది. "అయితే ఇక మీదట టివిలో నీ సీరియళ్ళే చూడొచ్చన్నమాట" అన్నారు కిరణ్మయి అత్త జానకమ్మగారు. "మాకు మాత్రం రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ముందుగానే చెప్పాలమ్మాయ్" అన్నారు మామ రాఘవరావు గారు. వాళ్ళిద్దరికీ నవ్వుతూ సమాధానం చెప్పి రెడీ కావడానికి తన గదికి వెళ్ళింది కిరణ్మయి. ఓ పావుగంటలో రెడీ అయి హాల్లోకి వచ్చి, అత్తగారి పక్కన కూర్చుంది. కోడలు టెన్షన్ పడుతున్నట్లు గమనించిన అత్తగారు టివి రిమోట్ కోడలి చేతికిచ్చి, "కారు వచ్చేవరకు ఏదో ఒక ప్రోగ్రాం చూస్తూ ఉండమ్మా" అంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/4Tv0ZJKVHis
Embed this episode
NOW PLAYING
‘చిన్నదొర’ రియాలిటీ షో | Chinna Dora Reality Show | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.