చిన్నీ వాళ్ళ చంద్రత్త! episode artwork

EPISODE · Jul 19, 2020 · 10 MIN

చిన్నీ వాళ్ళ చంద్రత్త!

from Harshaneeyam

"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదు, ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు, మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి ఒంట్లో బాగాలేదు అనిచెప్పి" అన్నారు నాన్న. "నా పెళ్ళికి చంద్రత్త లేకపోతే, ఎలా ! అయినా క్రితం వారమే కదా, మీరు ఢిల్లీ కి ఎదో పని మీద వెళ్లి , అత్తా వాళ్ళను చూసొచ్చింది. అప్పుడు బాగానే వుంది కదా అత్తకి ?" అడిగాను నేను నాన్నని. నా ప్రశ్న కు ఏమీ సమాధానం చెప్పకుండా, నాన్న అమ్మ వైపు చూసారు. అమ్మ చెప్పింది, "అత్తకి, నెక్ పెయిన్ వల్ల, బాగా ఇబ్బందిగా ఉంది, చిన్నీ! మాట్లాడితే ఇంకా ఎక్కువ అవుతుందని, రెండు మూడు వారాలు రెస్ట్ అవసరం అని అక్కడ వాళ్ళ డాక్టర్ చెప్తున్నారు. నీ పెళ్లి అయ్యిన, నెల లోపల అందరం కలిసి కొండకి వెళదామనుకున్నాం కదా! ఆ ట్రిప్ కి జాయిన్ అవుతాం! అని అత్త నీకు చెప్పమంది " అని. " అది వేరు, పెళ్లికి అత్త నా పక్కనే ఉండటం వేరు" అన్నాను నేను . మా చంద్రత్త అంటే నాకు చాలా ఇష్టం. మొన్న మొన్నటి దాకా, మా చంద్రత్త వాళ్ళు, మా ఇంటికి ఓ అరగంట దూరంలోనే, సీతమ్మధారలో వుండేవాళ్ళు. మావకి ప్రమోషన్ వచ్చి, ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఢిల్లీ షిఫ్ట్ అయిపోయారు, ఓ ఆర్నెల్ల క్రితం. విశాఖపట్నం లో వున్నా, భూప్రపంచంలో ఎక్కడున్నా సరే, రెండ్నెల్లకోసారి, తను, మా ఇంటికి రావాల్సిందే. మావ సర్వీస్ ఎక్కువ శాతం విశాఖపట్టణం లోనే జరిగింది, కాబట్టి నేను మా అత్తను పెద్ద మిస్ అయ్యింది లేదు. వాళ్ళ ఇంటికెళ్తే, బాపు గారి సినిమా లో హీరోయిన్ ఇంటికెళ్ళిన ఫీలింగ్ వచ్చేది నాకు. అంత అద్భుతం గా ఉంటుంది తన ఇల్లంతా. ప్రతీ వస్తువూ, నాకు నచ్చిన పేస్టెల్ షేడ్స్ లో. ఇది గాక, మాట్లాడేటప్పుడు, మా అత్త, మంచి జోవియల్ గా ఉంటుంది, చుట్టూ వున్న వాళ్ళ మీద జోకులేసేస్తూ. నాకు తెలుసు, చంద్రత్త పెళ్ళికి రాకపోవటం, మా అమ్మను గూడా ఎక్కువ బాధ పెడుతుంది. మా అమ్మా , చంద్రత్త గూడా చాలా మంచి ఫ్రెండ్సు. బయటికి షాపింగులు, గుళ్ళూ గట్రా అన్నీ ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. ఎక్కడున్నా ప్రతీ రోజూ టంచను గా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుంది , మా అమ్మతో చంద్రత్త. తమాషా ఏందంటే, అలాంటి చంద్రత్త, మా నాన్న ఒకరితో ఒకరు, ప్రశాంతంగా మాట్లాడుకోవడం, చాలా తక్కువ సార్లు చూసాన్నేను. ఆవిడ, నాన్న కంటే రెండేళ్లు చిన్నదయినా, తనకో పెద్దక్క ఫీలింగ్ ఉంటుందనుకుంటా. మా ఇంటి కొచ్చినప్పుడల్లా, అన్నాచెల్లెళ్ళిద్దరూ, ఎదో ఒక విషయం మీద, నాలుగు విరుద్ధమైన అభిప్రాయాలతో వాదించుకుంటూ వుండే వాళ్ళు. మధ్యలో మా అమ్మ జోక్యం చేసుకునేది కాదు. నవ్వుతూ చూస్తూ వుండిపొయ్యేది. ఇలా ఆలోచనల్లో ఉంటే, అమ్మ పిలవడంతో ఈ లోకంలోకొచ్చాను. అమ్మ చెప్పింది " రేపు సాయత్రం కల్లా అన్నీ సర్దేయ్యాలి. ఎల్లుండి పొద్దున్నే, కల్యాణ మంటపం కి బయలు దేరాలి . నిన్న కొన్న చీరలన్నీ, కవర్లలోంచి తీసిపెట్టు, సూట్ కేసు లో సర్దుతాను" అని. ఆ తర్వాత మూడు రోజులకి నా పెళ్లి జరిగి పొయ్యింది. రెండు వారాల్లోనే, ఎంవీపీ కాలనీ లో మా అత్త గారింటికి, కాపురానికి వెళ్లి పొయ్యాను, మా ఆయన అమెరికా లో ఉద్యోగస్తుడవ్వడం తో, వీసాలు లాంటి గొడవలుండడం తో. వెళ్లిన ఒక వారానికి, వాళ్ళ ఇండియన్ ఆఫీస్ లో ఎదో పని ఉందని, మా ఆయన మద్రాసు వెళ్లడంతో, నాన్న, మా అత్తగారింటి కొచ్చారు, నన్ను ఇంటికి ఓ మూడు రోజులు, తీసుకెళదామని. అప్పుడు నాన్న మాటల్లో తెల్సింది అత్త ఢిల్లీ నించి ఆ ముందు రోజు సాయంత్రమే, మా ఇంట్లో దిగిందని. అడిగాన్నేను, " ఉంటుందా అత్త ఓ మూడు నాలుగు రోజులు? " అని ఆత్రుత గా. " ఉంటుందేమో, ఒక వారం పది రోజులు", అన్నారాయన. ఉత్సాహంగా ఇంటికెళ్ళాను, నాన్నతో బాటూ. ఇంటికెళ్తే, వరండాలో వాలు కుర్చీలో పడుకోనుంది అత్త, ఎదో పుస్తకం చదువుకుంటా. నన్ను చూడంగానే ఆమె కళ్ళలో ఓ చిన్న మెరుపు. మనిషి బాగా వీక్ గా కనపడుతోంది. నన్ను దగ్గరకి తీస్కొని చెప్పింది. "రావాలని చాలా ప్రయత్నించానే చిన్నీ, కనీసం పెళ్లి రోజుకైనా." అంటూ, తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూంటే. చెప్పాను నేను, " మా ఆయన పని మీద మద్రాసు వెళ్ళారత్తా ! వీసా డాక్యుమెంట్లు అనిచెప్పి, సాయంత్రం ఎటూ ఫోన్ చేస్తారు నాకు . అప్పుడు చెప్పేస్తా, నువ్వున్న వారం రోజులు ఇక్కడే ఉండThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode metadata supplied by the publisher feed · Published Jul 19, 2020

Embed this episode

"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదు, ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు, మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి ఒంట్లో బాగాలేదు అనిచెప్పి" అన్నారు నాన్న. "నా పెళ్ళికి చంద్రత్త లేకపోతే, ఎలా ! అయినా క్రితం వారమే కదా, మీరు ఢిల్లీ కి ఎదో పని మీద వెళ్లి , అత్తా వాళ్ళను చూసొచ్చింది. అప్పుడు బాగానే వుంది కదా అత్తకి ?" అడిగాను నేను నాన్నని. నా ప్రశ్న కు ఏమీ సమాధానం చెప్పకుండా, నాన్న అమ్మ వైపు చూసారు. అమ్మ చెప్పింది, "అత్తకి, నెక్ పెయిన్ వల్ల, బాగా ఇబ్బందిగా ఉంది, చిన్నీ! మాట్లాడితే ఇంకా ఎక్కువ అవుతుందని, రెండు మూడు వారాలు రెస్ట్ అవసరం అని అక్కడ వాళ్ళ డాక్టర్ చెప్తున్నారు. నీ పెళ్లి అయ్యిన, నెల లోపల అందరం కలిసి కొండకి వెళదామనుకున్నాం కదా! ఆ ట్రిప్ కి జాయిన్ అవుతాం! అని అత్త నీకు చెప్పమంది " అని. " అది వేరు, పెళ్లికి అత్త నా పక్కనే ఉండటం వేరు" అన్నాను నేను . మా చంద్రత్త అంటే నాకు చాలా ఇష్టం. మొన్న మొన్నటి దాకా, మా చంద్రత్త వాళ్ళు, మా ఇంటికి ఓ అరగంట దూరంలోనే, సీతమ్మధారలో వుండేవాళ్ళు. మావకి ప్రమోషన్ వచ్చి, ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఢిల్లీ షిఫ్ట్ అయిపోయారు, ఓ ఆర్నెల్ల క్రితం. విశాఖపట్నం లో వున్నా, భూప్రపంచంలో ఎక్కడున్నా సరే, రెండ్నెల్లకోసారి, తను, మా ఇంటికి రావాల్సిందే. మావ సర్వీస్ ఎక్కువ శాతం విశాఖపట్టణం లోనే జరిగింది, కాబట్టి నేను మా అత్తను పెద్ద మిస్ అయ్యింది లేదు. వాళ్ళ ఇంటికెళ్తే, బాపు గారి సినిమా లో హీరోయిన్ ఇంటికెళ్ళిన ఫీలింగ్ వచ్చేది నాకు. అంత అద్భుతం గా ఉంటుంది తన ఇల్లంతా. ప్రతీ వస్తువూ, నాకు నచ్చిన పేస్టెల్ షేడ్స్ లో. ఇది గాక, మాట్లాడేటప్పుడు, మా అత్త, మంచి జోవియల్ గా ఉంటుంది, చుట్టూ వున్న వాళ్ళ మీద జోకులేసేస్తూ. నాకు తెలుసు, చంద్రత్త పెళ్ళికి రాకపోవటం, మా అమ్మను గూడా ఎక్కువ బాధ పెడుతుంది. మా అమ్మా , చంద్రత్త గూడా చాలా మంచి ఫ్రెండ్సు. బయటికి షాపింగులు, గుళ్ళూ గట్రా అన్నీ ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. ఎక్కడున్నా ప్రతీ రోజూ టంచను గా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుంది , మా అమ్మతో చంద్రత్త. తమాషా ఏందంటే, అలాంటి చంద్రత్త, మా నాన్న ఒకరితో ఒకరు, ప్రశాంతంగా మాట్లాడుకోవడం, చాలా తక్కువ సార్లు చూసాన్నేను. ఆవిడ, నాన్న కంటే రెండేళ్లు చిన్నదయినా, తనకో పెద్దక్క ఫీలింగ్ ఉంటుందనుకుంటా. మా ఇంటి కొచ్చినప్పుడల్లా, అన్నాచెల్లెళ్ళిద్దరూ, ఎదో ఒక విషయం మీద, నాలుగు విరుద్ధమైన అభిప్రాయాలతో వాదించుకుంటూ వుండే వాళ్ళు. మధ్యలో మా అమ్మ జోక్యం చేసుకునేది కాదు. నవ్వుతూ చూస్తూ వుండిపొయ్యేది. ఇలా ఆలోచనల్లో ఉంటే, అమ్మ పిలవడంతో ఈ లోకంలోకొచ్చాను. అమ్మ చెప్పింది " రేపు సాయత్రం కల్లా అన్నీ సర్దేయ్యాలి. ఎల్లుండి పొద్దున్నే, కల్యాణ మంటపం కి బయలు దేరాలి . నిన్న కొన్న చీరలన్నీ, కవర్లలోంచి తీసిపెట్టు, సూట్ కేసు లో సర్దుతాను" అని. ఆ తర్వాత మూడు రోజులకి నా పెళ్లి జరిగి పొయ్యింది. రెండు వారాల్లోనే, ఎంవీపీ కాలనీ లో మా అత్త గారింటికి, కాపురానికి వెళ్లి పొయ్యాను, మా ఆయన అమెరికా లో ఉద్యోగస్తుడవ్వడం తో, వీసాలు లాంటి గొడవలుండడం తో. వెళ్లిన ఒక వారానికి, వాళ్ళ ఇండియన్ ఆఫీస్ లో ఎదో పని ఉందని, మా ఆయన మద్రాసు వెళ్లడంతో, నాన్న, మా అత్తగారింటి కొచ్చారు, నన్ను ఇంటికి ఓ మూడు రోజులు, తీసుకెళదామని. అప్పుడు నాన్న మాటల్లో తెల్సింది అత్త ఢిల్లీ నించి ఆ ముందు రోజు సాయంత్రమే, మా ఇంట్లో దిగిందని. అడిగాన్నేను, " ఉంటుందా అత్త ఓ మూడు నాలుగు రోజులు? " అని ఆత్రుత గా. " ఉంటుందేమో, ఒక వారం పది రోజులు", అన్నారాయన. ఉత్సాహంగా ఇంటికెళ్ళాను, నాన్నతో బాటూ. ఇంటికెళ్తే, వరండాలో వాలు కుర్చీలో పడుకోనుంది అత్త, ఎదో పుస్తకం చదువుకుంటా. నన్ను చూడంగానే ఆమె కళ్ళలో ఓ చిన్న మెరుపు. మనిషి బాగా వీక్ గా కనపడుతోంది. నన్ను దగ్గరకి తీస్కొని చెప్పింది. "రావాలని చాలా ప్రయత్నించానే చిన్నీ, కనీసం పెళ్లి రోజుకైనా." అంటూ, తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూంటే. చెప్పాను నేను, " మా ఆయన పని మీద మద్రాసు వెళ్ళారత్తా ! వీసా డాక్యుమెంట్లు అనిచెప్పి, సాయంత్రం ఎటూ ఫోన్ చేస్తారు నాకు . అప్పుడు చెప్పేస్తా, నువ్వున్న వారం రోజులు ఇక్కడే ఉండ

Distinct summary based on available episode metadata or transcript content.

NOW PLAYING

చిన్నీ వాళ్ళ చంద్రత్త!

0:00 10:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 10 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on July 19, 2020.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!