చంటబ్బాయ్ | Chantabbay | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 24, 2022 · 6 MIN

చంటబ్బాయ్ | Chantabbay | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చంటబ్బాయ్!  రచన : గొర్తి వాణిశ్రీనివాస్ కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ ఆమె పేరే రెండు జళ్ళ సీత. అందాల భరిణె. గుమ్మానికి జారగిలపడి ఒంటిజడ తిప్పుతూ వాకిట్లో నిలబడి, చంటబ్బాయ్ కోసం కళ్ళల్లో బ్యాట్రీ లైట్లు వేసుకుని ఎదురు చూస్తోంది. అతగాడు ఎంత సేపటికీ రాకపోవడంతో నీరసంగా మెట్లమీదే కూలబడి కునికిపాట్లు పడుతోంది. ఆమె ఊరికే కూర్చున్నా, మనసు ఊరుకోకుండా అల్లరిగా గెంతుతూ, సైకిల్ చక్రం తిప్పుకుంటూ.. గతంలోకి పరిగెత్తింది. సీత తన స్నేహితురాలి పెళ్లికి వెళ్ళినపుడు, ఆ పెళ్లిలో పెళ్ళికొడుకు తలపై తలంబ్రాలు పడకుండా వెనక్కి లాగే వర్గంలో చంటబ్బాయ్, ఇటుపక్కన పెళ్లికూతుర్ని వెనక్కి లాగేసి, వెక్కిరించే గ్రూప్ లో సీత విజయవంతంగా పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అన్నట్టు హుషారుగా సాగుతున్న తలంబ్రాల ఆటలో చంటబ్బాయ్ ఒకపక్క, సీత మరోపక్కా చేరి సందడి చేస్తుండగా ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. చిలిపి ఊసులాడుకున్నాయి. ఆ చూపులు కలిసిన శుభవేళ లో చంటబ్బాయ్ సీతకి బాగా నచ్చేసాడు. కనులు కనులు కలిసాయంటే ప్రేమ అని దానర్థం అనుకుంటూ ఒకరి వెనకాల ఒకరు తిరుగుతూ పెళ్లి పందిరిలో మనసిచ్చి పుచ్చుకున్నారు. వివాహ భోజనంబు చేస్తున్నప్పుడు చంటబ్బాయ్ ఓరచూపులు, వడ్డిస్తున్న సీత వీపుకి గుచ్చుకున్నాయి. వెనక్కి తిరిగి చూసి, "పిలిచారా?" అంది కళ్ళెగరేసి. "ష్. . . గప్ చుప్ గా ఉండు. మనిద్దరం మాట్లాడుకున్నట్టు మా నాన్న చూస్తే నా తాట తీస్తాడు. మనం తెలుకుట్టిన దొంగలల్లే ఏం తెలీనట్టు వుండాలి” అని శ్రీకృష్ణుడిలా గీతోపదేశం మొదలు పెట్టాడు చంటబ్బాయ్. ఆమాటకి సీత హర్ట్ అయ్యింది. బోల్డంత కోపం కూడా వచ్చింది. ఆ కోపంతోనే విసురుగా వెళ్లి బుంగమూతి పెట్టుకుని, ఆ పక్కనే వున్న బాబాయ్ హోటల్ కి వెళ్లి కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చిన్ని కృష్ణుడు సీతని చూసాడు. ఆహా ఎంత బావుందో అనుకున్నాడు. దగ్గరకు వచ్చి మాట కలిపాడు. "ఈ లంగా ఓణీలో రెండు జళ్ళ సీతలా ఉన్నావ్" అన్నాడు. "నా పేరు సీతే" అంది సీత. "నువ్వింత సంప్రదాయ బద్ధంగా వుండికూడా మోడ్రన్ పేరు పెట్టుకున్నావే. సీత. . పేరు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. " అన్నాడు నాలుగైదుసార్లు అనుకుంటూ. ఇద్దరూ ఒకే పెళ్లికి వచ్చారని తెలుసుకుని నవ్వుకున్నారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న చంటబ్బాయ్ గుండె తుప్పుపట్టిన గ్యాస్ స్టవ్ బర్నర్ లా ఎర్రగా మండింది. ఈగలు ముసురుతున్న గాజుగ్లాసుపై తన ప్రతాపం చూపించాడు. దాన్ని కోపంగా నలిపేశాడు. అది చేతిలో పగిలి సున్నిపిండిలా జలజలమని నేల మీద కుప్పగా రాలింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/eVng5mbZwXU

Episode metadata supplied by the publisher feed · Published Nov 24, 2022

Embed this episode

NOW PLAYING

చంటబ్బాయ్ | Chantabbay | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com

0:00 6:40

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 24, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!