EPISODE · Mar 2, 2023 · 14 MIN
దాంపత్య బంధపు కళ | Dampathya Bandhapu Kala | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దాంపత్య బంధపు కళ రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ''నోరు ముయ్యి..'' ''అదేమిటండీ'' భయపడింది ఆనందరావు భార్య అనసూయ. ''అవును.. నీలాంటి ఆడదాన్ని కట్టుకున్నందుకు నరకం అనుభవిస్తున్నాను. పిల్ల కళగా ఉంది చేసుకోరా అని మా పెద్దవాళ్ళు పెళ్లికి ముందు అంటే.. పుసుక్కున ఒప్పేసుకున్నాను. అప్పటి నుంచి నరకం అనుభవిస్తున్నాను నీతో. అన్ని కళలలో కాస్తో కూస్తో అనుభవం ఉన్న వాడిని.. పిసరంత కూడా ఆలోచించు కోలేక పోయాను. ఇలా కాదు.. పెళ్ళాడవలసిన ఆడదాని లో కాపురం చేసేవాడికి కావలసిన క్వాలిటీలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మగవాడికి ఆమెతో ముందుగా మూడు నెలలు టెంపరరీ కాపురం చేసే సరికొత్త రకం చట్టం ఈ మగాళ్లంతా కలిసి సాధిస్తేనే కానీ లాభం లేదు. మనిషిగ పుట్టిన తర్వాత ఏదో ఒక కళలోనైనా స్పెషాలిటీ ఉండాలి. అంతేకానీ ఆడదైనా మగ వాడైనా అడవిలో మానులా బతకకూడదు. అడవిలో మాను కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి ఏదో రూపంలో ఉపయోగిస్తూ ఉంటుంది. నీ ముఖాన ఆ అవకాశం కూడా లేదు.నూనె మడ్డిలా ఆ జిడ్డు ముఖం చూడు.. చి చి'.అంటూ ఆనందరావు భార్యకు నానా చివాట్లు పెట్టి వంటింట్లో నుంచి వరండాలోకి విసురుగా వచ్చాడు. వరండాలో పెద్దకొడుకు మురళి ఏదో పద్యం బట్టి పడుతున్నాడు. తన పక్కగా వచ్చి కూర్చున్న తండ్రిని చూసి మరీ బిగ్గరగా చదవటం మొద లు పెట్టాడు భయంతో. ''పద్యం వచ్చింది రా?'' ప్రశ్నించాడు కొడుకుని.. ''వచ్చింది డాడీ.'' ''సరే ఇంకేం చెప్పారు మీ కాన్వెంట్లో.'. ''రోజులాగే కథ చెప్పారు.'' ''ఏమిటది?' 'పాత కథ..రాజుగారు ఏడు చేపలు.'' ''కొత్త కథలు ఈ మాస్టారులకు వస్తే కదా. రాజ గారు బూజు గారు..తప్పించి ఇంకొకటి రాదు. రేపు మీ కాన్వెంట్ కి వచ్చి మీ లేడీ టీచర్ తో కొత్త కథలు చెప్పమని.. చెప్తాలే. పడుకో.. 9 గంటలకు అవుతుంది.'' తండ్రి మాటలతో మురళి మంచo ఎక్కి వెంటనే గాఢంగా నిద్రపోయాడు. మిగతా ఇద్దరు చిన్న పిల్లలు క్రింద చాప మీద నిద్రలో కమ్మని కలలు కంటున్నారు. సామాన్లన్నీ సరిది పాల గ్లాసుతో వచ్చిన అన సూయ భర్తకు అందించి.. ఇద్దరు చిన్న పిల్లల పక్కగా పడుకుంది.. చాప మీద. ఆనంద రావు మళ్ళీ సాధింపులు మొదలు పెట్టాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/khT_bVLPXDY
Embed this episode
NOW PLAYING
దాంపత్య బంధపు కళ | Dampathya Bandhapu Kala | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.