EPISODE · May 24, 2023 · 9 MIN
దేశమును ప్రేమించుమన్నా | Desamunu Preminchumanna | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Desamunu Preminchumanna' New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy 'దేశమును ప్రేమించుమన్నా' తెలుగు కథ రచన: గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆరోజు చంద్రశేఖరం పొలానికి వెళుతున్న సమయంలో భార్య ఇందుమతి వచ్చి “త్వరగా రండి. ఇవాళ అబ్బాయి వస్తునాడు. వాడికేదో మంచి ఉద్యోగం వచ్చిందిట..” అని చెప్పింది. “రానీ.. వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పు? వాడేమీ అల్లుడు కాదు రాగానే నేను లేకపోతే ఏమైనా అనుకోడానికి” అంటూ చంద్రశేఖరం పొలానికి వెళ్ళిపోయాడు. చంద్రశేఖరం ఎమ్మే చదివి అదే ఊళ్ళో టీచరుగా పనిచేస్తున్నాడు. అతని భార్య ఇందుమతి మేనమామ కూతురే.. వాళ్ళకి పెళ్ళైన పది సంవత్సరాలకు పుట్టాడు సుభాష్.. ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. కొడుకుని సివిల్ ఇంజనీరింగ్ చదివించి ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వంలో ఇంజనీరుగా చెయ్యాలని చంద్రశేఖరం కోరిక.. కానీ సుభాష్ తద్విరుద్ధంగా కంప్యూటర్ సైన్స్ చదివి అమెరికా వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు. అతను తమని వదలి అమెరికా వెళ్ళడం ఆ దంపతులకు సుతరామూ ఇష్టం లేదు.. కానీ సుభాష్ ఈతరం కుర్రవాడు.. ఆధునికతను వంట పట్టించుకున్నవాడు కావడంతో తల్లిదండ్రుల మాట పెడచెవిని బెట్టి అమెరికా వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగా సుభాష్ చదువు పూర్తి కాగానే హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్ ఆటోమేషన్, ఈ-కామర్స్ లాంటి కొత్త సాఫ్ట్ వేర్ లాంగ్వేజెస్ నేర్చుకునీ జీ అర్ ఈ పరీక్ష వ్రాసేడు. అందులో మంచి స్కోర్ వచ్చింది. ఈలోగా అతనికి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది.. అందులో చేరాలా లేక అమెరికా వెళ్ళి ఎమ్ఎస్ చదివి అక్కడ ఉద్యోగం చెయ్యాలా అన్న మీమాంసలో ఉన్నాడు.. అదే విషయాన్ని తన తండ్రి చంద్రశేఖరానికి చెబితే “నువ్వు ఇక్కడికి వచ్చిన తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం” అని చెప్పడంతో సుభాష్ గోదావరిలో బయలుదేరి ఈరోజు వస్తునాడు. చంద్రశేఖరానిది స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబం. అతని తాత బాలగంగాధర్ తిలక్.. అతను గాంధీతో కలసి దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గొప్ప దేశభక్తుడు. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడైన బాలగంగాధర తిలక్ మీద అభిమానంతో కొడుక్కి ఆ పేరు పెట్టాడు. అప్పట్లో దేశంలో చాలామంది స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టుకునేవారు. అతని కొడుకు అంటే చంద్రశేఖరం తండ్రి సుభాష్ చంద్రబోస్ కూడా తండ్రి కంటే గొప్ప దేశభక్తుడు; బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి లాఠీ దెబ్బలు తిన్నవాడు.. చంద్రశేఖరం తల్లి సుశీలకు పదహారేళ్ళ వయసులో సుభాష్‌తో పెళ్ళైంది.. అప్పట్నుంచి ఆమె భర్త అడుగుజాడల్లోనే నడిచింది. దేశం కోసం స్వాతంత్య్ర పోరాటం చేస్తూ తమ జీవితాలను త్యాగం చేసారు ఆ దంపతులు.. పిల్లలు ఉంటే తమ పోరాటానికి ఆటంకమౌతుందని స్వాతంత్య్రం వచ్చేదాకా ఆ దంపతులు పిల్లలను వద్దనుకున్నారు. అందుకే చంద్రశేఖరం ఆ దంపతులకు నలభై పదులు దాటిన తరువాత పుట్టాడు. కొడుక్కి స్వాతంత్య్ర సమరయోధుడైన చంద్రశేఖర్ ఆజాద్ పేరు పెట్టుకొని తన దేశభక్తిని చాటుకున్నాడు సుభాష్ చంద్ర. చంద్రశేఖర్, అమ్మ సుశీల కోరిక మీద ఆమె తమ్ముడి కూతురైన ఇందుమతిని పెళ్ళి చేసుకున్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/pOsr4HkIiWA
Embed this episode
NOW PLAYING
దేశమును ప్రేమించుమన్నా | Desamunu Preminchumanna | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.