దేశం కోసం | Desam Kosam | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 16, 2022 · 12 MIN

దేశం కోసం | Desam Kosam | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

 (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దేశం కోసం రచన: సీత మండలీక ఫిబ్రవరి నెల. గజ గజ వణికించే చలి. దానికి తోడు దట్టమైన పొగ మంచు వల్ల పక్కనున్న మనిషి కూడా కనబడని పరిస్థితి. ప్రజలంతా రగ్గులు రజాయ్ లు కప్పుకుని ఇళ్లల్లో వెచ్చగా పడుకుని ఉంటే మన సిపాయిలు దేశ రక్షణ కోసం చలిని, మంచుని లెక్క చెయ్యకుండా ఆఫీసర్లు మొదలుకొని జవానుల వరకు ఢిల్లీ స్టేషన్ లో తెల్లవారు ఝామున నాలుగు గంటలకి స్పెషల్ ట్రైన్ కోసం వేచి ఉన్నారు. ఢిల్లీ నించి జమ్మూ చేరేక అక్కడినించి వారి వారి నియమిత స్థలాలకి మిలిటరీ వాన్ ల లో చేరతారు. వార్ మొదలైందని అందరి సెలవు లు రద్దు చేసి ఢిల్లీ చేరమని ఆదేశాలు వచ్చేయి. ట్రైన్ వచ్చిన వెంటనే అందరూ తమ తమ స్థానాల లో సామానులు సద్దుకుని, చిరునవ్వు తో ఒకరినొకరు పలకరించుకున్నా మనసులో పేరుకొని పోయిన వారి బాధ పోదు.. తల్లి తండ్రులని, భార్య బిడ్డలిని వదిలి వచ్చిన వారు, కొత్తగా పెళ్ళైన వారు, త్వరలో పెళ్లి కాబోతున్నవారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చుటూ తిరుగు తూనే ఉంటాయి. అది కేవలం బోర్డర్ లో కాలు పెట్టిన వరకే. ఒక సారి అడుగు పెట్టేక వారు వీరాధివీరులై పోతారు. వాళ్ళ కళ్ళ ముందు కనబడేది భారత మాత రక్షణ ఒకటే. అందరితో పాటు కాప్టెన్ సికందర్ సింగ్ కూడా ఢిల్లీ చేరి తెల్లారి నాలుగు గంటలకల్లా స్పెషల్ ట్రైన్ ఎక్కేడు. సికందర్ ఒక్కడూ సైడ్ సీటు లో కూర్చుని తన మనీ పర్సులో ఎంతో అపురూపం గా పెట్టుకున్న రజియా ఫోటో కన్నార్పకుండా చూసుకుంటూ కొత్త గా పెళ్ళైన తన భార్య ఎలా ఉందో అని ఆలోచనలో పడ్డాడు. పంజాబ్ లో ఒక చిన్న పట్నం సికందర్ పుట్టిన ఊరు. ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఊరిప్రజల మధ్య జాతి మత భేదాలు లేవు. ఊరంతా ఒక ఫామిలీ లా జీవిస్తున్నారు. వాళ్ళ మతం ఒక దేశ భక్తి మాత్రమే. సికందర్, రజియా అల్లాంటి వాతావరణం లో పెరిగేరు. ఆ చిన్న ఊర్నించే ఎంతో మంది దేశ సేవ కోసం యుద్ధ వీరులయ్యేరు. అక్కడ ప్రతీ ఇంటా ఒకరో ఇద్దరో సైన్యం లో ఉన్నారు. రజియా అబ్బాజాన్ కల్నల్ గా రిటైర్ యేరు. రజియా పెద్దఅన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో, చిన్నన్నయ్య ఆర్మీ లో కార్గిల్ వార్ లో పాల్గొని దేశానికి, ఊరికి కూడా మంచి పేరు తెచ్చేరు. సికందర్, రజియా మొదటినించీ పక్క ఇళ్లల్లో ఉన్నా ఇద్దరూ ఎప్పుడూ ఒకే చోట ఉండేవారు. చిన్నతనం నించి వారి స్నేహం అలాంటిది. వాళ్ళ స్నేహం ఇంట్లో వాళ్లకి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. రజియా తన కంటే రెండేళ్లు చిన్న. ఇద్దరూ కలిసి పెరిగేరు. ఒకే స్కూల్ లోను, కాలేజీ లోను చదువుకున్నారు. ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ అభిమానం. సికందర్ కి చిన్నప్పటినించీ ఆర్మీ లో చేరి పెద్ద ఆఫీసర్ అవ్వాలని కోరిక. సికందర్ ఎన్. డీ. ఏ ఎగ్జాం మంచి మార్కులతో పాస్ అయి ఇంటర్వ్యూ లో మంచి రాంక్ సంపాదించేడు. ఆర్మీ లో సెలెక్ట్ అయి ట్రైనింగ్ తరవాత పంజాబ్ రెజిమెంట్ లో ఆఫీసర్ గా చేరేడు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/hpD0FYDQNwI

Episode metadata supplied by the publisher feed · Published Oct 16, 2022

Embed this episode

NOW PLAYING

దేశం కోసం | Desam Kosam | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com

0:00 12:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 16, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!