EPISODE · Jan 26, 2023 · 14 MIN
దేవుడు కోటేసు | Devudu kotesu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దేవుడు కోటేసు రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రతి మనిషిలో దైవత్వం వుంది. కొందరి విషయంలో అది నివురుగప్పిన నిప్పులా ఉంటూ దానవతను గుర్తుచేస్తుంది. కొందరి విషయంలో ఆ గొప్ప గుణం సలక్షణంగా సాటివారికి సహాయపడుతుంది. ఆ మహా గుణ సంపదకు భోగభాగ్యాలు పరిమితం కావు. మంచి మానవత్వం... అదే దైవత్వం."రంగా!..." మూసి ఉన్న తలుపును తట్టి పిలిచాడు కోటేసు. అతని ప్రక్కన భార్య లక్ష్మి ఉంది. పాతిక సంవత్సరాల తర్వాత కోటేసు తన ఊరికి భార్యతో కలిసి వచ్చాడు. తన పిన తండ్రి కొడుకు రంగను, తన ఊరిని, తన యజమాని రామచంద్ర రావు గారిని చూడాలని. కోటేసు రెండవ పిలుపు విని రంగా తలుపు తెరిచి వరండాలోకి వచ్చాడు రంగా కోటేసుకన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడు ప్రస్తుతములో కోటేష్ వయస్సు అరవై సంవత్సరాలు అతని ఇల్లాలు లక్ష్మికి యాభై ఐదు సంవత్సరాలు. అన్నా వదినలను చూచి రంగా ఆశ్చర్యపోయాడు. చాలా కాలం తర్వాత వారిని చూసినందుకు రంగ తన కళ్ళనుతానేనమ్మలేకపోయాడు. కొద్ది క్షణాలు వారిని పరీక్షగా చూశాడు. "రంగా!... నేను కొటేసును." నవ్వుతూ చెప్పాడు కోటేసు. రంగా వదనంలో ఎంతో ఆనందం "అన్నా!..." అని చేతులు జాచి కౌగిలించుకున్నాడు కొటేసును. "ఇన్నేళ్ళుగా ఎక్కడ ఉన్నేవన్నా!..." అన్న గద్గద స్వరంతో అడిగాడు రంగ. "నన్ను... మీ వదినను ఎవరూ గుర్తించని చోట కాయకష్టం చేసుకుంటూ జీవితాన్ని లాక్కొచ్చాను ఇంతవరకూ!..." నవ్వుతూ చెప్పాడు కోటేసు. "మిమ్మల్ని చూచిన నాకు ఎంతో ఆనందంగా ఉందన్న. రండి...” లోనికి చూస్తూ "మంగా... మంగా!... ఎవరొచ్చారో చూడు." ఆనందంతో పలికాడు రంగ. మంగ వచ్చింది. వారిని చూసింది. ఆనందంగా కోటేసు ఇల్లాలు లక్ష్మి చేతులు పట్టుకుంది. "అక్కా!... బాగున్నావా !..." ఎంతో ఆప్యాయంగా అడిగింది మంగ. "బాగున్నాను మంగా!..." నవ్వుతో చెప్పింది లక్ష్మి నలుగురూ ఇంట్లోకి నడిచారు. ఆ నాలుగు హృదయాల్లో ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమాభిమానాలు. అది మానవతావాదానికి నిదర్శనం. *** అన్నదమ్ములు కోటేసు, రంగా చెరువు కట్ట మీది మర్రిచెట్టు క్రింద కూర్చుని తమ గతాన్ని తలపోసుకుంటున్నారు. "రంగా !..." మన అయ్యగారు బాగున్నారా!..." శూన్యంలోకి చూస్తూ అడిగాడు కోటేసు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/-JhSfFtMDAM
Embed this episode
NOW PLAYING
దేవుడు కోటేసు | Devudu kotesu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.