EPISODE · Jan 8, 2023 · 16 MIN
దేవుడు వెళ్లిపోయాడు | Devudu Vellipoyadu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దేవుడు వెళ్లిపోయాడు రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మానవ రుణానుబంధాలు చిత్రవిచిత్రాలు . వాటికి చదువు సంస్కారంతో పనిలేదు.... మంచి మానవత్వం వున్న మనస్సు వుంటే చాలు...మనిషి దేవుడై పోతాడు. స్టేషన్లో రైలు బండి వచ్చి ఆగింది. ఆ స్టేషన్లో దిగ వలసినవారు గమ్యాన్ని చేరామనే ఆనందంతో భోగీల నుంచి కిందకు దిగుతున్నారు.ఆ బండి ఎక్కి ముందుకు ప్రయాణం చేయ వలసిన వారు హడావుడిగా తమ సామాగ్రితో కంపార్టుమెంట్స్ లో ఎక్కుతున్నారు వారి వారి టికెట్ తరగతి ననుసరించి. నారిగాడు లచ్చి దంపతులు. రెండు గోనె సంచులను చేతపట్టుకొని ఎంతో రద్దీగావున్న మూడవ తరగతి జనరల్ కంపార్టుమెంట్లో అతి కష్టం మీద ఎక్కారు. వున్న సీట్లలో , మధ్యన నడిచే దారిలో జనం నిలబడి వున్నారు. కంపార్టుమెంట్ ముందువున్న ఎక్కే ద్వారం ప్రాంతానవున్న ఖాళీ స్థలంలో లోనికి పోలేక తమ సంచుల్నీ భోగీ చెక్కకు ఆనించి ఇరువురూ ఆ చెక్కకే ఆనుకొన్నారు. బండి కూతవేసి ముందుకు బయలుదేరింది. అరగంటలో ... ప్రక్క స్టేషన్లో ఆగింది. మధ్యన నిలబడి వున్న వారు కొంతమంది దిగిన కారణంగా... లోన వున్నందున నారిగాడు... లచ్చి మధ్య దారిలోకి రాగలిగారు. వారివురి వదనాలు... ఎంతో దీనంగా కళావిహీనంగా వున్నాయి. తలకు తైల సంస్కారం లేదు. కళ్ళల్లో కాంతి లేదు. వారి హృదయాల నిండా వున్నది ఆవేదన. పడమట సూర్యుడు అస్తమించాడు. కంపార్టుమెంట్లో దీపాలు వెలిగాయి. చీకటిని చీల్చుకొంటూ రైలు బండి ముందుకు పోతూవుంది. బండి మరో స్టేషన్లో ఆగింది. చాలామంది దిగారు. నారిగాడికి లచ్చికి సీట్లు దొరికాయి. బెంచీక్రింద తమ లగేజీని వుంచి కిటికీ వైపున లచ్చి ... ఆమె ప్రక్కన నారిగాడు కూర్చున్నారు. బండి కదిలింది. “మామా!.. బాధపడుతుండావా?...” నారిగాడి ముఖంలోకి చూస్తూ దీనంగా అడిగింది లచ్చి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
దేవుడు వెళ్లిపోయాడు | Devudu Vellipoyadu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.