EPISODE · Nov 27, 2022 · 17 MIN
ది ట్రాప్ ఎపిసోడ్ 10 | The Trap Episode 10 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 10 రచన : పాండ్రంకి సుబ్రమణి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' పదవ భాగం గత ఎపిసోడ్ లో చనిపోయిన తమ కూతురు సుభాషిణి పుట్టిన రోజున వరూధిని ఇంటికి వెడతారు భువనేష్, ప్రభావతులు. మందాకినిలో తమ కూతుర్ని చూసుకోవాలనుకుంటారు. వరూధిని, ఆఫీసుకి వెళ్లకుండా వాళ్ళతో గడుపుతుంది ఇక ది ట్రాప్.. పదవ భాగం చదవండి… ఆరోజు పరమేశ్వర్ యేదో ప్రోజెక్ట్ ప్రిపరేషన్ లో బిజీగా పని చేసి ఇల్లు చేరేటప్పటికి ఆలస్యమైంది. గుమ్మం వద్ద మట్టి దివ్వెలు పెడ్తూ తులసీ స్తుతి పాడుతూంది తల్లి- “యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వదేవతా:” కాని— అదే సమయాన ఇంట్లోపల నుంచి తండ్రి కేకలు వినిపించడం గమనించి స్టన్నయాడు. వేదమూర్తికి కోపం వస్తే పట్టలేడని అతడికి తెలుసు. ఆపు కోవడానికి ప్రయత్నిస్తే మరింతగా రెచ్చిపోతుంటాడని కూడా తెలుసు. మొత్తానికిది మంగళకర సాయంత్రమనేదా లేక భీతావహ వాతావరణ మనేదా-- ఇలా తడబడుతూ త్వర త్వరగా బూట్సు విప్పి లోపలికి చొచ్చుకు వెళ్లాడు పరమేశ్వర్. అక్కడ తమ్ముడు పవన్ భీతిల్లే వదనంతో ఒదిగి ఒదిగి జంకుతూ ఏదో విషయంపై తండ్రికి నచ్చచెప్పడానికి అవస్థ పడుతున్నాడు. దగ్గరకు వెళ్ళింతర్వాత తెలిసింది, తండ్రి తమ్ముణ్ణి యెడాపెడా వాయిస్తున్నాడని- “చచ్చు తెలివి తేటలు కట్టిపెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడచుకో! లేకపోతే ఏమవుతుందో తెలుసు కదూ? మీ బాబు నీకంటే ముందు పుట్టాడన్నది గుర్తు పెట్టుకో— తొక్కేస్తానని చెప్పను గాని చీల్చేస్తా!” అప్పుడు కలుగ చేసుకున్నాడు పరమేశ్వర్ తండ్రికి గ్లాసులో మంచి నీళ్లు పోసి అందిస్తూ- “ఏమైంది నాన్నగారూ! కాని తప్పేమైనా చేసాడా! ” “ఇంకేమి కావాలి? ఏమి జరక్కూడదో అదే జరిగేటట్లుంది. ఇద్దరన్నయ్యలున్నారు. ఇవన్నీగమనిస్తున్నారా!” “ఏమి గమనించలేదంటున్నారు నాన్నా! చెప్తే కదా తెలుస్తుంది? ” “అవన్నీ ఈ వయసులో నా నోటమ్మట చెప్పాలన్న మాట. కర్మ! కోమటి కోదండం రెండవ కూతురు ప్రణీత లేదూ— ఆ పిల్లతో ఈ మధ్య మీ తమ్ముడు మరీ క్లోజ్ ఫ్రెండు షిప్పుతో మెసలుతున్నట్టున్నాడు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఒకటే పకపకలూను విక వికలూను-” కోపంగా ఉన్న తండ్రిని శాంతపర్చడం కోసం పరమేశ్వర్ అన్నాడు- “మీరు అనుకుంటున్నది వాస్తవం కాకపోవచ్చు నాన్నగారూ! ఇటువంటి విషయాలలో ధైర్యం కావాలి. వాడికి అంతటి ధైర్యం ఉండదు నాన్నా!” “నోర్మూస్తావా! ఇటు వంటి విషయాలలో ధైర్యం కాదు కావలసింది. పెడ బుధ్ది ఉంటే చాలు— అప్పుడే అనుకున్నాను వీడు మునుపులా టాకీలకు పోకుండా తరచుగా గుళ్ళూ గోపురాలు తిరుగుతున్నప్పుడే— ఆ పిల్ల యెప్పుడెప్పుడు మన షాపుకి వస్తుందో— Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/cSRdQ_5JQGQ
Embed this episode
NOW PLAYING
ది ట్రాప్ ఎపిసోడ్ 10 | The Trap Episode 10 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.