EPISODE · Dec 4, 2022 · 15 MIN
ది ట్రాప్ ఎపిసోడ్ 11 | The Trap Episode 11 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 11 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' పదకొండవ భాగం గత ఎపిసోడ్ లో పవన్ ప్రేమ వ్యవహారం లో పడ్డట్లు అనుమానిస్తాడు వేద మూర్తి. ఆ విషయం తను కనుక్కుంటానని సర్ది చెబుతాడు పరమేశ్వర్. దివాకర్ దంపతులు వినోదినితో పాటు వేదమూర్తి ఇంటికి వస్తారు. వెళ్ళేటప్పుడు ఏదో నెపంతో వినోదినిని అక్కడే వదిలి వెడతారు. ఇక ది ట్రాప్.. పదకొండవ భాగం చదవండి… భువనేశ్వర్ మేజర్ కంప్యూటర్ సిస్టమ్ అప్డేట్ చేసి రావడానికి కంపెనీ తరపున ఇండోనేషియా వెళ్ళి జూనియర్ టెక్నీకల్ స్టాఫ్ తో సెట్టింగ్సు అమర్చి అక్కడి కంప్యూటర్ సిస్టమ్ ని మెరుగు పరచి ఊరు చేరుకోవడానికి ఆరు రోజులు పట్టాయి. ఈలోపల అతడికి ఒకటి తరవాత ఒకటిగా లాభదాయకమైన సాను కూలమైన మార్పులు జరిగాయి. అతడు కొన్నిరోజులుగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని యెదురు చూసిన హయ్యర్ పోస్టు విత్ హయ్యర్ గ్రేడేషన్ తో బాటు, కొత్త కంపెనీ రూల్స్ ప్రకారం కొత్త కారు కూడా తళతళ మెరుస్తూ యింటి వాకిట నిల్చుంది. చాలా రోజులు తరవాత ఏతెంచిన భర్త కోసం ప్రభావతి రొయ్యల బిరియాని, కోడి గుడ్లు వేపుడు కూర చేసింది. ఆ తరవాత భాగ్యానికి చేతిలో చిల్లర డబ్బులు పెట్టి పెందలకడే యింటికి పంపించేసింది. ఆ తరవాత నాట్యంలో కాస్తో కూస్తో ప్రవేశం ఉన్న ప్రభావతి సంతో షంతో తేజరిల్లుతూ ఆమెకు యిష్టమైన జానపద గీతం-’సలలిత రాగ సుధా రససారం-సర్వకళాన్మయ నాట్య విలాసం! ’ నాట్య విలాసంతో పాడి వినిపించి ముద్దుల వర్షం కురిపించి ఉన్నపాటున అతణ్ణి కౌగలి సంకెళ్ళలో బంధిస్తూ అంది- “ఇది మంచి సమయం. వసంతోత్సవం విలసిల్లే వాతావరణం. రండి! మనం వరూధిని గారింటికి వెళదాం. ” ప్రభావతి పెదవుల్ని తన పెదవులతో ఆక్రమించిన భువనేశ్ ఉలిక్కి పడ్డట్టయ్యి ఎందుకూ అన్నట్టు కనుబొమలెగరేస్తూ చూసాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/HHtRXfk9eG8
Embed this episode
NOW PLAYING
ది ట్రాప్ ఎపిసోడ్ 11 | The Trap Episode 11 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.