EPISODE · Dec 12, 2022 · 13 MIN
ది ట్రాప్ ఎపిసోడ్ 12 | The Trap Episode 12 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 12 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో భువనేశ్ కి ప్రమోషన్ తో పాటు కొత్త కారు కూడా వస్తుంది. ప్రభావతి ఇంట్లో లేని సమయంలో వరూధిని తన కూతురు మందాకినితో భువనేశ్ ఇంటికి వస్తుంది. ప్రభావతి వచ్చేవరకు అక్కడే ఉంటానంటుంది. ఇక ది ట్రాప్.. పన్నెండవ భాగం చదవండి… హోటల్ రాయల్ బేంక్వట్ హాలులో నగర ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు విందు భోజనం యేర్పాటు చేసారు. వరూధిని యెటువంటి సందిగ్ధావస్థకూ లోను కాకుండా కూతురుతో బాటు భువనేశ్ ని కూడా తెలిసిన వారైన కొందరికి, యెదురొచ్చిన మరి కొందరికీ పరిచయం చేసింది. వాళ్ళలో ఆమెకు బాగా పరిచయం ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ భార్య చనువుగా అడిగింది కూడాను-“ఈజ్ హి యువర్ బాయ్ ఫ్రెండ్? ”అని. నవ్వు చిలకరిస్తూ వయ్యారంగా ముందుకు సాగుతూ బదులిచ్చింది- ’జస్ట్ లైక్ దట్! ’ “ అలాగంటే కుదరదోయ్! ఈజ్ హి ఆర్ నాట్?” అని రెట్టించిందామె. ‘అలాగే అనుకో-’ అంటూ కదలబోయింది వరూధిని. అతడూహించినట్లే ఆమె వదల్లేదు. నొక్కి అడిగింది చెప్పమని. అటువంటి విషయాలలో ఆడాళ్ళకు రొమాంటికి థ్రిల్ యెక్కువని అతడికి తెలుసు. ఇక తప్పదన్నట్టు అతడి వేపు ఓ చూపు విసిరి సంభాషణ కట్ చేసింది వరూధిని-- “హి ఈజ్ మై మ్యాన్. చాలా! ” అని విసురుగా అంటూ-- దానితో ఆ బిజినెస్ మ్యాన్ భార్య తలవిదిలించి ఆహ్వానితుల్లో కలసిపోయింది. అదే రీతిన వరూధిని మరొక ఇద్దరు బ్రైట్ లేడీ పర్సనాలిటీస్ ని ముఖాముఖి పరిచయం చేసింది. అతడి చూపుని ఆకట్టుకున్నది సితారా అనే యంగ్ లేడీ స్టార్టప్ సి ఈ ఓ— విద్యుత్ తీగలా ప్రవహించే కొండ వాగులా చురుగ్గా సంభాషణ కొనసాగించింది. సింగల్ గా ఉన్న సితార మాటల్ని, విషయ ప్రాజ్ఞతను గమనించి అతడికి తన అమెరికన్ కంపెనీ సహచరుడు, కార్పొరేట్ మెయిన్ ఆఫీసు సహోద్యోగి రాము ఉన్నపళంగా గుర్తుకి వచ్చాడు. వ్యక్తిత్వంలో, డైనమిజమ్ లో ఇద్దరూ ఒకరికొరు మంచిజోడీ. ఇద్దరూ కలిస్తే వసంత కాలానికి చివుళ్ళు పల్లవించినట్లే— ఇంటా బయటా లైఫ్ టైమ్ అచీవ్మెంటే— ఒకటి కాదు, రెండు మూడు స్టార్టప్ లను విజయవంతమైన కంపెనీలుగా తీర్చిదిద్ది వాటిని సంయుక్తంగా నడిపించగలరు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Dvu6m0ogw4U
Embed this episode
NOW PLAYING
ది ట్రాప్ ఎపిసోడ్ 12 | The Trap Episode 12 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.