ది ట్రాప్ ఎపిసోడ్ 13 | The Trap Episode 13 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 20, 2022 · 14 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 13 | The Trap Episode 13 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 13 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో వరూధిని, మందాకినిలతో డిన్నర్ కి వెళ్తాడు భువనేశ్. ఆ రాత్రి ప్రభావతి ఇంటికి రాకపోవడంతో వరూధిని భువనేశ్ ఇంట్లో పడుకుంటుంది. అతనికి దగ్గరవుతుంది. ఇక ది ట్రాప్. . పదమూడవ భాగం చదవండి… ఆరోజు సాయంత్రం వినోదిని, కమలంతో కలసి పెరడు చెట్లకు నీళ్ళుపోసి, కొన్ని మొక్కలకు ట్రిమ్మింగ్ చేసి, వంటగది లోకి వెళ్ళి కామాక్షమ్మ అందించిన నాలుగు టీ-  కప్పులు ప్లేటులో పెట్టుకుని మంగళ దేవమ్మ గదిలోకి వచ్చింది. అక్కడ వినాయకం కూడా మంగళ దేవమ్మ ప్రక్కన ఉండటం చూసి-  “హాయ్ తాతగారూ! ఎప్పుడొచ్చారు? అసలు మాకళ్లబడకుండా యెలా చప్పుడు లేకుండా రాగలిగారు?“ అని అడుగుతూ పెద్దలిద్దరికీ టీ-  కప్పులు అందించింది. వినాయకం గట్టిగా నవ్వాడు- “ ఇంకా నయం—ఎందుకు వచ్చారు? వచ్చారే అనుకో.. మా అవ్వగారి గదిలోకి యెలా వచ్చారు— అని అడగలేదు. ఏది యేమైతే నేమి—నీకు బదులివ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాను కాబట్టి చెప్తాను. ఊరుకి వెళ్ళి ప్రాతకాలం నాటి బందువుల్ని చూసొచ్చాను. ఎవర్నని అడక్కముందే చెప్పేస్తాను— మీ చిన్నవ్వ.. అంటే మంగళాదేవమ్మ చెల్లెలు మీనాక్షిని చూసొచ్చాను. నిజానికి నువ్వు చెప్తే నమ్ముతావే లేదో గాని—నేను మీనాక్షినే పెళ్ళి చేసుకోవలసింది. మధ్యన మంగళ దేవమ్మ శివపూజలో యెలుగులా దూరి కార్యం పాడు చేసింది. చెల్లిని ప్రక్కకు తోసి నన్ను యెగరేసుకు పోయింది—లేకపోతే—నేనిక్కడ కాదు. అక్కడుందును—“. ఆ మాట విన్నంతనే మంగళా దేవి కస్సుమంది-  “మహా మన్మథుడు చూడూ— సొక్కి పడిపోయాను. నిజానికి ఈ మన్మథ రూపుడే తోటలోకి పిలిచి వెన్నెల భోజనం తిందామని కింక పెట్టేవాడు. నావెంట పడేవాడు. అదంతా మరచిపోయినట్టున్నాడు ఈ పెద్దమనిషి—” అప్పుడు కమలం వాళ్ళ మధ్యకు వచ్చి నిల్చుంది-  “ఇక చాలించండి ఈ కొట్లాటలూ ముచ్చట్లూ— అప్పట్లో పోలిగామీ ఉండటం చట్ట ఉల్లంఘన కాదు కదా— ఎంచక్కా ఇద్దరక్కా చెల్లెళ్ళనూ కిడ్నేప్ చేసి తీసుకొచ్చేయ వలసిందేగా-  ! మాకు ఇద్దరు బామ్మలుండే వారు కదా! ఇల్లు ఇంతకంటే రప్చర్ గా ఉండేది కదా..” మంగళాదేవమ్మ యేమీ అనలేదు. మనవరాలిని దగ్గరకు పిలిచింది-  రహస్యం చెప్తానంటూ— కమల దగ్గరకు వచ్చింది—చెప్పు బామ్మా అంటూ—మంగళాదేవమ్మ యేమీ చెప్పలేదు. చట్టున నెత్తిపైన మొట్టి కాయ పెట్టింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/fKbuUCWsIXQ

Episode metadata supplied by the publisher feed · Published Dec 20, 2022

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 13 | The Trap Episode 13 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 14:41

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 20, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!