EPISODE · Dec 28, 2022 · 17 MIN
ది ట్రాప్ ఎపిసోడ్ 14 | The Trap Episode 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 14 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో తన ఇంటికి బయలుదేరుతున్నట్లు చెబుతుంది వినోదిని. ఉండమంటుంది మంగళదేవమ్మ. ఆఫీసుకు బయలుదేరుతున్న పరమేశ్వర్ ని ఆపి తమతో గుడికి రమ్మంటారు. ఇక ది ట్రాప్. . పదునాల్గవ భాగం చదవండి… మరి కొద్ది సేపటికి ఇంటిల్లిపాదీ ఆలయ ప్రాంగణం చేరుకున్నారు. గుడిలోకి ప్రవేశించక ముందు అక్కడ నిటారుగా నిల్చున్న ఆవుకి మంగళాదేవమ్మ, కామాక్షమ్మ ఇద్దరూ అరటి పళ్ళు అందించారు. వినోదిని చేత కూడా అరటి పళ్ళు తినిపించారు. అప్పుడు యెడంగా నిల్చున్న చిన్న కొడుకుని పిలిచి అతడికి కూడా పళ్ళిచ్చి ఆవుకి తినిపించమన్నారు. అప్పుడా సమయాన యెవరూ యెదురు చూడని దృశ్యం చూసి వేదమూర్తి విస్తుపోయినట్టు నిల్చుండిపోయాడు. విశ్వం భార్య సువర్చలతో యెదురొచ్చి--“నేనెలా యిటువంటి సమయంలో ఇలా ఊడిపడ్డానని తెల్లబోతున్నావా! రాబోకు—దరి రాబోకన్నట్టు చూడకు. మంచి రోజు, అందరమూ గుడిలో కలుసుకుందామని మాటల సందర్బంలో కామాక్షి చెప్పిందిలే—మాతో బాటు వసంత కూడా వచ్చిందిలే—నువ్వొక సారి చూసి దీవించాలిగా--అందుకే తీసుకు వచ్చాను. ఆడ పిల్ల తండ్రిని. నువ్వు యెడంగా ఉన్నట్లు నేనుండ లేనుగా!”. ఆమాట విన్నవెంటనే వసంత వెళ్ళి వినాయకం వేదమూర్తుల కాళ్ళకు నమస్కరించింది. వేదమూర్తి నోట మాట పెగలడం లేదు. తెలిసి గుడికి వచ్చాడంటు న్నాడు. మరి—పరమేశ్వర్ కి, వినోదినికీ జత చేరబోతున్నారన్నది తెలిసే వచ్చాడా! అతడికంతా అగమ్య గోచరంగా ఉంది. ఏమని చెప్పాలో యెలా స్పందించాలో తెలియక భార్య కామాక్షమ్మ వేపు చూపులు సారించాడు.. భర్త చూపుల్లోని అర్ధాన్ని గ్రహించిన కామాక్షి అక్కడ కొన్న పూజా దినుసులు అత్తగారికి అందించి వేగంగా అక్కడకు చేరుకుంది- “వచ్చేసావా వదినా! వసంత యేదీ---“ అని పరామర్షిస్తూ సువర్చలతో చేతులు కలిపింది. నాజూకుగా సన్నటి బంగారు తీగలా నిల్చున్న వసంత తట్టున తేరుకుని కామాక్షికి నమస్కరించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/LkE78SobvA0
Embed this episode
NOW PLAYING
ది ట్రాప్ ఎపిసోడ్ 14 | The Trap Episode 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.