ది ట్రాప్ ఎపిసోడ్ 16 | The Trap Episode 16 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 12, 2023 · 14 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 16 | The Trap Episode 16 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 16 రచన : పాండ్రంకి సుబ్రమణి  (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో ఒకరోజు భువనేష్ కి కాల్ చేస్తుంది వరూధిని. కాల్ ప్రభావతి లిఫ్ట్ చెయ్యడంతో, తన కూతురు మందాకిని మిమ్మల్ని చూడాలంటోందని మాట మారుస్తుంది. మాటల మధ్యలో తన మిత్రుడు రాముకి సితారతో పెళ్లి చెయ్యడానికి భువనేష్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతుంది. ఇక ది ట్రాప్.. 16 వ భాగం చదవండి… రాము కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయి తలెత్తి చూసాడు. “నువ్వు నాశ్రేయోభిలాషివే—మిత్రుడివే-  కాదనలేని వాస్తవం. కాని నువ్వు నా జీవిత నేపథ్యాన్ని, మానసిక దృక్పథాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేక పోయావనిపిస్తుంది. నేను పెళ్ళి చేసుకుని ఓ యింటివాడిని కావడానికి ఒప్పుకోవడానికి సరైన కారణం నువ్వు తెలుసుకోలేక పోయావనిపిస్తుంది”. ఆ మాటతో భువనేశ్ ఉగ్గబట్టలేకపోయాడు. సర్రున లేచాడు- “ఈ డొంక తిరుగుడు మాటలు కట్టిపెట్టి విషయానికి తిన్నగా రా! సితారా నీకు నచ్చ లేదా? నీ అభిమతానికి తగ్గట్టు సొగసుగ లేదా? ” “అలాగని నేనెక్కడన్నాను? రియల్లీ షి ఈజ్ ఎ మైటీ పర్సనాలిటీ—నోడౌట్—కాని— మనసా వాచా కర్మణ: నేనాశినట్టు లేదు. నా మనసుకి దగ్గరగా లేదు”. ఈసారి కూడా భువనేశ్ సర్రున లేచాడు. భర్తను ఆవేశం తగ్గించుకోమన్నట్టు చేతిని అదిమింది ప్రభావతి. కాని అతడు వినే స్థితిలో లేడు-- “నువ్వూరుకో ప్రభా! తాడో పేడో ఇప్పుడే ఇక్కడే తేల్చాలి. ఇలా తిక్క తిక్కగా ఆలోచించడం, వెర్రి మొర్రిగా మాట్లాడటం యెప్పట్నించి నేర్చుకున్నావు రామూ! అమెరికాలో నీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన గార్ల్ ఫ్రెండ్సు గురించి నాకు తెలవదనుకుంటున్నావా? చూడలేదనుకుంటున్నావా! వాళ్ళతో పోల్చి చూస్తే సితార యెందులో తగ్గిందంటావు? ” భువనేశ్ అతడికి తెలియకుండానే రొప్పుతున్నాడు, ఆవేశాన్ని అదుపు చేయలేక-- ”సితారను వాళ్ళతో యెక్కడ పోల్చానని—నిజానికి సితార అక్కడి బ్యూటీల కన్నా రెండు రెట్లు అధిక స్థానంలో ఉందనాలి. ఎంత ప్రయత్నించినా మేకపోతు కొమ్ముల్ని పట్టుకుని నీకు చూపించలేక పోతున్నాననిపిస్తుంది. మరొక సారి ప్రయత్నించి చూస్తాను. నాకు తెలిసిన తెలుగు పదజాలంతో-- ఏకైక లక్ష్యంతో జీవన సముద్ర తీరాలు దాటి పలు అనుభూతులు ఆస్వాదిస్తూ లెక్కలేనన్ని అనుభవాలను నాలో యిముడ్చుకుంటూ చాలా దూరం వచ్చేసాను. తీరా ఓసారి ఓపిక తెచ్చుకుని తిరిగి చూస్తే— మాఁవిడి చెట్టు కొమ్మల మాటున నాతో చెలగాట మాడిన బాల్యం నాకు కనిపించలేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/68tER3Vx_7c

Episode metadata supplied by the publisher feed · Published Jan 12, 2023

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 16 | The Trap Episode 16 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 14:09

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 12, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!