EPISODE · Feb 3, 2023 · 16 MIN
ది ట్రాప్ ఎపిసోడ్ 19 | The Trap Episode 19 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 19 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో పరమేశ్వర్ అంటే తనకిష్టమని అతనితోనే చెబుతుంది వినోదిని. తనకు కూడా వినోదిని అంటే ఇష్టమని చెబుతాడు పరమేశ్వర్. ప్రభావతి పుట్టిన రోజు ఘనంగా జరుగుతుంది. ఇక ది ట్రాప్.. 19 వ భాగం చదవండి… ఎప్పుడో యెక్కడో వాల్మీకి మహర్షి ధ్యాన నిమగ్నుడై ఉన్నప్పుడు స్వఛ్ఛమైన మంచితనం గురించి యిలా అన్నాడట- “మంచి మనసు గల మనిషి ప్రక్కన కూర్చుని మాట్లాడితే చల్లగా పారే స్వఛ్ఛమైన సెలయేరు ప్రక్కన ఉన్నట్లుంటుంది! ”అని-- ఆ కోవన చూస్తే గుభాళించే మంచి మనసుల్ని పూలతీగలతో పోల్చవచ్చేమో-- తీగ తీగకూ మొగ్గ నిశ్శబ్దంగా నిండుగా తొడగుతూ అడుగడుగునా పుష్పిస్తూ బ్రతుకు బాటను చైత్రరథంలా మారుస్తుంది. జీవన సారాన్ని అమృత మయం చేస్తుంది. మొదట వేదమూర్తి దంపతులకు, ఇంటి పెద్దలు మంగళా దేవమ్మ వినాయకం దంపతులకు సంకటమైన పరిస్థితి యెదురైంది. దానిని దాటి ఎలా ముందుకు సాగాలో తెలియలేదు. వేదమూర్తి చిన్ననాటి నేస్తమూ ఫార్మా కంపెనీ ఓనర్ ఐన దివాకర్ తన కూతురు వినోదినిని తోటలోని పూల మొక్కలా వికసిస్తూ న్న విద్యావంతుడు పరమేశ్వర్ కి యివ్వడానికి కూతూహలం చూపించాడు. కాని పెద్దవాడు కామేశ్వరరావు సంగతి యెత్తనే లేదు. ఇకపోతే పెళ్ళీడుకొచ్చిన వాళ్ళ వదిన కూతురు తులసి పెళ్ళి సంగతి యెత్తుతారని ఆశించారు అప్పుడా యిప్పుడా అని, వేదమూర్తి దంపతులిద్దరూ— కాని ఎవరూ తులసి ఉనికే యెత్తలేదు. తులసి ఊసు దివాకర్ యెత్తుతాడని, అతణ్ణి మాటల్లోకి దింపుదామని భార్యాభర్తలిద్దరూ యెదురు చూసారు. కాని అలా యెదురు చూడటం అత్యాశవుతుందేమోనని జంకారు. కాని— ఆ సమస్యను కూడా దాటి విద్యావంతుడు ప్రభుత్వ ఉద్యోగి అయిన విశ్వం తన కూతురు వసంతను కామేశ్వరరావుకి యివ్వడానికి ముందుకొచ్చాడు. ఇది దైవ సంకల్పం కాదూ! Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/WeOJLhu01DM
Embed this episode
NOW PLAYING
ది ట్రాప్ ఎపిసోడ్ 19 | The Trap Episode 19 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.