EPISODE · Oct 2, 2022 · 14 MIN
ది ట్రాప్ ఎపిసోడ్ 2 | The Trap Episode 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 2 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' రెండవ భాగం గత ఎపిసోడ్ లో అమెరికా వెడుతున్నాడు భువనేశ్. మార్గమధ్యంలో అబుదబీ ఎయిర్పోర్ట్ లో పిల్లలతో వెడుతున్న ఒక జంటను చూస్తాడతను. అందులోని యువతిని చూసి తన భార్య ప్రభావతిని గుర్తుకు తెచ్చుకుంటాడు. గతంలోకి వెడతాడు. తన ఒక్కగానొక్క కూతురు సుభాషిణి ఏడేళ్ల వయసులో మరణించడం జ్ఞాపకం చేసుకొని బాధ పడతాడు. ఇక ది ట్రాప్.. రెండవ భాగం చదవండి... “ఓకే ఓకే! ఇప్పుడు పెదవి విప్పి నా పెదవులతో కలప వచ్చు కదా! ” “ పెదవి విప్పుతున్నాను వినండి. ఎక్కడ చూపు సారించినా మీ బంగారు కూతురే కనిపిస్తూంది, నా చుట్టూ అదే కొంగు పట్టుకుని తిరుగుతూంది, లాగుతూంది. మీరుంటే సరే, ఫీలింగుని మరల్చుకోగలను. మీరిప్పుడు నా యెదుట లేరుగా-- నన్నేమి చెయమంటారో చెప్పండి”. అప్పుడు పెదవి మూయడం భువనేశ్ వంత యింది. ఈ కారణాల వల్లనే అతడు సాధ్యమైనంత మేర భాగ్యనగరం విడిచి బైటకు కదలడు.చివరకు బాబాయింటికి గాని, తాతయ్యా బామ్మలను చూడటానికి కూడా కదలి వెళ్ళడు. సుభాషిణి తమను విడిచి పైలోకాలకు వెళ్ళిపోయిన తరవాత ప్రభావతి యేకాంతం భరించలేకుండా ఉంది. నిజానికామె ఆ కరాళ రాత్రివంటి ఒంటరి తనం నుండి విడివడటానికి ఊళ్ళోని అమ్మానాన్నల వద్దకు, స్కూలునాటి మిత్రురాండ్ర వద్దకు వెళ్ళి కొన్నాళ్ళు గడిపి రావడానికి ప్రయత్నించింది. కాని అక్కడ గడప లేకపోయింది. అక్కడి సందడికి అలవాటు పడలేక పోయింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/fOD4JampeVU
Embed this episode
NOW PLAYING
ది ట్రాప్ ఎపిసోడ్ 2 | The Trap Episode 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.