ది ట్రాప్ ఎపిసోడ్ 20 | The Trap Episode 20 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 7, 2023 · 21 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 20 | The Trap Episode 20 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 20 రచన : పాండ్రంకి సుబ్రమణి  (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో భువనేశ్వర్ కొలీగ్ రాము, కమలను ఇష్టపడుతున్నట్లు చెబుతాడు. పెళ్లి చూపులు ఏర్పాటవుతాయి. రాము ఇండియాకి తిరిగి వచ్చే షరతు మీద పెళ్ళికి ఒప్పకుంటుంది కమలం. ఇక ది ట్రాప్.. 20 వ భాగం చదవండి… అన్నమాట ప్రకారం రాము అమెరికాలోని తన కంపెనీకి ముందుమాటగా విషయం చెప్పి, పెద్దల సమక్షాన కమలతో నిశ్చితార్థం జరిగిన తరవాత మిగతా విషయాలు సరిచూసుకుని రావడానికి న్యూజెర్సీ వెళ్లిపోయాడు. ప్రొఫెషనల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా అతడి ముందున్న లక్ష్యం ఒక్కటే—తానుగా స్టార్టప్ ని ఆరంభించాలి. లేదా—స్కిల్స్ తో నడపబడుతూన్న భారతీయ స్టార్టప్ తో చేరిపోవాలి. అన్నాళ్ళూ తను సముపార్జించుకున్న అనుభవంతో అలవర్చుకున్న టెక్నికల్ స్కిల్స్ ని పూర్తి స్థాయిలో ఆపరేషన్ కి పెట్టాలి. ఎట్టి పరిస్థితిలోనూ కమల నిరుత్సాహానికి లోను కాకుండా చూసుకోవాలి. వేదమూర్తి కుటుంబానికి తను అన్నివిధాలా తగిన అల్లుడని నిరూపించుకోవాలి. అప్పుడప్పుడు అనుభవాలకన్నా రచించుకున్న పథకాల కన్నా ఉద్వేగాలే కదా మనిషిని ముందుకు నడిపిస్తాయి—నియంత్రిస్తాయి. ఇదే కదా జీవిత సత్యం-- ఇక మరొక ముఖ్యమైన విషయం యేమంటే రాము అలా న్యూజెర్సీ చేరుకున్న మూడు రోజుల తరవాత వాళ్ళకు అనుకూలమైన శుభముహూర్తం చూసి కామేశ్వరరావుకీ వసంతకీ—పరమేశ్వర్ కీ వినోదినికీ అమ్మవారి గుడి ప్రాంగణాన నిశ్చి తార్థం జరిగింది. దాదాపు అంతటా ఊరంతా చెప్పుకునేలా కళ్యాణోత్సవంలా జరిగింది. అప్పుడు మరొక సంఘటన-- అందరూ దాదాపు పూర్తిగా మరచిపోయారనుకున్న పవన్ ప్రేమ వ్యవహారాన్ని తానుగా గుర్తు పెట్టుకుని పరమేశ్వర్ తమ్ముడికి చెప్పాడు. “ఒరేయ్ తమ్ముడూ—నీ విషయమూ ప్రణీత విషయమూ నేను మరచిపోయాననుకునేవురోయ్—“ చిన్నన్నయ్య నోట ఆ మాట విన్నంతనే పవన్ ఎమోషనల్ జెర్కింగ్ కి లోనయాడు. కళ్ళు పెద్దవి చేసుకుని అన్నాడు- “అందరితో బాటు నువ్వు కూడా మమ్మల్ని మరచిపోయావేమోనని భయపడ్డాననుకో— విషయాన్ని యెలా కదపాలో తెలియక తెగ డీలాపడి పోయాననుకో-  చాలా థేంక్సురా అన్నయ్యా-- “ “ఓయ్! అన్నదమ్ముల మధ్య పెద్ద పెద్ద మాటలెందుకురా! కొన్ని విషయాలు బాహాటంగా డప్పులా చప్పుడు చేస్తూ జరగాలి. మరికొన్నేమో గుట్టుగా పట్టుదలతో చాకచక్యంతో జరగాలి. పూనుకున్న పనులు పూర్తి అయేంత వరకూ బయట ఏదీ పొక్కకూడదు. ఇప్పుడు అసలు సంగతి విను- మన కిరాణా షాపుని విస్తరించడానికి కావలసిన యేర్పాట్లు దాదాపు పూర్తయాయి. మనూరి ఫైనాన్స్ కంపెనీ నుండి రెండు మూడు రోజుల్లో లోన్ సాంక్షన్ అవుతుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/7Q8kKF8gsio

Episode metadata supplied by the publisher feed · Published Feb 7, 2023

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 20 | The Trap Episode 20 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 21:08

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 21 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 7, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!