EPISODE · Feb 10, 2023 · 8 MIN
ది ట్రాప్ ఎపిసోడ్ 21 | The Trap Episode 21 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 21 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఏమైనా చేస్తాను. నువ్వు నా భర్తతో నేను లేనప్పుడు నా గదిలో ఎన్నిసార్లు యేకాంతంగా గడిపావో సిసిటీయస్ కెమారాలో బంధించి ఉంచాను. వాటిని బట్టబయలు చేస్తాను. అడల్టరీ సెక్షన్ క్రింద కేను పెడతాను. ఇంకా ఇంకా మరేదైనా చేస్తాను. నలుగురికీ తెలిసేలా వార్త ఫ్లాష్ చేస్తాను. అప్పుడు మందాకిని గతేమవుతుందో ఆలోచించు”. వరూధిని బదులివ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిదానంగా చూస్తూ గొణిగినట్లు అడిగింది- “మరి కోర్టులో కేసు పెడితే నీ భర్త భువనేశ్ కి మాత్రం అఫెక్ట్ కాదా? అడల్టరీలో ఇద్దరికీ భాగ ముంటుంది కదా! ” “ఏదైనా కానియ్యి. నేను ముందే చెప్పాగా ఈ విషయంలో నేను దేనికైనా తెగిస్తానని. చెవులొగ్గి వినడం లేదా! ఇక దీనికి బదులియ్యి- భువనేశ్ నాకు కావలసిన వాడయితే-- నీకు కావలసిన వాడు కాడా— నువ్వత ణ్ణి నగుబాటుకి లోను చేసే సాహసం చేస్తావా-- ” వరూధిని ఊపిరి తీసుకోవడానికి క్షణం పాటు ఆగి అంది-- “నువ్వు నన్ను యెమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ప్రభా! ” “అలాగే అనుకో—నాకేమీ ఆక్షేపణ లేదు. తగిన ఆధారాలు సంపాదించి నాపైన కేసు కూడా పెట్టుకో—’ “మొత్తానికి నువ్వు నా స్నేహితురాలిగా సంభాషించడం లేదు ప్రభా! ” “ఔను. నాకు నువ్వంటే యిష్టం. నీ స్నేహమంటే యిష్టం. కాని దీనికన్నా నాకు నా కుటుంబం ముఖ్యం. నా భర్తకు వంశాంకురం ఉండటం మరీ ముఖ్యం”. వరూధిని కనుబొమలెగరేసి చూస్తూండిపోయింది. తన స్నేహితురాలు తనను దిగ్భంధించడానికి నిర్ణయించు కున్నదన్నది తెలుస్తూనే ఉంది. ఇక యింత దూరం వచ్చి ముంతలో యేముందని అడగడం దేనికి-- “సరే చెప్పు. నీకేమి కావాలి? ” “చెప్తాను. ఇరువురికీ- విన్ విన్ సిట్వేషన్ గా ఉండేలా చెప్తాను. ఐతే ఒక షరతుపైన. అదేమిటన్నట్టు కళ్ళెత్తి చూసింది వరూధిని. “నేను చెప్పినట్టు చేయాలి. అలా చేస్తే మన స్నేహం బంధాలు చిరస్థాయిగా నిలుస్తాయి”. ఆమె తలూపింది. నన్ను చూసి తలూపితే చాలదు. అదిగో అక్కడున్న మూలవిరాట్టు వేపు చూసి ఔనను”. వరూదిని అలాగే చేసింది. అప్పుడు ప్రభావతి వరూధిని చేతిని చేతులోకి తీసుకుంది. “మొదటిది- నువ్వు విదేశాలకు బయల్దేరే ముందు మందాకినిని మాకు అప్పచెప్పి వెళతావు. కొన్నాళ్ళ తరవాత అక్కడెక్కడో నువ్వు బిడ్డను కంటావు. ఆ తరవాత మరి కొన్నాళ్ళ తరవాత ఇక్కడకు వస్తావు. బిడ్డను మాకప్పగిస్తావు” ఈసారి సూటిగా చూసింది వరూధిని. “అప్పగించకపోతే? ” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Ci_bJ8v3PYI
Embed this episode
NOW PLAYING
ది ట్రాప్ ఎపిసోడ్ 21 | The Trap Episode 21 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.