ది ట్రాప్ ఎపిసోడ్ 3 | The Trap Episode 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 8, 2022 · 10 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 3 | The Trap Episode 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

ది ట్రాప్ ఎపిసోడ్ 3 రచన : పాండ్రంకి సుబ్రమణి గత ఎపిసోడ్ లో త్వరగా  వివాహం చేసుకొమ్మని రాముకి సలహా ఇస్తాడు భువనేష్. అంగీకరిస్తాడు రాము. కానీ ఎప్పుడో మాత్రం చెప్పలేనని అంటాడు. భార్య పక్కన ఉన్నా ఆఫీసు విషయాలు ఆలోచిస్తుంటాడు భువనేష్. ది ట్రాప్ ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  ది ట్రాప్ ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.   ఇక ది ట్రాప్. . మూడవ భాగం చదవండి… ఉదయమే కార్పొరేట్ కార్యాలయానికి వెళ్ళిన భువనేష్ సాయంత్రం వరకూ పని రద్దీలోనే ఉండిపోయాడు. “భోజనం పంపించాను. తీసుకున్నారా!” అని అడగడానికి కూడా ప్రభావతికి ఆస్కారం లేకుండా పోయింది. మధ్యాహ్నం ఖాళీ చేయని కేరియర్ యింటికి తీసుకొచ్చిన కారు డ్రైవరుకి అదే కేరియర్ నిచ్చి పంపించేసింది. దీపాలు పెట్టే వేళ దాటింతర్వాత ఇల్లు చేరిన భువనేష్ కి అప్పుడు కూడా అదే పోకడ. మలి స్నానం చేసి రాత్రి భోజనం చేసిన భర్త, అదే రీతిన పెందలకడే మేను వాల్చడం గమనించిన ప్రభావతి, అతణ్ణి కదపకుండానే గుసగుసలు పోయినట్లు అడిగింది- “మళ్ళీ ఏమయిందండీ! అంతలావు టైమింగ్ పాటించ కుండా పని చేస్తే ఆరోగ్యం యేమవుంది? ఎండార్ఫిన్ వంటి సంతోషదాయకమైన హార్మోనులు శరీరంలో పుట్టుకు రావద్దూ! కనీసం కట్టుకున్న పెళ్ళాంతో రెండు మాటలు కలపొద్దూ? “ “ఉష్! రిచార్జ్ చేసుకోనివ్వు. రేపు లీవు వేసాను-ఎందుకో చెప్పుకో—“ “ఇందులో చెప్పుకోవడానికి యేముందండీ! అలసి సొలసి డీలా పడిపోయారు. ఫీవరిష్ గా ఫీలయుంటారు. అందుకే రేపు—“ “ కాదు.  కానే కాదు. నిన్ను మొదటిసారి చూసిన రోజు. నిన్ను యిష్టపడ్డ రోజు. మావాళ్ళూ మీ వాళ్ళూ తాంబూలాలు పుచ్చుకున్నరోజు.” ఆ మాట విన్నంతనే ప్రభావతి ఆనందంతో అరచినంత పని చేసింది. “అరెరే—అదన్న మాట—రేపటి కోసం మూడ్ చెదరిపోకుండా కూడగట్టుకుంటున్నారు—ఆ మాట ముందే చెప్పవచ్చుగా—“ “ఇదొక్కటే కారణం కాదు. నిజంగానే మెంటల్ స్ట్రెయిన్ తో బాగానే అలసిపోయాను. అదంతా రేపు నీతో ఔటింగుకి వచ్చి చెప్తాగా! ఇప్పుడు నన్నొకసారి మనసార గుండెలకు హత్తుకుని అడుగుల చప్పుడు కూడా వినిపించనీయకుండా వెళ్ళిపో” ఆమె అలాగే నవ్వుతూ భువనేష్ ని గుండెలకు హత్తుకుని నుదుట మృదువుగా ముద్దుపెట్టుకుని వెళ్ళిపోయింది... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/LAQzP7c4sf0

Episode metadata supplied by the publisher feed · Published Oct 8, 2022

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 3 | The Trap Episode 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 10:32

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 8, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!