ది ట్రాప్ ఎపిసోడ్ 4 | The Trap Episode 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 15, 2022 · 15 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 4 | The Trap Episode 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 4 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో ఆఫీస్ పని ఒత్తిడిలో భోజనం కూడా సరిగ్గా చెయ్యడు భువనేష్. వేదమూర్తి ఇంటికి, అతని చిన్ననాటి స్నేహితుడు దివాకర్ కూతురితో సహా వస్తాడు. వేదమూర్తి కొడుకు పరమేశ్వర్ గురించి వివరాలు అడుగుతాడు. ఇక ది ట్రాప్. . నాలుగవ భాగం చదవండి… హాలు మధ్య కూర్చుని కాఫీ టీలు పూర్తయిన తరవాత మాటల మధ్యలో సంభాషణల హోరులో దివాకర్ అదను దొరికి నప్పడుడల్లా పరమేశ్వర్ గురించిన ప్రస్తావన తేవడం పెద్దరికంతో బాటు అనుభవ సారమూ పుణికి పుచ్చుకున్న వినాయకానికి మొదటి సారి చిత్రమైన భావ స్రవంతి సోకనే సోకింది; పెద్దలు ఊరకే రారు-అన్న సామెత గుర్తుకి వచ్చి-- అంతేకాక-ఇంట్లోనున్న వాళ్ళ గురించి కాకుండా తమతో కలసి వచ్చిన పెద్దకూతరు వినోదిని గురించి ప్రస్తావిస్తూ-- మరొక వేపు పరమేశ్వర్ గుణగ ణాల గురించి తెలుసుకో వడానికి ప్రయత్నిస్తూ-- ఐనా , పెద్దతరపు వేదమూర్తి దంపతులిద్దరికీ విషయం అంతు పట్టకుండా మిగిలి పోతూంది. యింట్లోవాళ్ళే కాక , దివాకర్ సహితం మొదట్నించీ డాబుసరి దొరబాబులా ఉంటాడని వేదమూర్తి అల్లనల్లన అందరి ముందూ గట్టిగానే చెప్పినట్టు భార్య కామాక్షికి గుర్తు. అలాంటప్పుడు తమ ఆలోచనలో తప్పిదం దొర్లిపోవడం లేదూ! టూకీగా చెప్పాలంటే నక్కెక్కడ నాకలోకమెక్కడ! మాటల రాపిడిలో భార్యా భర్తలిద్దరూ పొరపాటుగా అందని ఆకాశం వేపు చేతులు చాస్తూ ఆలోచిస్తున్నారేమో! వాళ్ళలా పరిపరి విధాల తలపోస్తున్నప్పుడు దివాకర్ బాణంలా సర్రున ప్రశ్నను విసిరాడు-“నువ్వు మా పెద్దమ్మాయి వినోదినిని చూస్తున్నావు కదూ!” ఈసారి వేదమూర్తి నవ్వుతూనే రిటార్ట్ చేసాడు- “ఇక నువ్వు చూపించడానికే ముందోయ్! చూస్తున్నాం కదా— చూసి మాట్లాడుతున్నాం కదా-- ఐనా వినోదినితో బాటు యింట్లోని మిగిలిన అమ్మాయిల్ని కూడా తీసుకొచ్చి ఉంటే అందరమూ చూసుండే వాళ్ళం కదా! మీ ఆవిణ్ణి తీసుకొచ్చి ఉంటే మరీ బాగున్ను దివాకర్-- వినోదినిని దీవించినట్లే మా అమ్మానాన్నా వాళ్ళను కూడా దివ్యంగా ఆశీర్వదించి ఉండే వారు కదా! ” “ఏం—నువ్వూ మా చెల్లీ నా పెద్దకూతుర్ని ఇప్పుడు ఆశీర్వదించరా! ” “అవేం మాటల్రా దివాకర్! అంత పెద్దగా యెదిగిపోయావు గాని చిన్నతనపు కొంటెతనం నీలో కొంచెం కూడా తగ్గలేదురా! అదలా విడిచి పెట్టు గాని.. ఇంతకీ వినోదినిని ఎంతవరకు చదువుకుంది? ఫారిన్ కి వెళ్ళి వచ్చినట్టుంది. ఇంకా ఎగ్జామ్స్ ఒత్తిడిలోనే ఉందా?”.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/2YpE4UeQhWA

Episode metadata supplied by the publisher feed · Published Oct 15, 2022

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 4 | The Trap Episode 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 15:11

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 15, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!