ది ట్రాప్ ఎపిసోడ్ 5 | The Trap Episode 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 22, 2022 · 13 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 5 | The Trap Episode 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 5 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఐదవ భాగం గత ఎపిసోడ్ లో దివాకర్ వెళ్ళాక విశ్వం కూడా వేదమూర్తి ఇంటికి వస్తాడు. అతను కూడా పరమేశ్వర్ గురించి ఆరా తీయడంతో ఆశ్చర్యపోతాడు వేదమూర్తి. వెళ్లే ముందు వేదమూర్తితో రహస్యంగా ఏదో చెబుతాడు విశ్వం. ఇక ది ట్రాప్. . ఐదవ భాగం చదవండి… అనుకున్న ప్రకారం పనావిణ్ణి ఆ రోజుంతా యింట్లోనే ఉండమని చెప్పి భువనేశ్, ప్రభావతి యిద్దరూ కారుని యింట్లోనే విడిచి, ఆటోలో తిన్నగా ఉజ్జయినీ దేవి గుడికి వెళ్లారు. సహస్రనామ అర్చన, లక్ష కుంకుమార్చన ముగించి గుడి వెలుపల ఉన్న బిచ్చగాండ్రకు వరసగా చిల్లర డబ్బులు అందించారు. రాబోయే పుణ్యదినాన భిక్షువులకు, సాధువులకు ఆలయ చావడిలో భోజన సదుపాయం సమకూర్చడానికి గుడి ఇ ఓ గారికి విరాళం యిచ్చి రిసీప్టు తీసుకుని, రిజష్టరులో నమోదు చేయించుకుని, రోడ్డుపైకి వచ్చారు. నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ గుడి ప్రసాదం స్వీకరించి  దగ్గర్లో ఉన్న కాఫీ పాయింటు వద్ద కాఫీ తాగి, ఇద్దరూ మరొక ఆటోరిక్షా యెక్కి సనత్ నగర్ పార్కు చేరుకున్నారు. ప్రభావతికి ఐస్ క్రీమ్ కోన్ అందిచ్చి తను కూడా ఒకటి తీసుకుని చెట్టు చెప్టాపైన కూర్చున్నాడు భువనేశ్. ప్రభావతి మాత్రం ఐస్ క్రీము తినకుండా అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది- “ఉఁ ఇప్పుడు చెప్పండి- ఏం జరిగిందో! ఇంత వరకూ నేనెందుకు నోరుమెదప కుండా ఊరుకున్నానంటే -- గుడికెళ్ళిన మంచి మూడ్ మనిద్దరికీ చెదరకూడదనే—” అతడు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు- “ఎందుకలా అడుగుతున్నా వు? నాకేమీ జరగందే ఏదో జరిగిందని నేనెలా చెప్పను!” “కాదు. మీకేదో జరిగింది. ఇష్టపడి మిమ్మల్ని కట్టుకున్నదానిని. నాకు మీకేదో జరిగుంటుందని తెలవదా--” “అసలు నాకేదో జరిగుంటుందని నువ్వెందుకనుకుంటున్నావు ప్రభా?” “చెప్పేదా—సూటిగా అడిగేదా! ” ఉఁ అన్నాడతను మొదట చేతిలోని ఐస్ క్రీము తినడం ముగించమని సంజ్ఞ చేస్తూ-- ఆమె మరేమీ అనకుండా ఐస్ క్రీము తినడం పూర్తి చేసి చేతి గుడ్డతో పెదవులు తుడుచుకుని అడిగింది-“ఆర్ యు రెడీ! ”.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/rpGk_bTMs70

Episode metadata supplied by the publisher feed · Published Oct 22, 2022

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 5 | The Trap Episode 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 13:17

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 22, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!