EPISODE · Oct 28, 2022 · 11 MIN
ది ట్రాప్ ఎపిసోడ్ 6 | The Trap Episode 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 6 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఆరవ భాగం గత ఎపిసోడ్ లో భువనేష్, ప్రభావతిలు ఉజ్జయినీ దేవి గుడికి వెళ్లారు. దర్శనం పూర్తి అయ్యాక భువనేశ్ ఎందుకు దూరంగా ఉంటున్నాడో ఆరా తీసింది ప్రభావతి. పని ఒత్తిడే కారణమని చెబుతాడు అతను. వాళ్లకు వరూధిని, ఆమె కూతురు పరిచయమవుతారు. ఇక ది ట్రాప్. . ఆరవ భాగం చదవండి… “ఉఁ తీసుకోండి. మీకోసం స్పెషల్ గా చేసి తీసుకువచ్చాను. త్వరగా భోజనాలు చేసి నిద్రపోవాలి, మరచిపోకండి”. ఆ ఒక్కమాటతో అతడిలోని నకారాత్మక మూడ్ పటా పంచలయిపోయింది. పనిగత్తె అలికిడి అక్కడుందేమోనని చూపులతో పర్యవేక్షించి కాఫీ కప్పుల్ని టీపాయ్ పైన ఉంచి భార్యను రెండు చేతుల్లోకి తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ; ఆరోజు చాలా బాగున్నావని కితాబు యిస్తూ- “నిజంగా అంత బాగున్నానండీ!" అంటూ ఆమె మరింత గాఢంగా తమకంతో అతడి మెడను పెనవేసుకుని ముద్దుల వర్షం కురిపించింది. అప్పుడు భాగ్యం వస్తూన్న అడుగుల చప్పుడు విని ఇద్దరూ తొలగిపోయారు, కాఫీ కప్పుల్ని చేతుల్లోకి తీసుకుంటూ- ఇద్దరు కాఫీలు తాగిన తరవాత, భాగ్యం వచ్చి ఖాళీ కప్పుల్ని తీసుకెళ్ళిపోయిన తరవాత ప్రభావతి ఆశ నిండిన కళ్ళతో చూస్తూ అడిగింది- “ఆ పాపను బాగా చూసారండీ!" ఈసారి అతడిలో విసుగుదల పుట్టు న బయటికి వచ్చింది. "అబ్బ! మళ్ళీ వాళ్ళ సంగతేనా? ఇకపైన కూడా టాపిక్ మార్చవేంటి? ” “తప్పకుండా మార్చి వేస్తాను. మీ మూడ్ ని రెట్టింపుగా ఉద్దీపింప చేస్తాను-- ఐ-ప్రామిస్. దీనికి మాత్రమే మీరు బదులిస్తే—“ అతడు నోరుమెదపకుండానే తలాడించాడు అడగమన్నట్టు. "ఆ అమ్మాయి ముఖంలోకి నిదానంగా చూసారా!" అతడు ప్రభావతి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడు- “ఏ అమ్మాయి? ఆ చిన్న పాప గురించి అడుగుతున్నావా లేక ఆ పాప తల్లి గురించి అడుగుతున్నావా--” "ఏమయిందండీ మీకు? ఈ డిపిసీ ప్రమోషన్ల గొడవలో పడి మీ బుర్ర బాగా చెదరిపోయినట్లుంది. ముందు దాని సంగతి మరచిపొండీ, కార్పొరేట్ వ్యవస్థని ప్రక్కన పెట్టండి. ప్రమోషన్ వచ్చినప్పుడు వస్తుంది. రానప్పు డు రాదు. దాని కోసం కలత చెందుతూ గజిబజిగా ఆలోచనల్ని పెంచుకోకండి. బిడ్డ తల్లి భర్తను కోల్పోయిన వితంతు స్త్రీని అమ్మాయంటానా! నేనిప్పుడు ఆవిడ కూతురు మందాకిని గురించే మాట్లాడేది—ఇప్పుడు చెప్పండి. సరిగ్గా చెప్పండి. ఆ పిల్ల యెలా ఉంది?”... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/P4C2X1RXX-w
Embed this episode
NOW PLAYING
ది ట్రాప్ ఎపిసోడ్ 6 | The Trap Episode 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.