EPISODE · Nov 4, 2022 · 11 MIN
ది ట్రాప్ ఎపిసోడ్ 7 | The Trap Episode 7 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 7 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఏడవ భాగం గత ఎపిసోడ్ లో భర్త ముందు మందాకిని ప్రస్తావన తెస్తుంది ప్రభావతి. మందాకినికి చనిపోయిన తమ కూతురు పోలికలు ఉన్న విషయం అతనితో చెబుతుంది. మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చిన పరమేశ్వర్ ని ప్రశ్నలతో చుట్టు ముడతారు అతని కుటుంబ సభ్యులు. ఇక ది ట్రాప్.. ఏడవ భాగం చదవండి… చెప్పడం పూర్తయిన తరవాత చివరి మలుపుగా కామేశ్వరరావు మరొకటి జోడించాడు. “బాగా గుర్తుంచుకో! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడున్నట్టు మనం కాలమంతా పడుండలేం. పడుండ కూడదు. సరుకులు హోల్ సేల్ మార్కెట్టు నుండి తెచ్చుకోవడానికి మనం చిన్నపాటి జీపునో- టేంపో వంటి బండో తెచ్చుకోవడానికి అవస్థ పడుతున్నాం. ఔనా? ” పరమేశ్వర్ తలూపాడు. “ఇప్పుడు దివాకర్ అంకుల్ గారి ఆఫర్ యేమిటో తెలుసా-- మనతో పార్టనర్ గా చేరి మనకు మిగిలిపోయిన స్థలంలో మినీ సూపర్ మార్టెట్ గా విస్తరించడానికి ముందుకు వచ్చాడు”. పరమేశ్వర్ ముఖం అదోలా పెట్టాడు- ”అది సరేరా అన్నయ్యా! వినడానికి అప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలా ఆసక్తికరంగానే ఉంది. మరి— ఇదంతా నాకెందుకు చెప్తు న్నట్టు—” ఈసారి కమల సంభాషణలోకి జోరుగా వచ్చింది- “అవేం మాటల్రా అన్నయ్యా— రామాయణమంతా విని రాముడికి సీత యేమవుతుందని అడిగినట్లు! నువ్వు గాని, అంకుల్ గారి పెద్ద కూతురు వినోదినిని చేసుకుంటానంటే మన కిరాణా దుకాణం మాత్రమే విస్తరించదు. నిన్ను ఆయన ఫార్మాకంపెనీ ఇన్నర్ సర్కిల్ లోకి తీసుకుంటాడు. ప్రొఫెషనల్ ట్రైనింగు కూడా యిచ్చి నిన్ను నిచ్చెనెలా మెట్టుపైన మెట్టుగా పైకి తీసుకెళ్ళి పోతారు"... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JM-m6dLuJPI
Embed this episode
NOW PLAYING
ది ట్రాప్ ఎపిసోడ్ 7 | The Trap Episode 7 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.