ది ట్రాప్ ఎపిసోడ్ 8 | The Trap Episode 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 11, 2022 · 16 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 8 | The Trap Episode 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 8 రచన : పాండ్రంకి సుబ్రమణి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఎనిమిదవ భాగం గత ఎపిసోడ్ లో దివాకర్ ఉద్దేశమేమిటో వివరిస్తాడు కామేశ్వర్. పరమేశ్వర్ అభిప్రాయం అడుగుతాడు వేదమూర్తి. వరూధిని, మందాకినితో కలిసి భువనేష్ ఇంటికి వస్తుంది. ఇక ది ట్రాప్.. ఎనిమిదవ భాగం చదవండి… ఈసారి మందాకిని భువనేష్ చేయి పట్టుకుని లాగింది. “ఔను అంకుల్. మీరూ మాతో రండి. మీరు గాని వస్తే యెంత జాలీగా ఉంటుందని —ప్లీజ్ అంకుల్! ” అప్పుడతడు బ్రతిమిలాడే ధోరణితో మందాకిని రెండు చేతులూ అందుకుని యేదో చెప్పబోయాడు. ప్రభావతి భర్తకు అడ్డు తగిలింది- “ప్రమోషన్లూ పోస్టింగుల గొడవలో పడి మీరు యిచ్చిన మాటను తప్పుతున్నారు మిస్టర్ భువనేష్”. నేనా అన్నట్టు ఆశ్చర్యంగా చూసాడు సతీమణి వేపు. “ఔను. మీరే! మన ప్లాను ప్రకారం మీరు వరూధిని గారి యింటి వద్ద కదూ దిగబెట్టి వెళ్తానన్నారూ? దానికి చిన్నపాటి సవరణతో మమ్మల్ని గుడిలో దిగబట్టి అటు ఆఫీసుకి వెళ్ళిపోదురు గాని- ఈజిటే ఓకే! ” ఆ మాటతో అతడిక బదులివ్వకుండా వెనక్కి తగ్గి, పనిగత్తె వేపు చూసాడు కాఫీ కప్పులు త్వరగా తీసుకు రమ్మనమని. “ఇదిగో బాబూ! పది నిమిషాలలో తేనూ—“ అంటూ వంట గది వేపు నడచింది. అతడలా భాగ్యానికి చూపులతో అదేశం జారీ చేస్తూ అసంకల్పితంగా వరూధిని వేపు చూసాడు. ఆమె అతణ్ణే నవ్వుతూ చూస్తూంది. అతడికప్పుడు చప్పున ప్రభావతి వరూధిని గురించి అన్న మాటలు గుర్తుకి వచ్చాయి. కళగా నిండారోగ్యంతో పొడవుగా ఉన్నమాట వాస్తవమేనేమో కాని, మధుబాలలా ఉందీ— ఏమో! అతడు తేల్చుకోలేక పోయాడు. మధుబాలా యేమో భారతీయ ముస్లిమ్ స్త్రీ— వదూధినీ యేమో తెలుగు హైందవ స్త్రీ-- ఇద్దరూ బాగానే ఉంటారు. కాని— అంతర్నేత్రంతో పోల్చి చూడటమే కష్టం. వీళ్ళద్దరి మధ్యా తన భార్య ప్రభావతిని నిల్చుండబెడితే—సెంట్ ఆఫ్ ది వుమెన్, షేఫ్ ఆఫ్-ది-విమన్ వేరు వేరు కోణాలలోనే ఉంటుంది. దగ్గరగా కొందరు ఒక విధంగా-దూరపు కోణం నుంచి చూస్తే మరొకరు మరొక విధంగా మొగ్గయి విరబోస్తారేమో-- అతడలా ఆలోచించుకుంటూ కాఫీకప్పు చేతికి తగలగానే తట్టున ముఖం తిప్పుకుని చేతిలోకి అందుకుని కాఫీ చప్పరించ సాగాడు. మరి కాసేపటికి కాఫీలు తాగడం పూర్తయిన తరవాత మాటలు కొనసాగించాలి కాబట్టి భువనేష్ అడిగాడు- “కాఫీ బాగుందా మైడియర్ యంగ్ లేడీ? ” మందాకిని వెంటనే బదులిచ్చింది- “నేను కాఫీ తాగలేదు అంకుల్! భాగ్యం అత్త నాకు హార్లిక్స్ కలిపి యిచ్చింది”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JnmhSkLTKHc

Episode metadata supplied by the publisher feed · Published Nov 11, 2022

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 8 | The Trap Episode 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 16:41

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 11, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!