ది ట్రాప్ ఎపిసోడ్ 9 | The Trap Episode 9 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 20, 2022 · 13 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 9 | The Trap Episode 9 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 9 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' తొమ్మిదవ భాగం గత ఎపిసోడ్ లో గుడి దగ్గర భువనేష్ నుదుట కుంకుమ పెడుతుంది వరూధిని. ప్రభావతి ఆ విషయం గమనించదు. మందాకినీ కోసం కొన్న గిఫ్ట్ లు ఇచ్చి రమ్మని భువనేష్ ని వరూధిని ఇంటికి పంపుతుంది ప్రభావతి. పరమేశ్వర్ కి ఉద్యోగం రావడంతో ఇంటికి అవసరమైన చాలా వస్తువులు కొంటాడు. ఇక ది ట్రాప్.. తొమ్మిదవ భాగం చదవండి… నగరం నలుమూలలా ఉన్న ఆలయాలలో కార్తీక పూజలు జరుగుతున్నాయి. కార్తీక మాస వేడుకలు శుక్రవారం నుండి కోలాహలంగా ఆరంభమయ్యాయి. ఊరంతటా ఆధ్యాత్మిక శోభ అలుముకుంది. ఉదయమే ఆలయాల స్థానాచార్యులందరూ ప్రధాన అర్చకుల ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావి చెట్టు దగ్గర ముత్తయిదువులూ కన్యలూ కలసి కార్తీక దీపాలు వెలిగించారు. మరి కొద్ది రోజుల్లో శ్రీకృష్ణ తులసీ కళ్యాణం. ప్రభావతి భర్తతో బాటు బయల్దేరింది. పవిత్రోత్సవాలు కావున భాగ్యం కూడా వాళ్ళ వెంట వెళ్ళింది. అనంత పద్మనాభ స్వామికి మహాభిషేకం పూర్తయిన తరవాత ప్రసాదాలు అంది పుచ్చుకుని ఇల్లు చేరారు. ఇల్లు చేరిన తరవాత భర్త పరాకుగా ఉండటం గమనించిన ప్రభావతి కాఫీ కప్పు అందిస్తూ అడిగింది- “ఏమయింది అలా పరాకుగా పరధ్యానంగా కనిపిస్తున్నారు! ఏమయిందో కట్టుకున్న దానికి చెప్తే కదా మనసు తేలిక పడుతుంది. ఉఁ చెప్పండి” “నా తరపున చెప్పడానికి యేమీ లేదు. నిన్ను చూస్తుంటే, నావేపు చూపులు సారించే విధం చూస్తుంటే, యేదో చెప్పాలనుకుని తర్జన పడ్తున్నట్టు కనిపిస్తున్నావు” “ఉఁ చెప్పాలనే అనుకుంటున్నాను. మరి, మీ మూడ్ యెలాగుందోనని. మీ డిపీసీ వ్యవహారం పూర్తవలేదుగా!” “దానికేముంది? నీ గోడు నువ్వు చెప్పు. ఏదైనా నోము నోచాలనుకుంటున్నావా! వ్రతాలు పూనుకోవాలను కుంటున్నావా! వాటిలో నన్ను కలుపు కోవాలనుకుంటున్నావా?” “ఊఁహుఁ! అటువంటివి ఇప్పుడు ఉండవు, ఆలయ దర్శనాలు తప్ప— సుబ్రహ్మణ్యస్వామికి మహాపూజ ఒకటి ఉంది- అంతే--” “నువ్వింకా మేటర్ కి రావడం లేదు ప్రభా.. స్ట్రెయిట్ గా విషయానికి రా—’... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/8_N32Mcp5dI

Episode metadata supplied by the publisher feed · Published Nov 20, 2022

Embed this episode

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 9 | The Trap Episode 9 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 13:11

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 20, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!