EPISODE · Jun 29, 2023 · 17 MIN
దోషి ఎవరు పార్ట్ 2 | Doshi Evaru Part 2 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Doshi Evaru Part 2/3' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha 'దోషి ఎవరు పార్ట్ 2/3' తెలుగు పెద్ద కథ రచన : పూడిపెద్ది ఉగాది వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: సుమ, సుధాకర్ భార్యాభర్తలు. ఇద్దరూ ఉద్యోగస్తులు. కూతురు లాస్యని చూసుకోవడానికి పనిమనిషి కావాలని స్నేహితురాలు మాధవిని అడుగుతుంది. అర్చన అనే అమ్మాయిని పనికి పంపిస్తుంది మాధవి. కొద్ది రోజులకు సుమ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. పొలిసు విచారణ జరుగుతూ ఉంది. ఇక దోషి ఎవరు పెద్దకథ రెండవ భాగం చదవండి.. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంటే, వంట గదిలో ఉన్న మాధవి వచ్చి వ్యూ మిర్రర్ లోంచి చూసింది, అర్చన వాళ్ళ అమ్మ ఉంది. తలుపు తీసీ తీయగానే, ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయింది, తన కూతుర్ని రక్షించమని అంటూ. “అయ్యో లేమ్మా, కూర్చో ముందు. ఏమి జరిగింది చెప్పు” అంటూ పనిమనిషిని కేకేసింది నీళ్లు తెమ్మని. “మా అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేసేరమ్మా, మీరే ఎలాగైనా కాపాడాలి తల్లీ” అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తోంది. గోపాల్ కూడా హాల్ లోకి వచ్చాడు, మాధవి ఆలోచిస్తోంది. వారం క్రితమే సుమ ఫోన్ లో మాట్లాడి, పోలీసులకి ఎలాంటి క్లూ దొరకలేదని చెప్పింది. ఇక ఆశ వదులుకోడమేనే అని దిగులుగా మాట్లాడింది. అయితే పోలీసు కుక్క, హాల్ కి అటాచ్ అయి ఉన్న బాల్కనీ వరకు వెళ్లి ఆగింది, అని పోలీసులు చెప్పేరని, వారికీ ఈ కేసు అంతు చిక్కడం లేదని అన్నారట. ఏసీ సర్వీస్ ఇంజనీర్ ని, వాళ్ళ వాచ్మాన్ ని, వాళ్ళింట్లో పాచి పని చేసే పనావిడని కూడా ప్రశ్నించేరుట. మెయిన్ ఫోకస్ ఏసీ సర్వీస్ ఇంజనీర్ పైన పెట్టేరట. కానీ అతను చెప్పే మాటల్లో నిజాయితీ ఉంది, పైగా అతని కి మంచి రికార్డు ఉంది అతని ఆఫీస్ లో అన్నారట. చూడ్డమే తప్ప ఏమి చేయలేక పోతున్నామే.. ఇదంతా మా ఖర్మ” అంది. నైరాశ్యం శాశ్వత పీట వేసేసుకుంది సుమ మనసులో. బెడ్రూ మ్ లోకి వెళ్లి, సుమ కి ఫోన్ చేసి అర్చన వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పి, “సడన్ గా ఏమైయింది, పోలీసులు అర్చనని ఎందుకు అరెస్ట్ చేసేరు?” అని అడిగింది మాధవి. “ఏమోనే, అన్ని కోణాల్లో అనుమానితులందరిని విచారించడం అయిపోయిందిట, అయితే, వారి అనుమానం నివృత్తి అయిపోయిందిట. కేసు వివరాలు అన్ని క్షుణ్ణం గా పరిశీలించాక, అర్చన ని ప్రధాన దోషి గా పరిగణిస్తూ, ఫైనల్ రిపోర్ట్ తయారు చేయమని, సి ఐ గారుఆదేశించారట..” చెప్పడం అయిపోయిందో లేక అలిసిన గొంతు విశ్రాంతి కోరుకుందో? “ఇప్పుడెలాగే, పాపం ఆ పిల్ల అసలే చాల సున్నిత మనస్కురాలు, పైగా భయస్తురాలు. నీకేమనిపిస్తోందే, అర్చన ఈ పని కి ఎవరికైనా సహకరించిందంటావా?..” సుమ ఉద్దేశ్యం తెలుసుకుంటే, ఈ విషయం లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచించొచ్చు.. మాధవి పరి పరి విధాలా ఆలోచిస్తోంది. సుమకి అర్చన మీద అనుమానం లేకపోతే, ఇంక పోయిన నగలు మనవి కావు అనుకుని గుండె రాయి చేసుకుంటుందనుకుంటే, అసలు తనే కంప్లైంట్ ఉపసంహరించుకుంటే, ఏ గొడవ ఉండదు కదా! ఇదీ మాధవి మనోగతం. మాధవికైతే, అర్చన నిర్దోషి అని అనిపిస్తోంది. వాళ్ళొచ్చిన కుటుంబ నేపధ్యం అలాంటిది కాదు, అందరు కష్టపడి పని చేసి, నిజాయితీ గా జీవించాలనుకునే వారిలానే ఉన్నారు. అన్నమంతా పట్టి చూడాలా, ఒక మెతుకు చుస్తే చాలదా ? “ఏమోనే! నేను ఎటూ తేల్చుకోలేని స్థితి లో ఉన్నానే, మా జీవితాల్లో ఆనందమనేది కాగడా పెట్టి వెతికినా, కనిపించడం లేదే. అయితే, అర్చన ని తీసేయాలనే ఆలోచన చాలా సార్లు వచ్చింది,> కానీ సి ఐ గారు చెప్పేరు, ఫైనల్ రిపోర్ట్ పంపేవరకు, తనని పంపేయకండి అని, అందుకే ఆగాము”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/68ZNMo2G_jY
Embed this episode
NOW PLAYING
దోషి ఎవరు పార్ట్ 2 | Doshi Evaru Part 2 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.