EPISODE · May 17, 2023 · 11 MIN
దూరం కావాలి | Duram Kavali | Telugu Short Story | Kalanos | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దూరం కావాలి రచన: కాలనోస్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అదేంట్రా ఊరు చివర ఇల్లు తీస్కుంటున్నావు మళ్లీ?” అని నా మిత్రుడు సురేష్ అడగ్గానే నేను ఒక్కసారిగా గతం లోకి వెళ్లిపోయాను. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రిందట నేను ఓ స్థలం తీసుకున్నప్పుడు కూడా వాడిదే మాటన్నాడు. హైదరాబాద్ లో ఇప్పుడున్నంత కాలుష్యం లేకపోయినా, కాలుష్యం బాగా పెరిగిపోయింది అని అనుకునే రోజులవి. నా పిల్లలు నాకు లాగా కాకుండా సొంతింట్లో పెరగాలని నేను, నా భార్య కలిసి ఇళ్లు వెదకడం మొదలుపెట్టాం.ఇల్లు బాగుంటే ధర మరీ ఎక్కువుండేది, ధర బాగుంటే ఇల్లు బాగుండేది కాదు. ఇదంతా కాదు, ఓ స్థలం కొని మనమే మనకి కావాల్సినట్టుగా కట్టుకుందాం అని అనుకున్నాము. ఓ మధ్య తరగతి కుటుంబానికి నగరం లో అయితే స్థలం దొరకడం కష్టమే. మాకు కూడా అంతే!మాకు అనుకూలమైన ధరకి ఊరు చివర అప్పుడప్పుడే స్థాపిస్తున్న కాలని లో మాకో స్థలం దొరికింది. స్థలం దొరికిన ఆనందం లో కొనే ముందర సురేష్ కి చూపిద్దాం అని వాడిని అక్కడికి తీసుకువెళ్ళాను. ఓ చిన్న విషయం వాడికి చెప్పడం మరిచిపోయినట్టే మీకు కూడా చెప్పడం మరిచిపోయాను – ఆ కాలని కి వెళ్ళే దారి. కాలని చేరుకోవాలంటే ముందుగా ఓ అడవి దాటాలి, దాని తర్వాత కొన్ని పొలాలు దాటాలి, అప్పుడు ఓ కొండ లాంటి రోడ్డు లేదా రోడ్డు లాంటి కొండ కనిపిస్తుంది. అది ఎక్కగానే మా కాలని గేటు కనిపిస్తుంది. కాలని లోపలికి అడుగు పెట్టాకా ఇంకో కొండ లాంటి రోడ్డు ఒకటి కనిపిస్తుంది, అది ఎక్కగానే కుడి వైపుకి మా స్థలం కనిపిస్తుంది.అక్కడికి చేరుకోగానే వాడు నా వైపు జాలి గా చూసాడు. “ఒరేయ్! తక్కువకి దొరికిందని టెంప్ట్ అయిపోకు. మనమింకా మంచి ఇల్లు చూద్దాం.” “మరీ అంత తక్కువకి కూడా దొరకలేదులే. నచ్చే కొంటున్నాను.” అని జవాబిచ్చాను. “స్థలం కొంటే ఆత్మలు ఫ్రీ అని ఆఫర్ ఏమైనా ఇచ్చాడా? కాలని లో తిప్పికొడితే పదిళ్లు కూడా లేవు. పొద్దున్న పూటే భయంకరం గా వుంది. ఇంక రాత్రిళ్లు ఎలా ఉంటాయో?”“ప్రస్తుతానికి పదే ఇళ్లు ఉన్నాయి. ఎప్పటికీ ఇలాగే ఉంటుందేంటి?” “ఇక్కడ బుద్ధున్నవాడేవ్వడు ఇల్లు తీసుకోడు.”వాడలాంటి వంకలు పెడతాడని నాకు ముందే తెలుసు. అందుకనే వాడి పెట్టే ప్రతి వంక కి నా దగ్గర జవాబు రేడీ చేసి పెట్టుకున్నాను.“పిల్లల స్కూలు?” “నమ్మకస్తుడైన ఆటో వాడున్నాడు. అయిదారేళ్లుగా పిల్లల్ని అతనే స్కూల్ దగ్గర దిగిపెట్టి తీస్కొస్తున్నాడు.” “మరీ మీ ఆఫీసులు?” “ఒరేయ్. నువ్వింకా ఎడ్లబండి కాలం లోనే ఉన్నావురా. ఇదంతా ఆటోమొబైల్ జమానా – దూరం అనే ఆలోచనలు ఇక్కడ నడవవు, కార్లూ, బైక్లూ మాత్రమే నడుస్తాయి.” “అది సరే! నువ్విక్కడ ఇల్లు కట్టుకుంటే మనం నెలకోసారైనా కలవలేము రా!” అని వాడు విచారించాడు. “ఇప్పుడు మాత్రం నెలకోసారి కలుస్తున్నామేమిటి?” అని తిరిగి వాడిని ప్రశ్నించడం తో వాడు మునిగిపోవాలనుకునే వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడని చెప్పి ఊరుకున్నాడు. మొత్తానికి దాచుకున్న డబ్బులతో స్థలం కొని లోన్ తీసుకొని మరీ అక్కడ ఇల్లు కూడా కట్టించుకున్నాము. గృహ ప్రవేశానికి వచ్చిన వారంతా సురేష్ చెప్పిన మాటలను నాకు మళ్లీ చెపారు. “ఇల్లు చాలా బాగుంది. కానీ మరీ దూరంగా ఉంది. రావడానికే గంట పైన పట్టింది. ఇంక పిల్లలు రోజు స్కూల్ కి ఎలా వెడతారు? నువ్వు ఆఫీసు కి ఎలా వెడతావు?” అందరూ అలా భయపెట్టేసరికి నేను ఓ సారి కాలని లో ఉంటున్న వారందరిని ఇక్కడ ఎలా ఉంటుందో అడుగుదామనుకున్నా. వారందరూ చెప్పింది ఒక్కటే – దూరం కానీ, చాలా బాగుంటుంది ఇక్కడ. వారి హామీ తో ధైర్యం గా మా కొత్తింటికి వచ్చాము. వచ్చిన నెల రోజుల్లో ఆ పది ఇళ్లల్లో వున్న వారితో మా పరిచయాలు బాగా పెరిగాయి. వాళ్ల పిల్లలు, మా పిల్లలు మంచి ఫ్రెండ్స్ అయిపోయి రోజూ ఆడుకునేవారు కూడా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/zFk9sqqHYkk
Embed this episode
NOW PLAYING
దూరం కావాలి | Duram Kavali | Telugu Short Story | Kalanos | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.