ఏ దారెటు పోతుందో | Ee Daretu Pothundo | Telugu short Story | Indira Rao Shabnavis | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 19, 2022 · 24 MIN

ఏ దారెటు పోతుందో | Ee Daretu Pothundo | Telugu short Story | Indira Rao Shabnavis | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఏ దారెటు పోతుందో రచన: ఇందిరా రావు షబ్నవీస్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అమ్మా!! అమ్మా!!” “ఇంద ఈ రొట్టె తిను” అని బలవంతంగా ఎవరో నోట్లో చిన్న రొట్టెముక్క పెట్టారు. కళ్ళు తెరిచే ఓపిక కూడా లేకపోయింది వర్ధనికి.  ఆ చిన్న ముక్క నాలికకి తగలగానే మరచిపోయిన ఆకలి, రుచి ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి.  కళ్ళు మూసుకునే ఆ పెట్టే చెయ్యి ఎవరిదో చూడకుండానే ఆవురావురుమని గబగబా తింది. అంత హడావిడిగా తినడంలో గొంతులో ముక్క అడ్డుకొని ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. “అమ్మా! ఇదిగో నీళ్లు తాగు” అని రెండు చుక్కలు నోట్లో పడ్డాక నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది తన ప్రాణం నిలిపింది ఎవరు అన్నట్టుగా. ఒక పది, పన్నెండేళ్ల అమ్మాయి ఉన్నంతలో కొంచెం శుభ్రమైన బట్టలు వేసుకొని ఉంది.. పిల్లలో బీదరికం ఉట్టిపడుతోంది.  కానీ కళ్ళల్లో ప్రేమ, జాలి కనబడుతున్నాయి.. తినడం అపి, చుట్టూ తిరిగి చూస్తూ “ఎవరమ్మా నువ్వు?” అంది ఓపిక తెచ్చుకుంటూ వర్ధని. “ముందు నువ్వెవరవో చెప్పమ్మా.  ఇక్కడ రెండు రోజుల నుండి పడి ఉంటే చూసి మా నాయన టీ, రొట్టె ఇవ్వమంటే వచ్చాను.. ఏ ఊరు మీది?” అంది ఆ అమ్మాయి. “తానెవరో? ఇక్కడికి ఎందుకొచ్చిందో?” వెంటనే గుర్తు రాలేదు వర్ధనికి. “ఇదే వూరు?” అంది. “తిరుపతి” అంది ఆ అమ్మాయి. ‘తిరుపతా? తను ఇక్కడికి ఎలా వచ్చింది?’ కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. “తిరుపతి.. తిరుపతి... తనది కాకినాడ కాదూ!! ఇక్కడ... అన్నట్టు అవును.. వాడేడి?”  మళ్ళీ చుట్టూ చూసింది. “వాడేడీ?” అంది వెతుకుతూ. “ఎవరు? ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరు లేరు. రెండు దినాలుగా పండుకొని వుంటివి.  ప్రాణం ఉందో లేదో కూడా తెలవలె.  మా నాయన వచ్చి చూసి ఇగో ఈ టీ తాపించమంటే వచ్చిన” అంది అమ్మాయి మళ్ళీ. తను, వాడు తిరుపతి రావడం, దైవ దర్శనం చేసుకోవడం, హోటల్ లో టిఫిన్ తింటూ “ఫోన్ వచ్చిందని ఇప్పుడే మాట్లాడి వస్తాను ఇక్కడే వుండు” అని చెప్పిన కొడుకు ఎంతకీ రాకపోవడం.. అన్నీ గుర్తుకు వచ్చాయి వరసగా. ‘కావాలనే వదిలి వెళ్లాడన్న మాట తనని? ఇలా వదిలించుకున్నాడా?  ఇంకే దారి దొరకలేదా తనని వదిలించుకోవడానికి?  ఊరెళ్ళి ఏమని చెప్పాడు అందరికి?’.. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే వర్ధనికి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/i80TmnCUOkc

Episode metadata supplied by the publisher feed · Published Dec 19, 2022

Embed this episode

NOW PLAYING

ఏ దారెటు పోతుందో | Ee Daretu Pothundo | Telugu short Story | Indira Rao Shabnavis | manatelugukathalu.com

0:00 24:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 24 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 19, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!