EPISODE · Mar 1, 2023 · 9 MIN
ఏం మిగిలింది | Em Migilindi | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఏం మిగిలింది రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “యిద్దరు కొడుకులూ ఇంజనీరింగ్ చదివి, అమెరికా వెళ్లిపోయారు. యిప్పుడు మనమిద్దరం మిగిలిపోయాము. ఒకరికి ఒకరు తోడుగా వుండాలిసింది పోయి మీరు నన్ను తిట్టా, నేను మిమ్మల్ని నాలుగు మాటలు అనటం ఎందుకండీ? వున్నన్నాళ్లు సుఖంగా వుండక..” అంది సులోచన. “నువ్వేగా మీ అన్నగారి కొడుకు అమెరికా వెళ్ళి బోలెడు డబ్బు సంపాదించి మీ అన్నయ్య కి పంపుతున్నాడని అన్నావు. మన పిల్లలని కూడా అమెరికా పంపాలిసిందే అని పంతం పట్టి పంపించావు. అప్పటినుండి ఫోన్ టింగ్ అనగానే పిల్లలు ఏమైనా డబ్బు పంపించారని అనుకోవడం తప్పా, బ్యాంకు నుంచి ఒక్క మెసేజ్ రాలేదు. అదీ నీ పిల్లల ప్రేమ” అన్నాడు రాఘవ. “మీకు పెన్షన్ వస్తోంది. యింకా పిల్లలు డబ్బు మీద ఆశ ఎందుకండీ, వాళ్ళు అక్కడ సుఖం గా వుంటే చాలు” అంది. “పిచ్చదానా , సుఖం దూరం గా వెళ్ళిపోతే దొరకదే, వచ్చిన డబ్బుతో సంతోషం గా వుంటే, మన దేశం లో లేని సుఖం ఎక్కడా లేదు. అయినా నీతో వాదించి లాభం లేదులే. ఎలాగో వచ్చే నెలలో కొడుకు దగ్గరికి వెళ్తున్నావుగా.. ఆ సుఖం హాయిగా అనుభవించి రా” అన్నాడు రాఘవ. “మిమ్మల్ని కూడా రమ్మన్నాడుగా, మీరే ‘ఆ విమానం లో గంటల తరబడి కూర్చోలేను’ అని తప్పించుకున్నారు కానీ ‘అయ్యో పాపం.. నేను వెళ్లకపోతే అది ఒక్కత్తి ఎలా వెళ్తుంది’ అన్న ఆలోచన లేదు మీకు. యిటు పెళ్ళాం మీద ప్రేమ లేదు, అటు కొడుకుల మీద ప్రేమ లేదు” అంది సులోచన. అమెరికా నుంచి పెద్ద కొడుకు శ్రీధర్ వాళ్ళమ్మకి ఫోన్ చేసి వచ్చేప్పుడు కావలిసిన ఊరగాయల లిస్ట్ చెప్పేయటం, యీవిడ గారు నా వెంటపడి ‘గాజువాక లో ఎవరో బ్రాహ్మణ కుటుంబం పచ్చళ్ళు బాగా పెడతారని అన్నారు, వెళ్ళి తీసుకుని రండి’ అని నన్ను చంపడం.. అనుకున్నాడు రాఘవ. చిన్న కొడుకు వెంకటేష్ డైరెక్టుగా తండ్రికే ఫోన్ చేసి, వచ్చే అప్పుడు అమెరికా కరెంటు కి పనికి వచ్చే మిక్సీ, మీకు ఫిల్టర్ కాఫీ కోసం పెద్ద సైజ్ కాఫీ ఫిల్టర్ తీసుకుని రండి అని చెప్పటం తో బజార్ అంతా తిరిగి కొడుకు చెప్పినవి కొనుక్కుని వచ్చాడు. “నాన్నగారూ! మీరు కూడా అమ్మతో రావచ్చుగా, అందరం కలిసి టూర్ కి వెళ్ళచ్చు” అన్నారు కొడుకులు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/e8wKS-JHmy8
Embed this episode
NOW PLAYING
ఏం మిగిలింది | Em Migilindi | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.