EPISODE · Feb 5, 2023 · 15 MIN
ఎండమావులు | Endamavulu | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఎండమావులు రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) హేమంతం! ముస్సోరీలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడమీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్... వారం రోజుల సెమినార్ కోసం నేనిక్కడకి వచ్చాను. పదేళ్ళ క్రితం ఐఐటీలో ఇంజనీరింగ్ చదివిన తరువాత ఐఏఎస్ కి ఎంపికై ఇక్కడే శిక్షణ తీసుకున్నాను. దేశానికి దిశానిర్దేశం చేసే ఐఎఎస్ ఆఫీసర్లందరికీ ఇక్కడే శిక్షణ ఇవ్వబడుతుంది. బ్రిటిష్ వారు అన్ని కాలాల్లో వాతావరణం బాగుంటుందనీ ఈ అకాడమీని ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో నెలకొల్పారు. ఇది హిమాలయాలకు దగ్గర్లో ఉంది. నేను ట్రైనింగ్ లో ఉన్నపుడే కౌమోదిత పరిచయం అయి అది పెళ్ళికి దారితీసింది. సాధారణంగా ఐయ్యేయస్ లందరూ తమ సహచర బ్యాచ్ మేట్స్ నే పెళ్ళాడుతుంటారు... బయట వారిని పెళ్ళాడితే అవగాహనా లోపం వల్ల ఉద్యోగ జీవితంలో సమస్యలొస్తాయనీ ఈ పని చేస్తుంటారు... కౌమోదిత కన్నడమ్మాయి... ఆమె రాజకీయ శాస్త్రంలో డిగ్రీ చేసింది... ఇక్కడ రెండేళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసుకొన్న తరువాత మా ఇద్దరికీ ఆంధ్రా కేడర్ ఎలాట్ అయింది... ఇద్దరం పెళ్ళి చేసుకున్న తరువాత ఉద్యోగాల్లో చేరేము... ఒరిస్సా సరిహద్దులో ఉన్న జిల్లాలో ఇద్దర్నీ సబ్-కలెక్టర్స్ గా నియమించారు. మొదట్లో పనివత్తిడి ఎక్కువగా ఉండేది. చాలా మంది అనుకునేటట్లు ఐయ్యేయస్ లుక్రేటివ్ అంటే ఆకర్షణీయమైన ఉద్యోగం కాదు; డబ్బు సంపాదన కోసం అయితే ఇందులో చేరకూడదు; ప్రజలకి సేవ చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళే దీన్ని ఎంచుకోవాలి. ఈ విషయాన్ని ట్రైనింగ్ కొత్తలోనే మాకు చెబుతారు. ఉద్యోగంలో చేరిన తరువాత నాకు సమాజం మీద అవగాహన పెరిగింది. నేను ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని కావటం, ఐఐటిలో చదువువల్ల సామాన్యుడి గురించిన అవగాహన లేదు. పైగా నేను చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. బాగా విరుద్ధమైనది; దేశంలో 140 కోట్లు, రాష్ట్రంలో 5 కోట్లు... పేదవారు ఏభై కోట్లు జనాభా ఉన్న దేశం మనది. పేదవారందరికీ ప్రభుత్వ సాయం కావాలి. 'రోజూ ఆఫీసుకి అర్జీలతో వేలాదిమంది వచ్చేవారు. ఎక్కువగా గిరిజనులు, కూలి పనివారు. ఐ ఏ ఎస్ అధికారులకు పని గంటలుండవు... ఇల్లే ఓ ఆఫీసు... స్వంత సమయం ఉండదు. జిల్లాలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. మొదట్లో ఉడుకురక్తం వల్ల అందరికీ సహాయం చెయ్యాలనీ రాత్రి పగలు పనిచేసేవాడిని. ఆదివారం నాడు కౌమోదిత వచ్చేది. ఆమె పనిచేసే రెవెన్యూ డివిజన్ నేను పనిచేసే పట్నానికి వందకిలో మీటర్ల దూరంలో ఉండేది. మర్నాడు మళ్ళీ ప్రయాణం... ఇలా వివాహం జరిగిన మొదటి రెండు సంవత్సరాలు చాలా నిస్సారంగా గడిచాయని చెప్పొచ్చు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/TitNY8dxLEQ
Embed this episode
NOW PLAYING
ఎండమావులు | Endamavulu | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.