ఎవరికి వారే | Evariki Vare | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 11, 2023 · 14 MIN

ఎవరికి వారే | Evariki Vare | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఎవరికి వారే రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) స్వార్ధంతో ధర్మాన్ని తప్పితే.. ఒకనాటికి కలలు కరిగి.. కష్టాలు.. కన్నీళ్లు.. తలవంపులు తప్పవు. పరంధామయ్య, వారి అర్ధాంగి పార్వతమ్మ హైదారాబాద్ నుండి రాత్రి బస్సులో తమ స్వగ్రామానికి బయలుదేరారు. ఆ ఇరువురి వదనాల్లో ఎంతో అప్రసన్నత.. మనస్సును వేధిస్తున్న జ్ఞాపకాలను మరచి నిద్రపోవాలని ఇరువురు కళ్ళు మూసుకొన్నారు. బస్సు బయలుదేరింది. క్రిందటి రోజున వారివురూ కలసి మాట్లాడుకొని వెంటనే వారి వూరికి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చిన కారణం గా వారు బస్సులో పయనించవలసి వచ్చింది. రెండు.. వారాల క్రిందట వారు హైదరాబాదులోని తమ కొడుకులు గౌతమ్.. ఆనంద్ ల ఇంటికి..ఆనంద్ అతని భార్య అనారోగ్య కారణంగా వచ్చారు. కోడళ్ళ అభిమాన మాధుర్యాన్నిచవిచూచారు. ఆ ఇంట్లో వారికి కలిగిన చెడు అనుభవాలు.. వారిలోని సహనాన్ని హారతి కర్పూరం లా హరించిన కారణంగా.. ఆ రాత్రి పూట బస్సులో వారు ప్రయాణం చేయవలసి వచ్చింది. నిద్ర పట్టని పార్వతమ్మమెల్లగా కళ్ళు తెరచి భర్తవైపుకు చూచింది. పరంధామయ్యగారు కళ్లుమూసుకొని వున్నారు. “ఏమండీ!..” తన తలను వారి చెవి దగ్గరకు చేర్చి మెల్లగా పిలిచింది పార్వతమ్మ. ఆ పిలుపును.. ఆలకించిన పరంధామయ్య కళ్లు తెరచి.. పార్వతమ్మ ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూచాడు. “మనం ఇకపై హైదరాబాదుకు రావలసిన అవసరం వుండకూడదు కదూ!..” దీనంగా పరంధామయ్య కళ్ళ ల్లోకి చూస్తూ అడిగింది పార్వతమ్మ. “నాకు తెలిసినంత వరకూ యికపై మనకు అలాంటి అవసరం ఏమీ వుండదు పార్వతీ.. వారికి మనతో ఏదైనా అవసరం వుంటే.. వారే మనదగ్గరకు వస్తారేమో!” చిరునవ్వుతో చెప్పాడు పరంధామయ్య. వారి నవ్వులో విరక్తి గోచరించింది పార్వతమ్మకు. కొన్ని క్షణాలు వారి ముఖంలోకి చూచి.. కళ్ళు మూసు కొంది. చెడు అనుభవాలతో అలసి పోయిన ఆమె మనస్సుకు ఆ నిశీధి పవనం కొంత హాయిని కలిగించిన కారణంగా భర్త భుజంపై తలనుంచి.. పార్వతమ్మ నిద్రకు వుపక్రమించింది.కానీ.. పరంధామయ్యకు ఆ యోగం ప్రాప్తించలేదు. ఇరవైయేడు నెలల క్రిందట జరిగిన వారి షష్టి పూర్తి.. ఆరోజు మనస్సున ప్రతిబింబించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/jU26sD3VUDY

Episode metadata supplied by the publisher feed · Published Feb 11, 2023

Embed this episode

NOW PLAYING

ఎవరికి వారే | Evariki Vare | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 14:37

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!