EPISODE · Jul 22, 2023 · 11 MIN
గాజులు చేసిన పెళ్లి - పార్ట్ 1 | Gajulu Chesina Pelli Part 1 | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Gajulu Chesina Pelli Part 1/2' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy 'గాజులు చేసిన పెళ్లి - పార్ట్ 1/2' తెలుగు కథ రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఇదిగో వెంకట లక్ష్మి, నేను పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మా అక్కకి ఉత్తరం పోస్ట్ లో వేసి, అక్కడి నుండి ‘గోరాయన కొట్టు’ దగ్గరకు వస్తాను. నువ్వు కూడా అరగంటలో అక్కడ ఉండాలి” అంది కమల, పక్కింటి వెంకటలక్ష్మి తో. “అలాగే వదినా. నేనూ గాజులు కొనుక్కోవాలి. గోరాయన కొట్టు దగ్గరకే వస్తాను. కానీ నువ్వు నాకో సాయం చేయాలి” అడిగింది కమలని, వెంకటలక్ష్మి. “ఏం చేయాలి?” నవ్వుతూ అడిగింది కమల. “వచ్చేటప్పుడు రెడ్డి గారి కొట్టు దగ్గర, నాకో రేడియో కొని పెట్టాలి.. నీ రేడియో లాగే ఝాం అని మోగుతూ ఉండాలి. మా ఆయన దుబాయ్ నుంచి వచ్చేటప్పటికి నా రేడియో చూసి ఆశ్చర్య పోవాలి” కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా చెప్పింది వెంకటలక్ష్మి. ఆమె మాటలకు, కమల నవ్వుకుంది. అలాగే అని తలూపింది కమల. అత్తగారితో ‘బయటకు వెళ్తున్నాను’ అని చెప్పి రోడ్డు మీదకు వచ్చింది కమల. ఉదయం పదిగంటల సమయం. మెయిన్ రోడ్డు జనంతో బిజీ గా ఉంది. ఆరోజు సోమవారం. శ్రావణ మాసం ఆదివారం ప్రారంభం అయ్యింది. సరుకులు కొనుక్కునే వారితో, బట్టలు కొనుక్కునే వారితో షాపులు అన్నీ కిట కిట లాడుతున్నాయి. కమల బీళ్లవారి రామాలయం దాటి, కామాక్షి అమ్మవారి గుడి దగ్గరకు వచ్చింది. లోపలకు వెళ్లి అమ్మవారికి దణ్ణం పెట్టుకుంది. పూజారి సూరిబాబు “ఏం కమలా, పొద్దున్నే బయలుదేరావు? షాపింగ్ కా” అన్నాడు. “అవునండి. రేపు శ్రావణ మంగళ వారం కదండీ, గాజులు, పువ్వులు, పళ్ళూ కొనుక్కోవాలి. వస్తానండి” అని చెప్పి బయటకు వచ్చి నాలుగు అడుగులు వేసి లింగాల వీధిలోకి తిరిగింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/pGj5UOiJc8Y
Embed this episode
Ready to play
గాజులు చేసిన పెళ్లి - పార్ట్ 1 | Gajulu Chesina Pelli Part 1 | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.