EPISODE · Jul 23, 2023 · 11 MIN
గాజులు చేసిన పెళ్లి - పార్ట్ 2 | Gajulu Chesina Pelli Part 2 | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Gajulu Chesina Pelli Part 2/2' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy 'గాజులు చేసిన పెళ్లి - పార్ట్ 2/2' తెలుగు కథ రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: బుద్ధిమంతుడైన కాలేజీ కుర్రాడు చంద్రశేఖర్. అనుకోకుండా ఒక గాజుల కొట్లో అందమైన అమ్మాయిని చూసి మనసుపడతాడు. ఆ అమ్మాయి తాను చదివే కాలేజిలోనే చదువుతున్నట్లు తెలుసుకుంటాడు. ఇక గాజులు చేసిన పెళ్లి పెద్దకథ చివరి భాగం చదవండి. సాయంత్రం బి. ఎస్. సి. ఫస్ట్ ఇయర్ చదువుతున్న తమ ఊరి కుర్రాడు కిరణ్ ఇంటికి వెళ్లి, వాడిని బయటకు తీసుకువచ్చి ఆ అమ్మాయి గురించి చెప్పి, ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోమని రిక్వెస్ట్ చేసాడు. కిరణ్ చిన్న నవ్వు నవ్వి, ‘మరి దీనికి కొంచం ఖర్చు అవుతుంది’ అన్నాడు, ముత్యాల ముగ్గు లో రావు గోపాలరావు లా. ‘సరే’ అని ఓ ఏభై నోటు వాడి కిచ్చాడు చంద్ర శేఖర్. రెండు రోజుల తర్వాత ‘దేవ’ శివాలయం లో కలుసుకున్నారు శేఖర్, కిరణ్. “ఆ అమ్మాయి పేరు చంద్ర లేఖ. బ్యాంకు మేనేజర్ గారి అమ్మాయి. ఈ సంవత్సరమే శివపురం వచ్చారు. ఆ అమ్మాయి కి ఒక అన్నగారు ఉన్నాడు. తణుకు లో ‘పాల టెక్నిక్ కాలేజీ లో‘ చదువుతున్నాడు. కరాటే మాస్టారు. అది గుర్తు పెట్టుకో’ అన్నాడు కిరణ్ చేయి చాపుతూ. శేఖర్ ఇంకో ఏభై ఇచ్చాడు కిరణ్ కి. ఒక శుక్రవారం నాడు కాలేజీ అయ్యాకా చంద్రలేఖ ని ఫాలో అయ్యాడు చంద్రశేఖర్. ఆమె కన్యకాపరమేశ్వరి గుడిలోకి వెళ్ళింది. సైకిల్ గోపురం దగ్గర పెట్టి లోపలకు వెళ్ళాడు. ఐదు నిముషాలకు చంద్రలేఖ బయటకు వచ్చి కళ్యాణ మండపం మెట్ల మీద కూర్చుంది. పడమరన ఉన్న చిన్న గాలి గోపురం శిఖరం పైనుండి సూర్య కిరణాలు ఆమె మొహం పై పడి, ఆమె మొహం మరింత కాంతివంతంగా ఉంది. నెమ్మదిగా నడిచి ఆమె ముందు నిలబడ్డాడు. ఆమె తలెత్తగానే, హాయ్’ అన్నాడు. ఆమె ప్రశ్నార్ధకంగా చూసింది. “మొన్న ‘గోరాయన’ కొట్టు దగ్గర మీ గాజు ఆది ఇచ్చారు కదండీ. నాకు చాలా మేలు చేసారు. థాంక్స్” అన్నాడు. చంద్రలేఖకి ఆరోజు సంఘటన గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వింది. ముగ్ధ మనోహరమైన ఆ నవ్వు చూసి మరోసారి మనసు పారేసుకున్నాడు చంద్ర శేఖర్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/XFZy1_lMU6Y
Embed this episode
Ready to play
గాజులు చేసిన పెళ్లి - పార్ట్ 2 | Gajulu Chesina Pelli Part 2 | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.