EPISODE · Aug 2, 2023 · 8 MIN
గొడుగు | Godugu | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Godugu' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao 'గొడుగు' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అదేంటి.. గొడుగేది?” అన్నాడులోపలికి వచ్చిన భార్య సుగుణతో కుమార్. “అవును.. గొడుగేది?” అంటూ కూరల సంచి కిందపెట్టి, “బహుశా మార్కెట్ లో మర్చిపోయాను అనుకుంట, ఏ కూరల బండి మీద వదిలేసానో, మళ్ళీ వెళ్లి అడుగుతాను” అంది. “ప్రతిదానికి తయారువుతావు,గొడుగు తీసుకుని వెళ్లినిదానివి అలా మర్చిపోయి వస్తే ఎలా?” అన్నాడు ఆ గదిలోనుంచి ఈ గదిలోకి వాకింగ్ చేస్తో. “ప్రతీ గురువారం మార్కెట్ వుంటుంది, సాయంత్రం త్వరగా లేచి వెళ్లి, వారానికి సరిపడే కూరగాయలు తీసుకుని రావాలని చెప్పినా ‘నువ్వు ఎలాగో పూజకోసం పువ్వులు తెచ్చుకుంటావు కదా అదే చేతితో రెండు కూరలు కొనుక్కుని రా’ అని తప్పించుకుంటున్నారు. నా ఖర్మ కాకపోతే ఈ కొత్త గొడుగు వేసుకుని వెళ్లి మర్చిపోయి వచ్చాను” అంది చెప్పులు వేసుకుంటూ సుగుణ. “ఆగు. నువ్వు మళ్ళీ ఏం వెళ్తావు? నేను వెళ్లి అన్ని బళ్ళ వాళ్ళని అడిగి గొడుగు పట్టుకుని వస్తాను. అసలు నీలాంటి మతిమరుపు దానికి తాటకు గొడుగు కొనాలిసింది” అన్నాడు కుమార్. “అవును, కొని మీరు వేసుకుని వెళ్ళాలి, అచ్చు వామనుడి లాగా వుంటారు” అంది నవ్వుతో సుగుణ. “అంటే నేను పొట్టిగా వుంటానని అంటావా, జుట్టున్నప్పుడు నీకంటే రెండు ఇంచెలు పొడుగే, యిప్పుడు వయసు పెరిగి జుట్టు వూడి పొట్టిగా కనిపిస్తున్నాను. అవునూ.. వయసు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి పెరుగుతుంది కదా, జుట్టు వూడి గుండు మగాళ్లకే ఎందుకు అవుతుందో.. ఈ రాకెట్స్ చంద్రుడిమీదకి పంపేబదులు మీ ఆడవాళ్ళ మెదడు మీద రీసెర్చ్ చేసి, మగాళ్ళకి జుట్టు వూడకుండా మందు కనిపెడితే బాగుండును” అన్నాడు. “ఆ కనిపెడతారు కానీ, ముందు మీరు వెళ్లి పోయిన గొడుగు ఎక్కడ వుందో కనిపెట్టండి, మళ్ళీ వాన పడేడట్లుంది” అంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/b19MjXDFynQ
Embed this episode
NOW PLAYING
గొడుగు | Godugu | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.