EPISODE · Jun 21, 2023 · 28 MIN
గోదావరి నవ్వింది | Godavari Navvindi | Telugu Short Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గోదావరి నవ్వింది రచన : M R V సత్యనారాయణ మూర్తి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ దగ్గర కారు దిగి తమ్ముడి పిల్లలు, మిధున్, వరుణ్ లకు బై చెప్పి లోపలకు వచ్చాడు కృష్ణ. చెకింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యేసరికి పావుగంట పట్టింది. బోర్డింగ్ పాస్ లో ఉన్న ప్రకారం గేట్ నెంబర్ ఎనిమిది దగ్గరకు వెళ్లాడు. అప్పటికే రాజమండ్రి వెళ్ళే ప్రయాణీకులు క్యూ లో ఉన్నారు. మరలా చెకింగ్ అవుతుండగా, ముందున్న నాలుగో వ్యక్తి ని బాగా చూసిన జ్ఞాపకం వచ్చింది కృష్ణకు. ఆవిడ, చెకింగ్ పూర్తి అవ్వగానే నాలుగు అడుగులువేసి, విమానం దగ్గరకు తీసుకువెళ్ళే బస్సు ఎక్కింది. తన చెకింగ్ పూర్తి అయ్యి అతను ముందుకు వచ్చేసరికి, ఆవిడ ఎక్కిన బస్సు వెళ్ళిపోయింది. ఆ తర్వాత బస్సు ఎక్కి కూర్చున్నాడు కృష్ణ . మిగతా పాసెంజర్లు వచ్చి ఎక్కిన తర్వాత, ఐదు నిముషాలకు గానీ బస్సు బయల్దేరలేదు. అతని మనసు చాలా ఆందోళనగా ఉంది. ఆమెని తప్పకుండా కలుసుకోవాలి. ఎన్నో విషయాలు మాట్లాడాలి. బస్సు విమానం దగ్గర ఆగగానే గబ గబా దిగి, నిచ్చెన ఎక్కి విమానంలోకి వచ్చాడు. ఎయిర్ హోస్టెస్, పాస్ చూసి చిరునవ్వుతో సీట్ చూపించింది. తనూ చిన్నగా నవ్వి సీట్ దగ్గరకు వచ్చి బాగ్ పైన పెట్టి, ముందుకి చూసాడు, ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. ఇంతలో అతని పక్క సీట్ వ్యక్తి రావడంతో, కొంచెం జరిగి అతనికి దారి ఇచ్చాడు . అతనిది విండో సీట్. ముందుకు వెళ్లి ఆమెకోసం వెదుకుదామా? అనుకుని, సభ్యత కాదని ఊరుకున్నాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/3eAU2ZBNd-g
Embed this episode
NOW PLAYING
గోదావరి నవ్వింది | Godavari Navvindi | Telugu Short Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.