గోవిందా గోవింద | Govinda Govinda | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 25, 2023 · 19 MIN

గోవిందా గోవింద | Govinda Govinda | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

గోవిందా గోవింద  రచన: దాసు రాధిక (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కవిత మొహమంతా ముచ్చమటలు పట్టాయి.. కంగారుగా తుడుచుకొని ఎదురు గా అల్మారా లో కనిపించిన చీర, మ్యాచింగ్ బ్లౌసు దొరక లేదు, దొరికిందే వేసుకుని లల్లీ గది నిండా పరిచిన బొమ్మలను తీసి బుట్ట లో సర్ది పెట్టింది.. స్నానం హాయిగా చేసిన తృప్తి కలగ లేదు కవిత కు.. రోజూ కూడా అంతే.. ఎవరైనా తన కూతురిని కాసేపు కనిపెట్టు కుంటే తప్ప అది కుదరదు.. ఈ రోజు అయితే బాత్రూమ్ లోకి అడుగు పెట్టగానే ఆ వెధవ వాచ్మాన్ చూసే పిచ్చి చూపే గుర్తొచ్చింది.. నిజంగానే ఎక్కడి నుంచో చూస్తు ఉన్నాడేమో అని భయం వేసింది తనకు.. దాంతో చెమటలు పట్టేశాయి.. ఏం ఖర్మ రా బాబు.. ఇలాంటి రోజు కూడా వస్తుందని కలలో కూడా ఊహించ లేదు.. సంవత్సరం అయింది ఆ ఇంట్లోకి మారి.. రెండు నెలల క్రితం మేడ మీద ఇంకో అంతస్తు కట్టాలనే ఉద్దేశంతో పని మొదలైంది.. అప్పుడే వీరయ్య ని వాచ్మాన్ గా పెట్టి వెళ్ళాడు ఇల్లు గల ఆయన భూషణం గారు.. "ఒక్క ఆరు నెలలు ఓపిక పడితే అయిపోతుంది" అన్నాడు ప్రకాష్ కవిత తో.. ఇప్పటికి రెండు నెలల అయింది.. చుక్కలు కనిపిస్తున్నాయి కవిత కు.. ఇల్లంతా దుమ్ము, ధూళి.. ఇల్లు రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది.. కొత్త గా ఈ పని కోసమే కొన్న రోబో ను కవిత బాగా వాడుతున్నది.. కాని నెత్తి మీదే అవడం తో చాలా కష్టంగా ఉంది.. ప్రకాష్ వారం లో రెండు రోజులు- శనాదివారాలు- ఇంట్లో ఉంటేనే దుమ్ము వల్ల ఎలర్జీ వచ్చి ఎప్పుడూ జలుబు, దగ్గు తో బాధ పడుతూ ఉన్నాడు.. ఆ పై ఇద్దరు పిల్లలు.. బాబీ ఇంకా మూడింటి దాకా బడి లో ఉండి ఒక సందు అవతల ఉన్న స్కూల్ నుంచి ఆటో ఎక్కి వస్తాడు..లల్లీ అయితే పూర్తిగా అదే గాలి, దుమ్ము లో ఉంటోంది కవిత తో పాటు.. వీరయ్య ఇంటికి ముందు వైపు న ఉన్న గేటు దగ్గరే వేళ్లాడుతూ ఉండే వాడు.. గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ కి గేట్ కీ మధ్యలో కొంచెం స్థలం ఉంది.. అక్కడ తను ఇంట్లో ఉన్న రోజు కాసేపు ప్రకాష్ షటిల్ ఆడాల్సినదే కవిత తో.. లల్లీ పడుకున్న సమయంలో.. వీరయ్య దూరంగా నిలబడి చూస్తుండేవాడు.. కవిత ఆట లో అతను వచ్చాక చాలా మార్పు వచ్చింది..ఏకాగ్రత కోల్పోయింది.. వీరయ్య చూపు కవిత కు అతను వచ్చిన రోజు నుండి నచ్చ లేదు.. ప్రకాష్ కి చాలా సార్లు చెప్పింది కాని ప్రకాష్ పట్టించుకోలేదు.. వీరయ్య ప్రవర్తన ప్రకాష్ ఉన్నప్పుడు ఒక లాగా, లేనప్పుడు మరో లాగా ఉండేదని కవిత అభిప్రాయం.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Bypucd-REP8

Episode metadata supplied by the publisher feed · Published Feb 25, 2023

Embed this episode

NOW PLAYING

గోవిందా గోవింద | Govinda Govinda | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com

0:00 19:24

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 25, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!