గరుడాస్త్రం - ఎపిసోడ్ 1 | Garudashram Episode 1 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 2, 2023 · 13 MIN

గరుడాస్త్రం - ఎపిసోడ్ 1 | Garudashram Episode 1 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 1 రచన : గన్నవరపు నరసింహ మూర్తి  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గ్రీష్మం! ఎండ మండిపోతోంది. ఆ సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ఆగింది. శ్రీ హర్ష బస్సు దిగి బయట కొచ్చి ఆటో కోసం చూసాడు. ఆటో స్టాండ్ దూరంగా ఉంది... రోడ్డంతా ట్రాఫిక్ మయం కావడంతో మెల్లగా అటు ఇటు చూస్తూ అవతలికి వెళ్ళాడు. ఆటో స్టాండంతా చాలా రద్దీగా ఉంది... ఒక ఖాళీ ఆటో వెళుతుంటే దాన్ని పిలిచి ఎడ్రస్ చెప్పాడు. ఆటో వాడు మూడు వందలిమ్మన్నాడు. మూడు వందలనగానే హర్షకి చెమటలు పట్టాయి. తను 90 కిలోమీటర్లు బస్సులో వస్తే 80 రూపాయలు బస్సు ఛార్జీ. కానీ ఇక్కడ 6 కిలోమీటర్లకు మూడువందలా? అని అతనికి ఆశ్చర్యం కలిగింది. కొద్దిసేపు అక్కడే నిలబడి రెండు మూడు ఆటోలను మాట్లాడేడు. అందరూ 250, 300 చెప్పడంతో ఇంక ఆటో ఆలోచనకి స్వస్తి చెప్పి నడకకి పని చెప్పాడు. అప్పుడు సమయం 11 గంటలైంది. సూర్యుడు నెత్తిన మండిపోతుంటే ఒకటే ఉక్కబోత. జేబులో రూమాలు తీసి ముఖం కడుక్కొని బేగులో మంచినీళ్ళ సీసా తీసి నీళ్ళు తాగి మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు. రెండు కిలోమీటర్లు వెళ్ళిన తరువాత ఒక చెట్టు కనిపిస్తే అక్కడ కాసేపు నిలబడ్డాడు. ఒక్కసారిగా ఎండ  లోంచి చల్లటి నీడలోకి వెళ్ళగానే అతనికి హాయిగా అనిపించింది. మళ్ళీ ముఖం తుడుచుకొని జేబులోని ఎడ్రస్ కాగితం తీసి చూసాడు. లాయర్ కరుణాకరం, పన్నీరు వీధి... ఆర్టీసీ కాంప్లెక్స్ కి 6 కిలోమీటర్లు అని వ్రాసి ఉంది. ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని మళ్ళీ నడవటం మొదలు పెట్టాడు.. రోడ్లన్నీ వాహనాల రొదతో నిండి పోయి కనిపించాయి. కనుచూపు మేరలో మనిషి కనిపించటం లేదు. అన్నీ వేగంగా వస్తున్న వాహనాలే... వాటిని చూస్తూంటే అతనికి తన కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి. తను ఇంజనీరింగ్ లో చేరినపుడు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు సాఫ్టవేర్ రంగం అభివృద్ధి చెందటంతో యువత, ఉద్యోగాలు, కార్లు పట్నాల్లో పెరిగాయి. ఆలోచిస్తూ నడుస్తుండగానే అతను 6 కిలోమీటర్ల దూరం వచ్చేసాడు.. పక్కనే సూపర్ బజార్ కనిపిస్తోంది. ఎడ్రస్ ప్రకారం కరుణాకరం గారిల్లు సూపర్ బజార్ ఎదురుగా... సూపర్ బజార్ దగ్గరకు వెళ్ళి ఎదురుగా చూసాడు.. - ఎదురుగా మూడంతస్తుల బిల్డింగ్ అత్యంత సుందరంగా ఉంది. ఎదురుగుండా పెద్ద గేటు... గేటు రెండు తలుపుల మీద రెండు నెమళ్ళు అందంగా కనిపిస్తున్నాయి. గేటు పక్కనే కరుణాకరం, అడ్వకేట్ అన్న బోర్డు కనిపించింది.. - వెంటనే రోడ్డు దాటి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఇంటి మొదటి అంతస్తు దగ్గర ప్రణవి నిలయం అని వ్రాసి ఉంది... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/SWl5TCmzF-w

Episode metadata supplied by the publisher feed · Published Apr 2, 2023

Embed this episode

NOW PLAYING

గరుడాస్త్రం - ఎపిసోడ్ 1 | Garudashram Episode 1 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 13:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 2, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!