EPISODE · Apr 2, 2023 · 13 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 10 | Garudashram - Episode 10 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 10 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "మిస్టర్ భరద్వాజ! ఈ మిసైల్ ప్రాజెక్ట్ కి ఇంఛార్జి మీరేనా?” అని అడిగాడు. “యస్.. నేనే ఇంఛార్జిని.. ” “మరి ఈ డ్రాయింగ్ ఆ పాకిస్థాన్ గూఢచారి ఇమ్రాన్ చేతికి ఎలా వెళ్ళింది. ? ”“మిస్టర్ పరీక్షిత్! ఈ ప్రాజెక్ట్ కి ఇంఛార్జీని నేనే అయినా ఆ డిజైన్ వింగ్ కి టీమ్ లీడర్ శ్రీహర్ష.. నిజం చెప్పాలంటే ఆ డిజైన్ కాని, డ్రాయింగ్ కానీ నా వరకు రాలేదు. మా టార్గెట్ ప్రకారం ఆ డిజైన్ ఈ నెలాఖరుకి ఎప్రూవ్ చేయబడి హెడ్ క్వార్టర్స్ కి పంపాలి. ఈ రోజు ఇంకా ఐదవ తారీఖు. పదవ తేదీకి నా దగ్గరికి వస్తే నేను స్క్రూటినీ , వెరిఫై చేసి డైరెక్టర్ గారికి ఎప్రూవల్ నిమత్తం పంపిస్తాము. కానీ ఇంతవరకు నా దగ్గర కది రాలేదు” అన్నాడు భరద్వాజ. “మిస్టర్ శ్రీహర్ష! మీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరద్వాజ చెప్పినది నిజమేనా? ” పరీక్షిత్ కంఠంలోంచి బులెట్స్ లా వస్తున్నాయి ప్రశ్నలు.. ఒక్కసారి పోలీ స్టేషన్ మెట్లెక్కితే ఎంత పెద్ద అధికారి, వ్యక్తి అయినా అందరి లాగే సమాధానాలు చెప్పక తప్పదు. పోలీసుస్టేషన్ అనేసరికి ఎంత ధైర్యవంతుని కైనా తడబాటు కలుగుతుంది. సైకలాజికల్ గా డౌన్ అవుతాడు. శ్రీహర్ష కూడా అదే స్థితిలో ఉన్నాడు. “భరద్వాజ సర్ చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం. ఆ డ్రాయింగు గానీ, డిజైన్లు కానీ అతనికి పంపలేదు. అవి ఇంకా మా ఆధీనంలోనే ఉన్నాయి. అందుకు మేమే బాధ్యులం తప్ప అతను కాదు.. ఇందులో అతనికే సంబంధం లేదు” అని నిర్ద్వందంగా చెప్పాడు శ్రీహర్ష. ఆ తరువాత కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రక్షణ శాఖకి సంబంధించిన గరుడ మిసైల్ డ్రాయింగు పాకిస్థాన్ గూడాచారి దగ్గర దొరకిందనీ దానికి ఆ డిజైన్ చేస్తున్న బృందానికి నాయకత్వం వహిస్తున్న శ్రీహర్ష బాధ్యుడనీ, అతని అలసత్వం వల్లే ఆ డ్రాయింగు పాకిస్థాన్ తీవ్రదాదుల చేతుల్లోకి వెళ్ళిందన్న అభియోగంతో శ్రీహర్షని అరెస్ట్ చేసినట్టు సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వార్త దేశంలో పెను సంచలనం కలిగించింది. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లు.. పేపర్లలో హెడ్ లైన్స్.. కొన్ని ఛానళ్ళైతే 'ఎవరీ శ్రీహర్ష' అంటూ శ్రీహర్ష మీద కథనాలు ప్రసారం చేసాయి. అతని బాధ్యతా రాహిత్యం వల్లే డ్రాయింగ్ తీవ్రవాదుల చేతికి చిక్కిందని ఆరోపిస్తూ కథనాలు వండి వార్చేయి .. ఈ వార్త తెలిసి ప్రణవి దిగ్ర్భాంతికి లోనైంది. ఎంతో దేశభక్తి, నిజాయితీ కలిగిన తన భర్త శ్రీహర్ష మీద ఆరోపణలు వచ్చి అరెస్ట్ కావడం ఆమె జీర్ణించుకోలేకపోయింది.. ఆమె ఆ విషయాన్ని నమ్మలేకపోతోంది. ఎందుకిలా జరిగింది? డ్యూటీలో సిన్సియారిటీకి, డిసిప్లిన్ కి మారు పేరైన శ్రీహర్ష మీద ఎందుకింత తీవ్ర ఆరోపణలు వచ్చాయో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఈ వార్త తెలిసి ఆమె తండ్రి కరుణాకరం, తల్లి సుశీల వచ్చారు. కూతుర్ని ఓదార్చారు.. వాళ్ళని చూడగానే ప్రణవికి దుఃఖం ముందుకు వచ్చింది. కొద్ది సేపటికి తేరుకొని “డాడీ! శ్రీహర్ష ఇటువంటి పనులు ఎప్పుడూ చెయ్యడు. ఎవరో నమ్మకద్రోహం చేసారు ;అసలు ఏం జరిగిందో నేను లాకప్పుకి వెళ్ళి కనుక్కొంటాను” అని చెప్పింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/x6su9wo9Pms
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 10 | Garudashram - Episode 10 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.