EPISODE · Apr 5, 2023 · 16 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 11 | Garudashram - Episode 11 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 11 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రాత్రంతా ప్రణవి శ్రీహర్షకి బెయిల్ వస్తుందో రాదో అన్న ఉత్కంఠతో గడిపింది. బెయిల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆమె తండ్రి కరుణాకరం కోర్టులోనే ఆమెకి ధైర్యం చెప్పినా ఆమెకు నమ్మకం కుదరటం లేదు.. ఉదయం లేస్తునే ఆమెకు పిడుగు లాంటి వార్త తెలిసింది. క్రితం రాత్రి ఆఫీసు నుంచి వస్తున్న సైంటిఫిక్ అసిస్టెంట్ భావనని ఎవరో కాల్చి చంపారనీ శ్రీహర్ష స్నేహితుడు రాజు ఫోన్ చేసి చెప్పాడు. భావన పేరు వినగానే ఆమెకు ఆరోజు శ్రీహర్ష ఆఫీసులో ఆమెను పరిచయం చేసిన విషయం గుర్తు కొచ్చింది. మొన్న కస్టడీలో ఉన్నప్పుడు శ్రీహర్ష డ్రాయింగులు, రికార్డులు ఆమె కస్టడీలోనే ఉంటాయనీ, ఎవరో పాత ఎక్యూటివ్ డైరెక్టర్ వచ్చి ఆమెను కలిసాడని శ్రీ హర్ష విషయాలన్నీ ఒక్కొటొక్కటీ గుర్తుకు వచ్చాయి ప్రణవికి. అంటే ఏదో జరగబోతోంది. మిసైల్ డ్రాయింగు పాక్ గూఢచారి ఇమ్రాన్ దగ్గర దొరకడం, ఇప్పుడు ఆ డ్రాయింగులను భద్రపరిచే భావన హత్య గురికావడం.. ఇవన్నీ ఒకదాని కొకటి కలిపితే జాయినింగ్ ది డాట్స్ ; అంటే చుక్కలను కలిపితే కుట్రకోణం వైపు చూపెడుతునాయి.. వెంటనే తండ్రికి విషయం చెప్పి భావన ఇంటికి వెళ్ళింది ప్రణవి. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. ఆమె శవానికి పోస్టమార్టెమ్ పూర్తైందనీ, ఆమె స్కూటీపై వస్తుండగా ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను క్లోజ్డ్ రేంజ్ నుంచి పిస్టల్ని పేల్చారనీ, వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసికెళ్ళినా ప్రయోజనం లేకపోయిందనీ, ఆమె శరీరంలో మూడు బులెట్స్ ఉన్నాయినీ పోస్ట్ మార్టమ్ రిపోర్టులో ఉందనీ ఆ బులెట్స్ వల్లే ఆమె చనిపోయిందనీ అతను చెప్పాడు.. అవసరం అయితే అతన్ని కలుస్తానని చెప్పి వచ్చేసింది ప్రణవి. భావన హత్య దేశాన్ని ఓ కుదుపు కుదిపింది.. దేశంలో ఏదో జరగబోతోందన్న వార్తలు వెల్లువెత్తాయి.. పాకిస్థాన్ గూఢాచారుల వలలో చాలా మంది చిక్కి ఉంటారనే భావన ప్రజల్లో పెల్లుబుకింది.. ఒక్కసారిగా నిఘా విభాగాలన్నీ ఎలర్టయ్యాయి. ఆ మర్నాడు కూడా బెయిల్ పిటిషన్ మీద తీర్పు మర్నాటికి వాయిదా పడింది. ప్రణవిలో టెన్షన్ మొదలైంది. ఆమె గాబరా పడుతోంది తన గురించి కాదు శ్రీహర్ష గురించి; అతను మనసు చాలా సున్నితమైంది. తన మీద మోపిన అభియోగంతో అతను మానసికంగా చాలా కృంగిపోయాడు.. అటువంటిది బెయిల్ పిటిషన్ ఆలస్యమైతే అతను మరింతగా కృంగిపోయి నిరాశలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.. అతను బయటకొచ్చి తమందరి మధ్య ఉంటే అతనికి ధైర్యం వస్తుంది.. తను ఒంటరివాడిని కానన్న ఆలోచన అతనికి ధైర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రణవి త్వరగా బెయిల్ రావాలని కోరుకొంటోంది . కానీ అది మరింత ఆలస్యం అవుతోంది. ఈ లోగా భావన హత్య కేసుని మరింత క్లిష్టంగా మార్చింది. ఇప్పుడు కోర్టు ఏమని చెబుతుందో? సీఐడి వారి వాదన లేమిటో? అయినా భావన హత్యలో కూడా పాకిస్థాన్ గూఢచారుల హస్తం ఉందా? లేక తిన్నింటి వాళ్ళే ఈ పని చేసారా ?. ఈ కేసు నుంచి శ్రీహర్ష బయట పడతాడా? ఇంకేమైనా కుట్రలున్నాయా? అనవసరంగా శ్రీహర్ష ఈ ఉద్యోగంలో చేరాడు.. ఏ ప్రైవేట్ కంపెనీలో చేరినా తమ జీవితాలు హాయిగా గడిచి పోయేవి. ఆలోచనలతో ప్రణవి మస్తిష్కం వెడెక్కిపోతోంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఈ రోజు ఉదయం దాకా బెయిల్ వస్తుందన్న ఆశ.. కానీ ఇప్పుడు అది రేపటి దాకా వాయిదా పడింది.. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఏమిటీ కల్లోలం? ఎందుకీ ఉప్పెన? దారి కనిపించని అంధకారం.. వెలుగు ఎక్కడ? గమ్యం ఎటువైపు.. మళ్ళీ ఆమెలో ఆలోచనలు.. సాయంత్రం జైలు కెళ్ళి శ్రీహర్షని కలుద్దామని అనుకుంది కానీ అతని కేమి చెప్పాలో అర్థం కాలేదు.. ఏమి చెప్పినా అతను తట్టుకోలేడు. ఆ ఆలోచన రాగానే ఆ ఆలోచన విరమించుకుంది. ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ మర్నాడు పదిగంటలకు తండ్రితో కలిసి కోర్టుకి వెళ్ళింది. వెళ్ళిందే కానీ ఆమె మనసు మనసులో లేదు. ఏదైనా వ్యతిరేక వార్త వినవలసి ఉంటుందేమోనన్న భయం ఆమెని పట్టి పీడిస్తోంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/VSPloRjJR4E
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 11 | Garudashram - Episode 11 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.