EPISODE · Apr 9, 2023 · 15 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 12 | Garudashram - Episode 12 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి గరుడాస్త్రం - ఎపిసోడ్ 12 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ మర్నాడు సీఐడీ ఒక ప్రకటన చేస్తూ భావన హత్య కేసులో పురోగతి సాధించామని, హంతకుల వేట కొనసాగుతోందనీ రెండు రోజుల్లో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రకటన చూసి శ్రీహర్ష ప్రణవి ఆశ్చర్యపోయారు. హారిక ఫోన్ చెయ్యగానే ఇన్ స్పెక్టర్ రవీంద్ర స్పందించి ఉంటే ఆ హంతకులు దొరికేవారు. కానీ ఎందుకో ఆయన ఆ ప్రయత్నం చేయలేదు.. అదే రోజు ఒక పత్రిక సంచలనమైన వార్త ప్రచురించింది. “భావన హత్యలో పాక్ గూఢచారుల హస్తం? హత్య ఇంటి దొంగల పనే? “ అన్న శీర్షిక కింద ఆ హత్యోదంతాన్ని వివరంగా వ్రాసింది. రక్షణ శాఖలో కొన్ని పత్రాలు, కొన్ని ముఖ్యమైన ఆయుధాలకు సంబంధించిన డిజైన్స్ మాయమైన వ్యవహరంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గరుడ అనే మిసైల్ డ్రాయింగు వ్యవహారంలో శ్రీహర్ష అనే యువీ శాస్త్రవేత్తను అరెస్ట్ చేసిన సీఐడీ అసలు చేపలను వదిలేసిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికి రక్షణ శాఖలో పనిచేస్తున్న కొందరు పెద్ద అధికారుల హస్తం ఉన్నట్లు విశ్వశనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికైనా రక్షణ శాఖ ఈ విషయంలో ప్రతిస్పందించి అసలు దొంగలను పట్టుకొని అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుతునారు . " అని ఆ పేపర్ వివరంగా వ్రాసింది.. శ్రీ హర్ష ఆ వార్తని చదివి ప్రణవికి ఇచ్చాడు . ప్రణవి ఆ వార్తను చదివి "ఏదైనా భావన హంతకులు దొరికిన తరువాతే సీఐడీ ఛార్జ్ షీట్ వెయ్యగలదు ;వాళ్ళ ఛార్జ్ షీట్ చూ సిన తరువాతే మనం కేసులో ఎలా వెళ్లాలో ఒక క్లారిటీ వస్తుంది" అని చెప్పింది. “డిఫన్స్ మినిస్ట్రీ కేంద్రప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక సీబీఐ ఎంక్వయిరీ చేస్తేనే అసలు విషయాలు తెలుస్తాయి. స్టేట్ సీఐడీ అయితే అంతర్రాష్ట్రాల విషయంలో ముందుకి వెళ్ళలేదు " అని శ్రీహర్ష చెప్పాడు. ఆ మర్నాడు సీఐడి భావన హంతకులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. హంతకుల ఫొటోలను ప్రెస్ కి రిలీజ్ చేసారు. ఆశ్చర్యంగా ఆ హంతుకులిద్దరూ హారిక చిత్రించిన ఫోటోల్లోని వారు కారు. వారు వేరే వ్యక్తులు.. అదే విషయం శ్రీహర్ష ప్రణవికి చెప్పేడు.. “ఈ విషయాన్ని మనం పోలీసులకు ఛార్జిషీట్ వేసిన తరువాత కోర్టులో ప్రస్తావిద్దాం. అప్పుడు నిజనిజాలు తెలుస్తాయి” అంది ప్రణవి. ఆ తరువాత హారికకు ఫోన్ చేసి హంతకులను పోలీసులు పట్టుకున్నారన్న విషయాన్ని చెబితే ఆమె ఆశ్యర్చపోతూ” ఆ పట్టుకున్న వ్యక్తుల ఫోటోలను నేను కూడా పేపర్లో చూసాను.. కానీ వాళ్ళు కాదు. ఈ విషయంలో పోలీసులు ఘోరమైన తప్పిదాన్ని చేసారు. అవసరం అయితే నేను కోర్టు కొచ్చి అసలు హంతకులు ఎవరో కోర్టు కొచ్చీ చెబుతాను. అంతేకాక వాళ్ళు ఏ బండి మీద వచ్చారో కూడా ఆధారాలతో చెబుతాను” అని చెప్పింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/legpxR1w4Uo
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 12 | Garudashram - Episode 12 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.