EPISODE · Apr 11, 2023 · 13 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 13 | Garudashram - Episode 13 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
గరుడాస్త్రం - ఎపిసోడ్ 13 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రణవి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ప్రశ్నించడం మొదలు పెట్టింది.“మీ పేరు”? “హారిక” “ఏం చేస్తుంటారు”... "నేను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాను. పెయింటింగ్స్ వేస్తుంటాను.” “ఈ నెల 10వ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం చూసారో చెప్పగలరా?” “ఆ రోజు రాత్రి 8 గంటలకు నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండగా వర్షం పడుతుండటంతో గాంధీ సెంటర్ దగ్గర ఒక చెట్టు కింద ఆగినపుడు ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిలు మీద వచ్చి పిస్టల్ లో అక్కడికి దగ్గరలో వెళ్తున్న స్త్రీని కాల్చి పారిపోవడాన్ని నేను గమనించాను. అక్కడే లైటు ఉండటంతో వాళ్ళిద్దర్ని స్పష్టంగా చూసాను. ఆ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను.ఇంతలో అంబులెన్స్ రావడంతో నేను ఇంటికి వెళ్ళిపోయాను.నాకు పెయింటిగ్స్ వెయ్యిడం వచ్చు కాబట్టి ఆ ఇద్దరి ముఖచిత్రాలను పెయింట్ చేసాను” అంటూ రెండు చిత్రాలను ప్రణవికి చూపించింది. ప్రణవి వాటిని తీసుకొని కొద్ది సేపు పరిశీలించి జడ్జిగారికి ఇచ్చింది. “యువరానర్. ఇప్పుడు నేనిచ్చిన చిత్రాలను హరిక అనే సాక్షి స్వయంగా చిత్రించింది... ఈ చిత్రాలలో ఉన్నవాళ్ళే నిజమైన హంతకులు. కానీ పోలీసులు వీరిని కాక ఈ ఇద్దర్నీ హంతకులనీ అరెస్ట్ చేసింది” అంటూ ఓ పేపర్లో ప్రచురించబడ్డ వారి ఫొటోలను జడ్డీ గారికి చూపించింది. "యువరానర్! పోలీసులు నకిలీ హంతకుల్ని అరస్ట్ చేసారనడానికి ఇంత కన్న వేరే సాక్ష్యం కావాలా?” అని అడిగింది. పీపీ జనార్ధన్ లేచి “అబ్జెక్షన్ యువరానర్! డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన సాక్షి చెబుతున్నది నిజం అనడానికి ఆధారాలు ఏమిటి? ఎవరినైనా తెచ్చి తమకనుకూలంగా కావలసిన సాక్ష్యాన్ని చెప్పించుకోవచ్చు. ఇది తప్పడు సాక్ష్యం అని చెబుతునాను..” అంటూ కూర్చున్నాడు. - "అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్” “యువరానర్. దానికి కూడా సాక్ష్యాలున్నాయి” అనీ చెబుతుండగా జడ్జిగారు “కోర్ట్ ఈజ్ ఎడ్జర్న్డ్! కేసుని ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను “ అంటూ లేచి వెళ్ళిపోయారు.. కోర్టు సెషన్ ముగియడంతో ప్రణవి, శ్రీహర్ష బయటకొచ్చారు. కరుణాకరం వాళ్ళని కలిసారు..తండ్రికి ఆరోజు జరిగిన వాదనలు గురించి చెప్పింది ప్రణవి. “ప్రణవీ! మనం ఒకసారి పోలీస్టేషన్ కి వెళితే ఆ హంతకుల వివరాలు తెలుస్తాయి. అప్పుడు మనం మరింతగా కేసులో వాదనలు వినిపించవచ్చు” అని చెప్పాడు శ్రీహర్ష. “రేపుదయాన్నే వెళదాం!” అని చెప్పింది ప్రణవి. ఆ మర్నాడు పది గంటలకు ఇద్దరూ దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ కి వెళ్లారు. అప్పటికి రైటర్ ఒక్కడే వచ్చాడు. అతని పేరు వీరాస్వామి. శ్రీహర్ష ప్రణవి తమ గురించి చెప్పగానే వాళ్ళని గౌరవించాడు. ముఖ్యంగా ప్రణవి ప్రముఖ లాయర్ కరుణాకరం గారి కూతురనీ తెలియడంతో అతను చాలా సంతోషించాడు… Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/bmv4YxZhj5Y
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 13 | Garudashram - Episode 13 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.