EPISODE · Apr 2, 2023 · 11 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 2 | Garudashram Episode 2 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 2 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ.... శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు. కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది. గరుడాస్త్రం ధారావాహిక మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక గరుడాస్త్రం రెండవ భాగం చదవండి... ఆ తరువాత శ్రీ హర్ష అవుట్ హౌస్ లోపలి కెళ్ళాడు. అతని సామానంతా అందులో నీటుగా సర్దబడి ఉంది. యజమానురాలి ఆర్డర్స్ ని ఆ వాచ్ మేన్ వెంకన్న తూచ తప్పకుండా పాటించి అద్భుతంగా సర్దినట్లున్నాడు.. శ్రీహర్ష లోపలికెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచించసాగేడు.. ముఖ్యంగా ఆ ఇంటిలోని కరుణాకరం గారు, అతని కూతురు ప్రణవి. వాళ్ళ మర్యాదని, మంచితనాన్ని చూస్తుంటే అతని కంట నీరు చెమ్మగిల్లుతోంది.. ఒంటి గంట ప్రాంతంలో అతను భోజనం కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ప్రణవి హల్లో అతని కోసం ఎదురు చూస్తోంది. శ్రీహర్షని చూడగానే “రండి “అంటూ డైనింగ్ హాలు వైపు నడిచింది. వాళ్ళిదర్నీ చూడగానే వంటావిడ ఇద్దరికీ డైనింగ్ టేబుల్ మీద వడ్డించటం మొదలు పెట్టింది. గోంగూర పచ్చడి, వంకాయ, బంగాళా దుంపల వేపుడు, టమోటా పప్పు, సాంబారు ఘుమ ఘుమ వాసనలతో వంటకాలన్నీ ఊరిస్తున్నాయి.. - ముఖ్యంగా సాంబారు వాసన అతనికి తన అమ్మ చేసే పులుసుని గుర్తుకు తెచ్చింది. “ఏంటలా ఆలోచిస్తున్నారు. తినండి” అంది ప్రణవి. “నేను బయటతినేద్దామనుకున్నాను కదండి.. - మీరు నన్ను బాగా మొహమాట పెట్టేస్తున్నారు”, అన్నాడు హర్ష. “మీకింకా మొహం మాటం పోయినట్లు లేదు. అలా ఆలోచిస్తే మీరు అన్నం మనస్పూర్తిగా తినలేరు. అయినా మిమ్మల్ని భోజనం ఇక్కడే చెయ్యిమనీ నాన్నగారు చెప్పి మరీ వెళ్ళారు. ఇంకేం ఆలోచించకుండా తినండి” అంది తను కలుపుకుంటూ.. - Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/6yNd62wCJug
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 2 | Garudashram Episode 2 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.