EPISODE · Apr 2, 2023 · 18 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 3 | Garudashram Episode 3 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 3 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సాయంత్రం 4 గంటలకి ప్రాజెక్ట్ పని పూర్తి చేసి కాలేజీ మెయిన్ గేటు దగ్గరికి వచ్చాడు శ్రీహర్ష.. అప్పటికే చాలా మంది విద్యార్థునీ విద్యార్థులు ఇళ్ళకు వెళ్ళిపోతూ కనిపించారు. కొందరైతే హాస్టల్ వైపు వెళుతున్నారు. ఇంతలో అతని కెదురుగా కారు ఆగి తలుపు తెరుచుకుంది. డ్రైవింగ్ సీట్లో ప్రణవి.. ఆమె శ్రీహర్షని చూస్తూ “ఎక్కండి” అంది. శ్రీహర్ష వెనక తలుపు తెరుచుకొని ఎక్కుతుంటే “ఏమండోయ్.. నేనేమైనా డ్రైవర్ని అనుకుంటున్నారా? ముందు కూర్చోండి” అంది నవ్వుతూ. శ్రీ హర్షకు తాను చేసిన తప్పేమిటో తెలిసి ముందుకొచ్చి కూర్చోగానే కారు కదిలింది. కాలేజీ రోడ్డంతా రద్దీగా ఉంది.. కారు గేటు దాటి రోడ్డు మార్గం పట్టింది. “ ఈ రోజు డ్రైవర్ రాలేదా?! అని అడిగాడు హర్ష. “వచ్చేడు. ఈ రోజు మార్కెటింగ్ కదా ఆలస్యమౌతుందనీ నేనే పంపించేసా” అంది ప్రణవి.. ఆమె దృష్టి రోడ్డు మీదే ఉండటం గమనించాడు హర్ష. కొద్ది సేపటికి రోడ్డు మార్కెట్ వైపు కాకుండా ఇంకో రోడ్డులో వెళ్ళటాన్ని గమనించాడు హర్ష. “మనం వెళుతోంది షాపింగ్ కి కదా.. ఇటెక్కడికి తీసికెళుతునారు?” అని అడిగాడామెను.. “చాలా రోజులైంది బీచ్ కెళ్ళి..కాసేపు బీచ్ కెళ్ళి కూర్చొని వెళదాం”. “అప్పుడాలస్యం అవుతుంది కదా.. నాన్నగారు గాభరా పడతారేమో? అందులో డ్రైవర్ కూడా లేడు” అన్నాడు హర్ష. "డ్రైవర్ లేకపోతే ఏం? మీరు లేరా? ” అంది హర్షని క్రీగంట చూస్తూ. “మీరెప్పుడూ సూటిగా మాట్లాడరు.. మీ మాటల్లో వ్యంగ్యం, హాస్యం తొణికిసలాడుతుంటుంది” అన్నాడు హర్ష నవ్వుతూ. తాను కూడా నవ్వుతూ “ఏం మీకు హాస్యం ఇష్ట ఉండదా?” అంది. “హాస్యమంటే ఇష్టం లేని వారెవరుంటారు చెప్పండి.. అయినా హాస్యంగా ఆహ్లాదకరంగా స్పాంటేనియస్ గా మాట్లాడటం అందరికీ సాధ్యపడదు. అదొక కళ.. అలా మాట్లాడే వారు ఎప్పుడూ వత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉంటారని మా లెక్చరర్ గారు చెప్పేవారు..” అన్నాడు హర్ష. “అబ్బో! నన్ను మీ పొగడ్తలతో మునగ చెట్టెక్కిస్తున్నారే.. ఈ వయసులో కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం సహజం.. మా క్లాస్ మేట్స్ చాలా మంది నాలాగే మాట్లాడతారు. వాళ్ళ వల్లే నాకిలా మాట్లాడటం అలవాటైంది.. అయినా ఏదైనా మితిమీరకుండా ఉంటే మంచిది.. ఏమంటారు?” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/YTK8UV6cZ_A
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 3 | Garudashram Episode 3 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.