గరుడాస్త్రం - ఎపిసోడ్ 4 | Garudashram - Episode 4 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 2, 2023 · 12 MIN

గరుడాస్త్రం - ఎపిసోడ్ 4 | Garudashram - Episode 4 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 4 రచన : గన్నవరపు నరసింహ మూర్తి  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ.. శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు. కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది. ప్రణవి, ల్యాబ్ దగ్గరకు వచ్చి శ్రీహర్షను కలుస్తుంది. తన బర్త్ డే షాపింగ్ కి అతన్ని తోడు రమ్మని కోరుతుంది. ముందుగా ఇద్దరూ బీచ్ లో కొంత సమయం గడుపుతారు. బర్త్ డే సందర్భంగా ఆమె ఇంటి డెకరేషన్ లో సహాయ పడతాడు. ఇక గరుడాస్త్రం నాలుగవ భాగం చదవండి.. రెండు నెలల తరువాత ఒకరోజు శ్రీహర్ష కాలేజీ నుంచి ఇంటికి రాగానే కరుణాకరం గారు పిలుస్తున్నారని వాచ్ మేన్ చెప్పాడు. వెంటనే పుస్తకాలు గదిలో పడేసి అలాగే అతనికి దగ్గరికి వెళ్ళాడు. కరుణాకరం గారు తన ఆఫీసు రూమ్ లో కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తున్నాడు. శ్రీ హర్షని చూడగానే కూర్చోమని కుర్చీ చూపించి, ఫైలు చదవడంలో నిమగ్నమయ్యాడు. కొద్ది సేపటికి అది పూర్తి కావడంతో ఫైలుని పక్కన పెట్టి  “ఏవయ్యా! కాలేజీ కి వెళ్ళావా?” అని అడిగాడు. “వెళ్ళాను సార్.. ఇప్పుడే వచ్చేను”. “ఇది ఫైనలియర్ కదా? ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందా?” అని అడిగాడు కరుణాకరం. "ఫైనలియర్లో రెండు సెమిస్టర్స్ ఉంటాయి. ఆఖరి సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ చెయ్యాలి. కానీ మేము టైము సరిపోలేదని ఇప్పుడే మొదలెట్టాము “. - అని చెప్పాడు హర్ష. “దసరా సెలవులు ఎప్పట్నుంచి?” “సార్! ఎల్లుండి నుంచే” “శలవులకి ఏమిటి నీ ప్రోగ్రాం?” “ మా ఊరు వెళ్లాలనుకుంటున్నాను. అమ్మ రమ్మనమని చెబుతోంది..... ” “అది సరే... నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? మా ఫ్రెండ్ కూతురి పెళ్ళి మళ్ళీ వారం కోనసీమలో జరగబోతోంది. నన్ను రమ్మనమని మరీ మరీ చెప్పాడు. కానీ ఆ సమయంలో నాకు ఢిల్లీలో అర్జెంట్ కేసు విషయమై సుప్రీం కోర్టుకి వెళ్ళవలసిన అవసరం పడింది. అందుకు నేను వెళ్ళడం కుదరదు. ప్రణవిని ఆ పెళ్ళికి పంపుతున్నాను; నేను మీ నాన్నకి అమ్మకి చెబుతానే తరువాత వెళుదువుగాని , నువ్వు ప్రణవికి తోడుగా వెళ్ళు, వంటరిగా దాన్ని పంపడం నా కిష్టం లేదు” అని చెప్పాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/cUkEMsmU4a4

Episode metadata supplied by the publisher feed · Published Apr 2, 2023

Embed this episode

NOW PLAYING

గరుడాస్త్రం - ఎపిసోడ్ 4 | Garudashram - Episode 4 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 12:09

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 2, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!